మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

షేర్ చేయండి

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

మరికొద్ది రోజుల్లోనే మహాకుంభ మేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.

ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది. ఈ టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లోని ( Prayagraj ) సంగం పాయింట్ నుంచి కేవలం 3.5 కిమీ దూరంలోనే ఉంది. మీ ఆధ్మాత్మిక ప్రయాణాన్ని సౌకర్యంగా మార్చేలా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.

మహాకుంభ గ్రామంలో సదుపాయాలు | Facilities in Maha Kumbh Gram

IRCTC Maha Kumbh Gram (1)
| మహా కుంభ గ్రామం | Photo Source : IRCTC Through Pankaj Shulka

మహాకుంభ గ్రామంలో ( IRCTC Maha Kumbh Gram ) నివసించడం అనేది ఒక మంచి అనుభవం కానుంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది పవిత్ర స్నానాలు ఆచరించే ఘాట్లకు చేరువలో ఉంటుంది. టెంట్ సిటీలో లగ్జరీ టెంట్స్, విల్లాస్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలు ఉంటాయి.ఇందులో ప్రశాంతంగా కూర్చునేందుకు సిట్టింగ్ ఏరియా, ఆధ్మాత్మిక కార్యక్రమాల తరువాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి టీవి కూడా ఉంటుంది.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఎకామడేషన్ విషయానికి వస్తే ఇందులో సూపర్ లగ్జరీ టెంట్స్, విల్లా టెంట్స్ ఉంటాయి. ప్రతీ టెంటులో సెపరేట్ బాత్రూమ్, అందులో వేడి చల్లని నీల్లు ఉంటాయి. బెడ్ లైనిన్, సోప్స్ ఇతర టాయిలెటరీస్ కూడా అందిస్తారు. విలాసవంతమైన సదుపాయాలు కావాలి అనుకునే వారు విల్లా టెంట్స్ ఎంచుకోవచ్చు.

తీర్థయాత్రికుల ( Pilgrimage To Maha Kumbh Mela 2025 ) కోసం మంచి సెక్యూరిటీ, సీసీటీవి సర్వీలెన్స్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు.

బుకింగ్ ఎలా చేసుకోవాలి ? | How To book Maha Kumbh Gram Tent?

మహాకుంభ గ్రామంలో వసతిని బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటీసి సింపుల్ ప్రాసెస్‌ను ( Maha Kumbh Gram Tent booking Process ) అందుబాటులోకి తెచ్చింది. మీరు స్టెప్ బై స్టెప్ ఈ కింది సూచనలను పాటించి మీ టెంటును బుక్ చేసుకోవచ్చు.

IRCTC Maha Kumbh Gram (1)
టెంటు లోపల ఇలా ఉంటుంది | Photo Source : IRCTC Through
  1. వెబ్ సైట్ విజిట్ చేయండి.
    ముందుగా మీరు ఐఆర్‌సీటీసి వెబ్‌సైట్ [www.irctctourism.com/mahakumbhgram] లేదా (http://www.irctctourism.com/mahakumbhgram) ను విజిట్ చేయండి.
  2. లాగిన్ లేదా రిజిస్టర్ చేసుకోండి
    ఒక వేళ మీరు ఐఆర్‌సీటీసి యూజర్ అయితే లాగిన్ చేయండి. లేదంటే మీ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ వంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
  3. బుకింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టండి
    మహా కుంభ గ్రామ హోం పేజిలో బుక్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  4. మీ వివరాలు ఎంటర్ చేయండి
    ఇక్కడ మీరు మీ ప్రయాణ వివరాలు, చెకిన్ చెకౌట్ తేదీలు, ఎన్ని రూమ్స్ కావాలి, ఎంత మంది ఉంటారో తెలపాల్సి ఉంటుంది.
  5. మీ టెంటును ఎంచుకోండి
    తరువాత మీకు సూపర్ డీలక్స్ టెంట్స్, విట్లా టెంట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.మీ బడ్జెట్ అండ్ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి ఎంచుకోండి.
  6. మీ వ్యక్తిగత వివరాలు
    బుకింగ్ ప్రక్రియను మరో అడుగు ముందుకు తీసుకెళ్లడానికి మీ వ్యక్తిగత వివరాలు అంటే పూర్తి పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, స్పెషల్ రిక్వెస్ట్‌లు ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయండి.
  7. పేమెంట్ విధానాన్ని ఎంచుకోండి
    ఇక చెల్లింపుల ప్రక్రియ విషయానికి వస్తే మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీ ఐ, డిజిటల్ వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు చేసే ముందు ఏమైనా హిడెన్ చార్జీలు ఉన్నాయో చెక్ చేయండి.
  8. బుకింగ్‌ కన్ఫర్మ్ చేసుకోండి
    పేమెంట్ ప్రక్రియ పూర్తి అయితే మీ బుకింగ్‌ కన్ఫర్మ్ అయినట్టు ఒక మెసేజ్ అండ్ మెయిల్ వస్తుంది. ఇందులో మీ బుకింగ్ వివరాలు ఉంటాయి.

ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర

మహాకుంభ్ అనేది ఒక ఆధ్మాత్మిక యాత్ర మాత్రమే కాదు. ఇది భారతీయ సంప్రదాయం, సనాతన ధర్మం విశిష్టతను ప్రపంచానికి చూపే ఆధ్యాత్మిక వేడుక. 45 కోట్ల మంది భక్తులు ఈ కుంభ మేళాలో పాల్గొనున్నారు. అందుకే ముందస్తుగా టికెట్లు, వసతి ఇతర ప్యాకేజీలు బుక్ చేసుకుంటే ఉత్తమం.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది.


| పండరీ పురంలో 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం ఎలా సాధ్యం అయింది ?

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!