దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

షేర్ చేయండి

భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.

ప్రకృతి ఒడిలో సేదతీరాలు జలపాతం నీటిలో తడిసిపోవాలి అనుకునే వారి కోసం ఇక్కడ జోగ్ జలపాతం నుంచి పంబార్ ఫాల్స్ వరకు ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఫాల్స్ (Waterfalls) ఎన్నో ఉన్నాయి. అందులో 8 జలపాతాలు ఇవే!

జోగ్ జలపాతం , కర్ణాటక

Waterfalls In South India
జోగ్ జలపాతం

Jog Falls, Karnataka : భారత దేశంలో ఉన్న ఎత్తైన జలపాతాల్లో జోగ్ పాల్స్ కూడా ఒకటి. దీని ఎత్తు 253 మీటర్లు కాగా చూడ్డానికి ఇది కొంచెం డ్రామాటిక్ ఫాల్స్‌లా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ షరావతి నది రెండు పాయలుగా చీలి రాజా,రాణి, రోవర్, లేడీ అనే అందమైన జలధారలను క్రియేట్ చేస్తుంది. 

కొండల అంచుల నుంచి జాలే ఈ జలపాతం అందాన్ని పొగడటం ఒక కళ. ఇక్కడికి వెల్లాలనుకోవడం ప్రీ ట్రావెలర్ కల.

అతిరపల్లి ఫాల్స్, కేరళ

Athirapally Falls, Kerala
అతిరపల్లి జలపాతం

Athirapally Falls, Kerala : ఈ జలపాతాన్ని నయాగరా ఆఫ్ ఇండియా (Niagara Of India) అని కూడా పిలుస్తుంటారు. అతిరపల్లి జలపాతం అనేది 24 మీటర్ల ఎత్తులోంచి అడవుల నుంచి జాలువారే అందమైన నీటి ధార. 

ఇక్కడి చాలాకుడ్య నది, చుట్టుపక్కన ఎటు చూసినా పరుచుకుని ఉన్న పచ్చదనం, ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుంది. 

దూద్ సాగర్ వాటర్ ఫాల్స్

Dudh Sagar Waterfalls : గోవా కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఈ జలపాతం జాలు వారే తీరు చూస్తే ఏదో పాలకుండ నుంచి పాలు ధారలా పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే దీనిని దూద్ సాగర్ అంటారు. దూద్ అంటే హిందీలో పాలు అని అర్థం వస్తుంది.

భగనవాన్ మహావీర్ వన్యప్రాణి (Bhagavan Mahavir Wildlife Sanctuary) సంరక్షణ కేంద్రానికి వెళ్లడం అనేది ఒక సాహసయాత్రే అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ఈ జలపాతం అందం రెట్టింపు అవుతుంది. 

హోగెనక్కల్ జలపాతం, తమిళనాడు

Hogenakkal Falls, Tamil Nadu : హోగెనక్కల్ జలపాతం అనేది ఒక పౌరాణికి సినిమాలో సెట్‌లా ఉంటుంది. చిన్న చిన్న కొండల మధ్యలోంచి వెళ్లే నీటిలో తెప్పలేసుకుని పర్యాటకులు సవారీ చేస్తుంటారు. 

ఇది ఒక అందమైన, సాహసోపేతమైన పర్యాటక క్షేత్రంగా మారింది. వర్షాకాలంలో ఈ జలపాతం ఒక మ్యాజికల్ ఫాల్స్‌లా కనిపిస్తుంది. 

పంబార్ ఫాల్స్, తమిళనాడు 

Pambar Falls, Tamil Nadu : కొడైకనాల్ వెళ్తె పర్యాటకులు తప్పకుండా వెళ్లే ప్రాంతాల్లో పంబార్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఇది చాలా ప్రశాంతమైన అందమైన 10 మీటర్ల ఎత్తైన జలపాతం. 

సిరువాణి జలపాతం | Waterfalls In South india

Siruvani Falls, Tamil Nadu : సిరువాణి నది నుంచి ఏర్పడే ఈ జలపాతంలో నీరు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. 50 మీటర్ల ఎత్తైన ఈ జలపాతం అనేది నేచర్ లవర్స్‌కు బాగా నచ్చుతుంది.

అగస్తియార్ ఫాల్స్, తమిళానాడు

Agasthiyar Falls, Tamilnadu : ఈ జలపాతానికి ఈ పేరు అగస్త్య ముని పేరుమీదుగా పెట్టారు. 30  మీటర్ల ఈ జలపాతం చాలా ప్రశాతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక భావన కూడా కలుగుతుంది. 

దీంతో పాటు మీరు పశ్చిమ కనుమల అందాన్ని కూడా వీక్షించవచ్చు.

కావేరీ ఫాల్స్, కర్ణాటక

Cauvery Falls, Karnataka : కావేరి నదిలో భాగం అయిన పవిత్ర జలపాతం ఎత్తు 15 మీటర్లు ఉంటుంది. ఈ జలపాతం తన ప్రాకృతిక సౌందర్యానికి మాత్రమే కాదు పవిత్రతకు కూడా ప్రసిద్ధి చెందినది. సివనసముద్ర వంటి అనేక జలపాతాలు కావారీ నది వల్లే ఏర్పడి అలరిస్తున్నాయి.

దక్షిణాదిలో ఉన్న జలపాతాలు (Waterfalls In South india) అనేవి కేవలం సాహసానికి, పర్యాటకానికి కేంద్రాలు మాత్రమే కాదు. ఈ జలధారలకు ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉంది. అందుకే ఎక్కడికైనా తెలుసుకుని వెళ్లడం ఉత్తమం. పర్యాటక ప్రదేశాలు, వార్తలు, విశేషాల కోసం ప్రయాణికుడు డాట్ కామ్ చూడటం అత్యుత్తమం.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!