ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..
2025 జనవరి 29వ తేదీ ప్రారంభమైన ఈ వేడుకలు అతిపెద్ద న్యూ ఇయర్ వేడుకల్లో ఒకటిగా చెబుతారు. ఈ సంవంత్సరాన్ని “సర్పనామ సంవత్సరం” ( Year Of Snake ) గా భావిస్తారు. ఈ సందర్భంగా చైనాతో పాటు ఇతర దేశాల్లో అధ్బుతమైన రీతిలో వేడుకలను నిర్వహిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Chinese New Year ) అని కూడా అంటారు. 2025 జనవరి 29వ తేదీ ప్రారంభమైన ఈ వేడుకలు అతిపెద్ద న్యూ ఇయర్ వేడుకల్లో ఒకటిగా చెబుతారు. ఈ సంవంత్సరాన్ని “సర్పనామ సంవత్సరం” ( Year Of Snake ) గా భావిస్తారు. ఈ సందర్భంగా చైనాతో పాటు ఇతర దేశాల్లో అధ్బుతమైన రీతిలో వేడుకలను నిర్వహిస్తారు.
ముఖ్యాంశాలు
సందడే సందడి | Chinese New Year 2025
చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హాంగ్‌కాంగ్ ( Hong Kong ) , సియాటల్ వంటి నగరాల్లో ప్రజల్లో ఉత్సాహాం ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ నగరాల్లో పలు ఈవెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయట.
ఇక్కడి సెయింట్ జాన్స్‌లో చైనీస్ అసోసియేషన్ ( Chinese Association ) ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సియాటల్ ( Seattle ) విషయానికి వస్తే ఇక్కడ 15 రోజుల పాటు కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడాది మొత్తం దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు అంతా ఒక్క చోటికి చేరి కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. రుచికరమైన భోజనాన్ని వండుకుని కలిసి ఆరగిస్తారు.
సామాజిక ఐక్యత | Community Engagement

ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా తమ ఇళ్లను అందమైన లైట్లతో అలరించుకుంటారు. స్థానికులు కలిసి ఒక సమూహంగా ఏర్పడి డ్యాన్సులు చేయడం, వంటలు ఆరగించడటం చేస్తుంటారు. ఇవన్నీ కూడా సంప్రదాయ బద్ధంగానే జరుగుతాయి.
ఈ సమయంలో తమకు తెలిసిన వారికి, అవసరం ఉన్నవారికి డబ్బులతో నిండిన ఎర్రని ఎన్విలప్ ( కవర్ ) ఇవ్వడం చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని వారు హోంగ్‌బోవా ( Hongbao ) లేదా లై సీ ( Lai See ) అని పిలుస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల ఇచ్చే వారికి తీసుకునే వారికి మంచి జరుగుతుంది అని అంటారు.
సంప్రదాయ వంటలు | Chinese Culinary Traditions
లూనార్ న్యూ ఇయర్ ( నూతన చంద్రమానం అనుకోండి ) లో ఫుడ్ అనేది బ్లడ్ లాంటిది. అంటే అంత ఇంప్టార్టెంట్ అని అర్థం. మనం సంక్రాంతికి , దసరాకు ఎంత సరదాగా, ఎన్ని వెరైటీ వంటలు తయారు చేసుకుంటామో అలాగే చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్లు కూడా అన్ని వెరైటీలు సిద్ధం చేసుకుంటారు.

ఉగాదికి పచ్చడి పోలెలు ( బొబ్బట్టు ) ఎలా చేసుకుంటామో అలాగే వీరికి కూడా కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి. ఇందులో వీరు ఎక్స్‌ట్రా లాంగ్ నూడిల్స్ ( Extra-Long Noodles ) తప్పకుండా వినియోగిస్తారు. నూడిల్స్ ఎంత పొడుగ్గా ఉంటే అంత ఎక్కువ కాలం జీవిస్తారని వీరి నమ్మకం. దీంతో పాటు స్టికీ రైస్ వల్ల జీవితంలో మాధుర్యం పెరుగుతుంది అని, మోమోస్ లేదా డంప్లింగ్స్ అనేవి ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు చైనా వాళ్లు.
ఆహార వారసత్వం | Chinese Food Heritage
చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ ఈటరీస్ అంటే రెస్టారెంట్స్ మొదలైన వాటిలో ప్రత్యేకంగా వంటలను సిద్ధం చేస్తారు. భోజన ప్రియుల కోసం లూనార్ ఇయర్ మెన్యూ సిద్ధం చేస్తారు. పైన ప్రస్తావించిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతారు. ఆహార వారసత్వాన్ని ముందు తరాలకు పరిచయం చేసి దాన్ని బతికించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఈటరీస్.
స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా | Chinese Cultural Highlights
లూనార్ ఇయర్ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ఒకటి స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా ( Spring Festival Gala 2025 ) . కొత్త సంవత్సరం వేడుకలకు ఇది బ్రాండ్ ఎంబాసెడర్‌గా చెప్పవచ్చు. ఇందులో చైనాకు సంబంధించిన ప్రాచీన, ఆధునిక, సమకాలీన పద్ధతుల్లో వేడుకలను నిర్వహిస్తుంటారు.

ఈ సంవత్సరం సర్పనామ సంవత్సరం. అందుకే దీనికి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చైనాలో సర్పాలతో ముడిపడిన ఎన్నో పౌరాణిక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అందుకే ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలను స్నేక్ థీమ్‌లో నిర్వహిస్తున్నారు.
1983 లో చైనాలో ( China ) ప్రారంభమైన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా అనేక కుటుంబాలు కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునే వేదికగా నిలుస్తుంది.
ఈ దేశాలు సెలబ్రేట్ చేస్తాయి | Countries Which Celebrate Lunar New Year

లూనార్ న్యూ ఇయర్‌ను చైనాతో పాటు పలు దేశాల్లో అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. అందులో వియత్నాం, సౌత్ కోరియా, సింగాపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, బ్రూనై, మంగోలియా, టిబెట్, కాంబోడియా, జపాన్, నార్త్ కోరియా ( మైసూర్ భజ్జీ మీద ఒట్టు ఇక్కడ ఎట్ల సెలబ్రేట్ చేస్తారో ఎవరికీ తెలియదు ) , థాయ్‌లాండ్ (Thailand ) దేశాల్లో అత్యంత వైభవంగా లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు.
- ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ముఖ్యమైన తేదీలు | 2025 Lunar New Year Dates
ప్రపంచ వ్యాప్తంగా చైనీస్ న్యూ ఇయర్‌ను వేడుకగా నిర్వహించే దేశాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు తేదీల గురించి తెలుసుకుందాం. 2025 లో జనవరి 29వ తేదీన లూనార్ న్యూ ఇయర్ ప్రారంభం అయింది. ఈ వేడుకలు ఆసియాలోని వివిధ దేశాల్లో 16 రోజుల పాటు సాగుతాయి. గత సంవత్సరం డ్రాగన్ న్యూఇయర్‌గా ( Dragon New Year ) సెలబ్రేట్ చేస్తే ఈ సంవత్సరం స్నేక్ న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. వివేకం, మార్పు, కొత్త అవకాశాలు, వ్యక్తిగత సానుకూల మార్పునకు ప్రతీకగా దీనిని భావిస్తారు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.