భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…
ముఖ్యాంశాలు
గంగా నది ఎక్కడ జన్మించింది ? | Birth Place Of Ganges

పవిత్ర గంగానది ఉత్తరాఖండ్‌లోని దేవ్ కాశీజిల్లాలో ఉన్న గంగోత్రి మంచు పర్వతాల నుంచి ఉద్భవించింది. గంగా నది పుట్టిన ప్రాంతాన్ని గోముఖ్ ( Gomukh ) అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న గ్లేషియర్ గోవు నోటి భాగంలో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి దీనిని గోముఖ్ అని పిలుస్తారు. గోముఖ్ నుంచి ప్రయాణం మొదలు పెట్టి ఎన్నో రాష్ట్రాలు దాటి బంగాళా ఖాతంలో కలుస్తుంది. అయితే గంగా నదికి ఒక రూపం వచ్చేది మాత్రం దేవ్ ప్రయాగ్‌లోనే..ఈ ప్రాంత విశేషాలు

దేవ్ ప్రయాగ్ | Dev Prayag River Ganga

ప్రతీ హిందువు తన జీవితంలో చూడాలి అనుకునే ప్రాంతాల్లో దేవ్ ప్రయాగ్ కూడా ఒకటి. రెండు పవిత్ర నదులు కలిసిన తరువాత ఇక్కడే గంగా నది ఏర్పడుతుంది. దేవప్రయాగ్ ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉంది. దేవప్రయాగ్ అనేది అలకనంద నదికి చెందిన పంచ ప్రయాగ్‌లో ( Panch Prayag ) ఒకటి. . ఇందులో విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగతో పాటు మీరు ఇప్పుడే చూస్తున్న దేవ్ ప్రయాగ కూడా ఒకటి.
మీకు తెలుసా? ప్రయాగ్ అంటే పవిత్ర నదులు కలిసే చోటు

దేవ్ ప్రయాగ్ నుంచి గంగా నది తన పేరుతో ప్రయాణించడం మొదలు పెడుతుంది. ఈ ప్రాంతం రిషికేష్ నుంచి సుమారు 68 కిమీ దూరంలో ఉంటుంది. గంగోత్రి మంచుపర్వతాల నుంచి ప్రవాహించే భగీరథి నది ( Bhagirathi ), చమోలీ జిల్లా నుంచి మొదలయ్యే అలకనందా ( Alaknanda ) నదులు ఈ ప్రాంతంలో కలిసి పవిత్ర గంగా నదిని ఏర్పరుస్తాయి. దేశ్ ప్రయాగ్‌కు ఆధ్మాత్మికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి.ఇక్కడ శ్రీరాముడి ఆలయం చాలా పాపులర్ డెస్టినేషన్. దేవ్ ప్రయాగ్‌లో చంద్రబదాని, దశరథుని దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
పర్యాటక క్షేత్రం

దేశ్ ప్రయాగ్‌కు ఆధ్మాత్మికంగానే కాదు పర్యాటకంగానూ ప్రాధాన్యత ఉంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ( Badrinath ) , హేంకుండ్ సాహిబ్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా దేవ్ ప్రయాగ్‌లో ఆగి వెళ్తారు. జూన్ నుంచి నవంబర్ మధ్యలో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఆధ్మాత్మికంగానే కాదు అడ్వెంచర్ టూరిజం కోసం కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
దేవ్ ప్రయాగ్ ఎలా వెళ్లాలి ? | How to reach Dev Prayag ?
మీరు దేవ్ ప్రయాగ్‌లో గంగా నది ఏర్పడే చోటుకు రావాలంటే హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి మీకు ఆర్టీసీ బస్సులు, ప్రైవట్ బస్సులు, రెండెట్ బైక్స్ అండ్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. దగ్గర్లో మీకు డెహ్రాడూనలో జాలీ గ్రాంట్ ( Jolly Grant Airport ) విమానాశ్రయం కూడా అందుబాటులో ఉంటుంది. మీరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఢిల్లీకి చేరుకోని హరిద్వార్, రిషికేష్ ( Rishikesh ) నుంచి దేవ్ ప్రయాగ్‌కు చేరుకోవచ్చు. లేదా డైరక్టుగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మీకు ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. మీరు బైక్ రెంటుపై తీసుకుని కూడా రావచ్చు.
అందమైన సంగమ ప్రదేశం

గంగానది ప్రత్యేకత ఏంటి అంటే అది ప్రవాహించే ప్రాంతాలు పవిత్రంగా ఉండటమే కాదు చాలా అందంగా కూడా ఉంటాయి. దేవ్ ప్రయాగ్ కూడా చాలా అందంగా , ప్రకృతి రమణీయతతో పర్యాటకులను, భక్తులను ఆకట్టుకుంటుంది. హిమాలయాల ( Himalayas ) ఒడిలో ఉన్న ఈ ప్రదేశం నిత్యం పచ్చదనంతో కళకళ లాడుతుంది.
గడ్వాల్ సంప్రదాయాలకు ప్రతీక | Heritage Of Garwal Region
దేవ్ ప్రయాగ్ ఉత్తారఖండ్‌లోని గడ్వాల్ ప్రాంతంలో ఉంటుంది. జస్ట్ లైక్ మన ఆంధ్రా, తెలంగాణ, రాయల సీమ అని ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఉత్తరాఖండ్‌లో గడ్వాల్, కుమావ్ ( Kumaon ) అనే ప్రాంతాలు ఉన్నాయి. కుమావ్ ప్రాంతంలో పర్వతాలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ రఫ్‌గా ఉండవు. అందంగా కనిపిస్తాయి. ఇందులో మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. ఇక గడ్వాల్ ప్రాంతం విషయానికి వస్తే మొత్తం 6 జిల్లాలు ఉన్న ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉంటాయి. పర్వతాలు చాలా రఫ్‌గా ఉంటాయి. గడ్వాల్ ప్రాంత ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి అనుకుంటే దేవ్ ప్రయాగ్ వెళ్తే చాలు.
దేవ్‌ప్రయాగ్‌లో వాతావరణం : Dev Prayag
దేవ్ ప్రయాగ్‌లో సీజన్ను వాతావరణం మారిపోతుంది. ఎండాకాలం ఇక్కడ ఆహ్లదకరంగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో స్నో కూడా పడుతుంది. దేవ్ ప్రయాగ్ వెళ్లే ముందు అక్కడి వాతావరణం ఇతర సదుపాయాల గురించి తెలుసుకోండి. ట్రావెల్, టూరిజంకు సంబంధించిన కథనాల కోసం ప్రయాణికుడు వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండండి. ట్రావెల్ వీడియోల కోసం ప్రయాణికుడు య్యూ ట్యూబ్ ఛానెల్ చూస్తూ ఉండండి.
గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది.
Trending Video On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్