Travel Like Varun Tej : వరుణ్‌తేజ్‌‌లో ఒక మంచి ప్రయాణికుడు ఉన్నాడని తెలుసా? ఈ ఫోటోలు చూడండి

షేర్ చేయండి

వరుణ్ తేజ్ తరచూ ప్రయాణాలు చేస్తూ వాటికి సంబంధించిన ( Travel Like Varun Tej ) ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అవి చూశాక అనిపిస్తుంది “Varun Tej Is A Prayanikudu”  అని. అయితే ఈ పోస్టులో లొకేషన్ ఉండదు కాబట్టి వాటి లొకేషన్ ఏంటో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే మీ కోసం ఆ లొకేషన్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. 

గడ్డం పెంచితే మ్యాన్లీనెస్, గెడ్డం తీస్తే క్యూట్‌నెస్. ఇది లుక్ మాత్రమే కాదు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ స్టైల్ స్టేట్మెంట్ కూడా. కథాబలం ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడే వరుణ్ తేజ్‌‌లో మంచి నటుడు మాత్రమే కాదు…ఒక మంచి ప్రయాణికుడు కూడా ఉన్నాడు. వరుణ్ తేజ్ నిత్యం కొత్త ప్రదేశాలు ( Varun Tej As a Traveler ) ఎక్స్‌ప్లోర్ చేస్తుంటాడు. వాటికి సంబంధించిన ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

1.బానా హిల్స్ , వియత్నాం | Sun World Ba Na Hills, Vietnam

Prayanikudu
| Golden Bridge, Da Nang, Vietnam

లేటెస్ట్‌గా వియత్నాంలోని బా నా హిల్ స్టేషన్‌ ( Bà Nà Hill Station)  దగ్గర ఫోటో దిగి షేర్ చేశాడు వరుణ్. ఈ ఫోటో దిగిన ప్రాంతాన్ని సన్ వరల్డ్ బానా హిల్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఒక ఫ్రెంచ్ కాలనీ చాలా ఫేమస్. దీంతో పాటు ఇక్కడ భారీ హస్తం కూాడా ఉంటుంది. దాని ముందే వరుణ్ తేజ్ నిలబడి ఫోటో దిగాడు. ఇంతకి వరుణ్ అక్కడికి ఎందుకు వెళ్లాడు అనేగా మీ సమాధానం..సారీ ప్రశ్న. 

వరుణ్ తేజ్ తన 15వ సినిమా విషయంలో వియత్నాం వెళ్లాడు. ఈ మూవీని మేర్లపాక గాంధి డైరక్ట్ చేస్తున్నాడు. ఇండో-కొరియన్ క్రైమ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వియత్నాంలో జరుగుతున్నాయి.

2. క్రిస్మస్ తాత ఊరు | Rovaniemi , Finland 

Varun tej and Lavanya Tripati in Rovaniemi, Finland
| Varun tej and Lavanya Tripati in Rovaniemi, Finland ( Photo : Instagram/varuntejkonidela )

 వియత్నాం ట్రిప్‌ వెళ్లడానికి ముందు తన సతీమణి లావణ్య త్రిపాఠితో కలిసి ఒక వింటర్ ట్రిప్ చేసినట్టు ఫోటో కూడా షేర్ చేశాడు వరుణ్. ఈ ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్ అది ఎక్కడో పోస్ట్ చేయలేదు. కానీ నేను కొంత కాలం క్రితమే యూరోప్‌లోని ఫిన్లాండ్‌లో ఉన్న క్రిస్మస్ తాత ఊరు ( Santa Claus Village )  రొవానియేమి గురించి ఒక స్పెషల్ స్టోరీ రాశాను. ఈ ఫోటో చూస్తుంటే నాకు వాళ్లు రొవానియేమి వెళ్లారనే అనిపిస్తోంది. 

రొవానియేమి అనేది క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ అధికారిక నివాసంగా భావిస్తారు. ఇక్కడ శాంటా ఆఫీస్ ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. నార్తెర్న్ లైట్స్ ( Aurora Northern Lights )  చూడవచ్చు. ఇంకా ఈ అత్యంత చలి ప్రదేశంలో చాలా చాలా చూడవచ్చు. క్రిస్మస్ సందర్భంగా దేశ విదేశాల నుంచి పర్యాటకులకు ఇక్కడికి వస్తుంటారు. మే బీ వాళ్లు కూడా క్రిస్మస్ సమయంలో నే అక్కడికి వెళ్లి ఉంటారు. 

3. స్విట్జర్లాండ్ 

Varun Tej Goner Valley Walk Zermatt Switzerland
| Goner Valley Walk Zermatt Switzerland ( Photo : Instagram/varuntejkonidela )

అంతకు ముందు వరుణ్ తేజ్ మరో డెస్టినేషన్‌లో ఉన్న ఫోటో షేర్ చేశాడు. వెనక ఉన్న పర్వతాన్ని బట్టి అది జెర్మాట్‌లోని గోర్నర్ రివర్ వ్యాలీ ( Gorner River Valley Zermatt ) లా ఉంది. ఇది యూరోప్‌లోని స్విట్జర్లాండ్‌లో ( Switzerland ) ఉంది.  సో ఇది కూడా కనుక్కున్నాం. తప్పైతే కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే కూడా కామెంట్ చేయండి. 

4. గ్రైండెల్ వాల్డ్ 

Travel Like Varun Tej
| Grindelwald, Switzerland, Europe ( Photo : Instagram/varuntejkonidela )

తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ), వరుణ్ తేజ్ ఇద్దరూ యూరోప్‌లోని స్విట్జర్లాండ్ వెళ్లినప్పటి ఫోటో ఇది. అక్కడి క్యాంటోన్ ఆఫ్ బెర్న్ వద్ద ఉన్న గ్రైండెల్ వాల్డ్ 

( Grindelwald ) అనే ప్రాంతంలో తీసిన ఫోటో ఇది. 

5. జార్జ్ ఎవరెస్ట్ పీక్ | Travel Like Varun Tej

Varun Tej In George Everest Peak
| Varun Tej In George Everest Peak ( Photo : Instagram/varuntejkonidela )

విదేశాలకు మాత్రమే కాదు వరుణ్ తేజ్, లావణ్య కలిసి ఇండియాలో ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు. సూర్యుడి తేజస్సును చూసేందుకు ముస్సోరి ( Mussoorie ) దగ్గర్లో ఉన్న జార్జి ఎవరెస్ట్ పీక్‌కు వెళ్లినప్పుడు ఈ ఫోటో దిగాడు వరుణ్ తేజ్.

తన ప్రయాణానికి ( Travel Like Varun Tej ) సంబంధించిన మరెన్నో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు వరుణ్ తేజ్. తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి కుటుంబ సమేతంగా వెళ్లిన ప్రయాణాల ఫోటోలను కూడా షేర్ చేశాడు మెగా ప్రిన్స్. వాటన్నింటిని పరిశీలిస్తే తెలిసింది ఒక్కటే. వరుణ్ తేజ్‌కు ప్రయాణాలు మాత్రమే కాదు తన వాళ్లు కూడా చాలా ఇష్టం అని. వారితో ఎక్కువ సమయం వెచ్చించేందుకు ప్రయత్నిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు.

వరుణ్ నెక్ట్స్ మూవీ త్వరలో రావాలని, హిట్ అవ్వాలని, సక్సెస్ పార్టీ కోసం మళ్లీ టూరుకు వెళ్లాలని కోరుకుందాం.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!