రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్‌సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..

భారతీయ రైల్వే కొత్తగా బుక్ నౌ పే లేటర్ ఆప్షన్‌ను ( IRCTC Book Now, Pay Later ) తీసుకువచ్చింది. ఈ స్కీమ్ వల్ల ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో వెంటనే డబ్బు చెల్లించే అవసరం లేదు. టికెట్ బుకింగ్ సమయంలో సరైన డబ్బు లేని ప్రయాణికుల కోసం ఈ సదుపాయన్ని తీసుకొచ్చారు. ఈ పే లేటర్ స్కీమ్ అనేది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్‌లో అందించే ఈ వ్యాలెట్ సర్వీసులో భాగం. దీని వల్ల ప్రయాణికులు నిర్ణీత గడువలో తమకు నచ్చిన తేదీల్లో డబ్బు చెల్లించవచ్చు.
Table Of Contents
లాభాలు | Benefits IRCTC Book Now, Pay Later Scheme
ముందు బుక్ చేసుకోండి తరువాత చెల్లించండి అనే ఈ స్కీమ్ వల్ల ప్రయాణికులకు కలిగే లాభాల్లో కొన్ని ఇవే…
- ముందస్తుగా పేమెంట్ చేసే అవసరం ( IRCTC Pay Later ) లేకుండా టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ కోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించే అవసరం లేదు.
- మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు చెల్లించే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ? | How to Register IRCTC Book Now, Pay Later’ Scheme

ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) అందిస్తున్న తరువాత చెల్లించండి అనే ఆప్షన్‌ను వినియోగించుకోవాలి అంటే ప్రయాణికులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. ముందుగా ఈ పేలేటర్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మీ ఐఆర్‌సీటీసి ఖాతాను రిజిస్టర్ చేసుకోండి.
విజిట్ చేయాల్సిన వెబ్‌సైట్స్ : www.epaylater.in లేదా http://www.epaylater.in
2. ఇందులో ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత బుక్ నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
3.ప్రయాణికుల వివరాలు అందించి క్యాప్చా కోడ్ ప్రాసెస్ పూర్తి చేయండి.
4. పేమెంట్ చేసే సమయంలో మీకు పే లేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
5. ఆ ఆప్షన్ ఎంచుకుంటే డబ్బు చెల్లించకుండానే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
షరతులు | Terms and Conditions
1. మీరు బుక్ నౌ పే లేటర్ స్కీమ్ వినియోగించుకున్నాక 14 రోజుల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
2. ఒక వేళ పేమెంట్ లేట్ అయితే ప్రయాణికులు 3.5 శాతం సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
3. 14 రోజుల్లో చెల్లిస్తే మాత్రం ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
రిజిస్ట్రేషన్, పేమెంట్ ప్రాసెస్ | Registration and Payment Process
ఈ స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే మీరు [www.epaylater.in] లేదా (http://www.epaylater.in) వెబ్‌సైట్లను విజిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఉన్న సూచనలు పాటిస్తే పే లేటర్ ఆప్షన్‌తో మీరు టికెట్ బుక్ చేసుకోగలరు.
అదనపు నూచనలు:
- ఈ సమాచారాన్ని కేవలం అవగాహన కోసం అందించడం జరిగింది.
- మీరు ఏ స్కీమ్‌లో అయినా రిజిస్టర్ అవ్వడానికి ముందు మీ ఆర్థిక సలహాదారులు, లేదా నిపుణుల సూచనలు తీసుకొని, షరతులను పూర్తిగా అర్థం చేసుకోండి.
- పైన వివరించిన సమాచారాన్ని Prayanikudu.com గానీ లేదా వెబ్‌సైట్ నిర్వాహకులు గానీ నిర్ధారించలేదు.
- ఈ స్కీమ్ కోసం అప్లై చేసే ముందు ప్రయాణికులు పూర్తి వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తానికి
భారతీయ రైల్వే తీసుకువచ్చిన బుక్ నౌ పే లేటర్ స్కీమ్ అనేది రైల్వే బుకింగ్ ( Railway Ticket Booking ) విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఇకపై డబ్బు చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు తరువాత 14 రోజుల్లో చెల్లించవచ్చు. ఒక వేళ లేట్ అయితే మాత్రం 3.5 శాతం సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. టైమ్‌కు పే చేస్తే ఎలాంటి చార్జీలు చెల్లించే అవసరం లేదు. ఈ స్కీమ్‌ను మీ అవసరానికి తగిన విధంగా ఉపయోగించి లబ్ధి పొందుతారు అని ఆశిస్తున్నాం.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
రీడర్స్ ఇష్టపడి చదివిన స్టోరీస్ ఇవే !
- ఇది కూడా చదవండి : ఏంటి జపాన్ మరీ ఇంత శుభ్రంగా ఉంటుందా ? | తెల్ల సాక్సులతో నడిచిన వ్లాగర్
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
- ఇది కూడా చదవండి : Thailand : భారతీయులను అయస్కాంతంలా లాగేస్తున్న థాయ్‌లాండ్ | 11 కారణాలు ఇవే !
- ఇది కూడా చదవండి : First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
- ఇది కూడా చదవండి : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి