Republic Day 2025 : ఢిల్లీ రిపబ్లిక్‌ డే పరేడ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా ?

షేర్ చేయండి

2025 జనవరి 26న భారత దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ( 76th Republic Day 2025 ) వైభవంగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఢిల్లీలో జరిగే పరేడ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ పరేడ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జరిగే ప్రదేశాలు, ధరలు మరెన్నో విషయాలు తెలుసుకుందామా ?

ఈ ఏడాది వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ( Prabowo Subianto ) ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.

దీనికి సంబంధించిన రిహర్సల్స్ కూడా జరుగుతున్నాయి.

( Source : AIR News \x.com )

ఇలా ఈసారి పరేడ్‌లో మరెన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. మరి ఈ పరేడ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జరిగే ప్రదేశాలు, ధరలు మరెన్నో విషయాలు తెలుసుకుందామా ?

రిపబ్లిక్‌ డే పరేడ్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? 

How to Book Republic Day Parade Tickets :  రిపబ్లిక్ డే పరేడ్ టికెట్లను మీరు రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్‌‌లో, రెండవది ఆఫ్‌లైన్‌లో. ముందుగా ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో చూడండి. | Online Booking | కోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  1. అధికారిక వెబ్‌సైట్ : బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

 ( https://aamantran.mod.gov.in/login)

  1. ఈవెంట్‌ను ఎంచుకోండి :  మీరు రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్తున్నారా లేక బీటింగ్ రిట్రీట్ సెర్మనీకి వెళ్తున్నారా అని నిర్ణయించుకున్నాక ఆ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
  2. వెరిఫికేషన్ : మీ ఐడీ, వివరాలు, మొబైల్ నెంబర్‌తో వెరిఫికేషన్ పూర్తి చేయండి.
  3. పేమెంట్ :  మీకు కావాల్సినన్ని టికెట్లు ఎంచుకుని, పేమెంట్ చేసే విధానాన్ని సెలెక్ట్ చేసుకుని డబ్బు చెల్లించండి.  
  4. కన్ఫర్మేషన్ : పేమెంట్ పూర్తి చేసిన తరువాత మీ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.

దీంతో పాటు మీరు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆమంత్రన్ మొబైల్ యాప్ ( Aamantran mobile app ) కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు యాండ్రాయిడ్ ( Google Play Store ) , ఐఓఎస్ ( App Store ) రెండు వర్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో టికెట్ సెక్షన్లోకి వెళ్లి సూచనలు పాటించి బుకింగ్ పూర్తి చేయవచ్చు.

ఇక ఆఫ్‌లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూడండి | Offline Booking | కోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఢిల్లీలో ( Delhi ) పలు కౌంటర్లు అందుబాటులో ఉంటాయి అక్కడికి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

  • టికెట్లు అమ్మే తేదీలు :  2025 జనవరి 7వ తేదీ నుంచి 2025 జనవరి 25 వరకు
  • కౌంటర్ టైమింగ్ :  సోమవారం నుంచి శనివారం ఉదయం 10 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు. 
  • ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
  • గమనిక : జనవరి 23 నుంచి 25 వరకు సేనా భవన్ వద్ద ఉన్న టికెట్ కౌంటర్ సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. 
  • ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్

ఆఫ్‌లైన్‌ బుకింగ్ కోసం కావాల్సిన డ్యాక్యుమెంట్స్ 

republic day 2025
| ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్‌లైన్‌లో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లే ముందు ఫోటో ఐడీకార్డు తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఇందులో ఏదో ఒకటి మీ వద్ద ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి.

  • ఆధార్ కార్డు
  • ప్యాన్ కార్డు
  • ఓటర్ ఐడీ కార్డు
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి తీసుకెళ్లండి. 

టికెట్ బుక్ చేసుకునే కౌంటర్ లోకేషన్ 

ఎంట్రీ టికెట్ కొనుగోలు చేయడానికి ఈ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు.

  • నార్త్ బ్లాక్ 
  • సేనా భవన్ ( గేట్ నెం. 2 )
  • ప్రగతి మైదాన్  ( గేట్ నెం.1 )
  • జంతర్ మంతర్ ( మెయిన్ గేట్)
  • శాస్త్రీ భవన్ ( గేట్ నెం. 3 సమీపంలో )
  • జామ్‌నగర్ హౌజ్ ( ఇండియా గేట్ సమీపంలో )
  • ఎర్రకోట ( జైన్ ఆలయం ఎదురుగా ఆగస్ట్ 15 పార్క్ వద్ద )
  • పార్లమెంట్ హౌజ్ ( రిసెప్షన్ ఆఫిస్ ) – పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేక కౌంటర్

టికెట్ ధరలు | Republic Day Parade Ticket Prices

రిపబ్లిక్ డే ( Republic Day 2025 ) సందర్భంగా అనేేక కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాన్ని బట్టి నిర్ణయించిన ఎంట్రీ టికెట్ ధరలు ఇవే

  • రిపబ్లిక్ డే పరేడ్ రూ. 100 అండ్ టికెట్‌కు రూ.20 వరకు
  • బీటింగ్ రిట్రీట్ ఫుడ్ డ్రెస్ రిహర్సల్ : టికెట్టుకు రూ.20
  • బీటింగ్ రిట్రీట్ సెర్మని : టికెట్‌కు రూ.100
పరేడ్ గ్రౌండ్‌కు ఎలా వెళ్లాలి ? | How To Reach Parade Ground

రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పథ్ ( Kartavya Path ) మార్గానికి చేరుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ , ఢిల్లీ మెట్రోతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సందర్శకులు చేరుకోవాల్సిన మెట్రో స్టేషన్ల వివరాలు ఇవే.

  • యెల్లో లైన్ : ఉద్యోగ్ భవన్ స్టేషన్
  • యెల్లో, వైయెలెట్ లైన్ : సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ 

భారత దేశ వారసత్వం ( Indian Heritage ), శౌర్య ప్రతాపాలను చాటే అత్యుత్తమ వేదికే రిపబ్లిక్ డే పరేడ్. దీనిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని టైమ్‌కు చేరుకుని 2025 రిపబ్లిక్ డే పరేడ్‌ ( Republic Day 2025 ) వైభవాన్ని చూసేయండి.

ఢిల్లీలో ఆటోనే హోటల్ అయింది…7 గంటల్లో 7 ప్రదేశాలు కవర్ చేశాను
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu whatsapp
| ప్రయాణికుడు ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!