The Respectful Traveler : విదేశాల్లో ఉన్నప్పుడు చేయాల్సిన, చేయకూడని 10 పనులు

షేర్ చేయండి

కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త

ఈ మధ్య ఎక్కువ మంది భారతీయులు విదేశాలవకు టూరిస్టులుగా వెళ్తున్నారు. వీరి కోసం అమెరికా, థాయ్‌లాండ్, అజర్ బైజాన్ వంటి అనేక దేశాలు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి.  ఇంత గౌరవంగా మనను చూస్తున్న టైమ్‌లో ఒక బ్యాడ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇటీవలే ఆరుమంది భారతీయులు థాయ్‌లాండ్‌లోని పట్టాయా ( Pattaya )  బీచులో టాయిలెట్ వెళ్లడం వల్ల భారతీయులకు మర్యద తెలియదు అనే అపకీర్తిని మూటగట్టుకుంటున్నాం. 

కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త

చేయాల్సినవి | Things To Do In Foreign Land

విదేశీ ప్రయాణం మనతో పాటు ఇతరులకు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే చేయాల్సిన పనులు చేయకూడదని పనులు ఇవే..

1. అచారాలు తెలుసుకోండి :  వెళ్లే ముందు ఆ దేశం ఆచారాలు, పద్ధతుల గురించి తెలుసుకోండి. మాట్లాడకుండా, అడగకుండా ఉండాల్సిన అంశాలేంటే రీసెర్చ్ చేయండి.

2. నాలుగు ముక్కలు నేర్చుకోండి : నమస్తే, ఎలా ఉన్నారు, థ్యాంక్యూ, ప్లీజ్ లాంటి పదాలను అక్కడ ఏమంటారో తెలుసుకోండి.

3. వస్త్రధారణ : మనం వెళ్లే దేశంలో ప్రజలు వస్త్రధారణ గురించి వ్యాఖ్యలు చేయకండి. 

4. గౌరవించండి :  స్థానిక పద్ధతుల ప్రకారం మీరు కూడా అలాగే డ్రెస్సింగ్ చేసుకోండి.

5. సామాజిక పరిస్థితులను బట్టి : స్థానికులతో మాట్లాడే సమయంలో మర్యాదగా ప్రవర్తించాలి. అక్కడి సామాజిక పరిస్థితులను బట్టి వ్యవహరించాలి. తినే సమయంలో టేబుల్ మేనర్స్ ( Table Manners ) చూపించాలి.

6. రాత్రి సమయంలో అనవసరంగా బయట తిరగరాదు.

7.  పబ్లిక్ పేస్లులో టాయిలెట్ : పబ్లిక్ ప్లేసులో టాయిలెట్ చేయడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఎంకరేజ్ చేయవు. ఎంత చిన్న, పేద దేశం అయినా ఇలాంటి ఛెండాలాన్ని అంగీకరించవు.

8 స్మోకింగ్, లిక్విడిండ్ : పబ్లిక్ ప్లేసులో సిగరెట్ తాగడం, అడగకుండా ఫోటోగ్రఫీ చేయడం, మందు తాగడం చేయరాదు.

9. దూరిపోకండి : సరదాగా రెండు నిమిషాలు మాట్లాడితే మూడో నిమిషయం సంకనెక్కుతారు కొంత మంది. నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు.

10. పరిశుభ్రత: పర్యావరణాన్ని కాపాడండి. చెత్తను చెత్తబుట్టలో వేయండి. పబ్లిక్ టాయిలెట్స్ వాడండి. 

ఈ పనులు చేయకండి : Things Not To Do In Foreign Land

why indias visting thailand
| ఏ దేశం వెళ్లినా అక్కడి రూల్స్ మనం తెలుసుకోవాల్సిందే.

ఏ దేశానికి వెళ్లినా అక్కడి విషయాలు తెలుసుకోవడంపై కాస్త ఫోకస్ పెట్టండి. మీరు ఇంటి నుండి బయల్దేరడానికి ముందే ఈ పని చేయండి. ఈ విషయాలపై కాస్త్ ఆలోచించండి…

1.గౌరవం ఇచ్చిపుచ్చుకోండి : స్థానిక ఆచారాలు, సంప్రదాయాల గురించి తక్కువ చేసి మాట్లాడటం, మొరటుగా ప్రవర్తించడం చేయకండి. ఇలా చేస్తే అక్కడి వాళ్లు హర్ట్ అవుతారు. మీ ప్రయాణం కూడా మీరు ఎంజాయ్ చేయలేరు.

2. ఎక్కువగా ఊహించకండి :  మన దేశంలో ఉన్నట్టే ఇతర దేశాల్లో ఉండదు. సో ఏదైనా చైసే ముందు తెలుసుకోండి. అంతే కానీ ఒకటి ఒకటి కలిస్తే రెండే కదా…అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా రెండే కదా అని అనుకోకండి. ప్రతీ సారి ఒకటి రెండుతోనే కలవదు. 

3. పేపర్ బ్యాక్ క్యారీ చేయండి :  చెత్త వేయడానికి చెత్తబుట్టలు ప్రతీ చోట ఉంటాయి. లేకపోతే ఒక పేపర్ బ్యాగ్ క్యారీ చేసి అందులో వేయండి. చెత్త బుట్ట కనిపించినప్పుడు అందులో వేయండి.

4. అరుగు మీద  బాల్‌రాజు అవ్వకండి : వేరే దేశానికి ప్రయాణికుడిగా వెళ్లినప్పుడు ప్రయాణికులుగానే ఉండాలి. అంతే కానీ మనం ఇక్కడ అరుగుమీద, ఇరానీ హోటల్స్‌లో కూర్చుని రాజీకీయాలు మాట్లాడినట్టు అక్కడ మాట్లాడటం కరెక్టు కాదు. ఒక వేళ మీకు అక్కడి రాజకీయాల గురించి అవగాహన లేకపోతే తెలియదు అని చెప్పండి. అంతే కానీ స్టేట్మెంట్స్ పాస్ చేయకండి. 

5. దూరిపోకండి : అతిథి దేవో భవ: అనేది మన భారతీయుల్లోనే కాదు చాలా దేశాల్లో పాటించే విధానం.. మనకు ఇస్తున్న గౌరవం అనేది వారి సంస్కారంగా భావించాలి. అలాగని వారు గౌరవిస్తారున్నారు అని చెప్పి ఎదుటివారి వ్యక్తిగత అంశాల్లో దూరకూడదు. హద్దులు తెలుసుకోవాలి.

6. షో ఆఫ్ : మన దగ్గర ఏమైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని అనవసరంగా బయటకు చూపించకూడదు. దీని వల్ల దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది.

7.  బాడీ లాంగ్వేజ్ : మన ప్రవర్తన వల్ల మనకు మిత్రువులు, లేదా శత్రువులు అవుతారు. మరీ ముఖ్యంగా మన బాడీ లాంగ్వేజ్ మన అదుపులో ఉండాలి. ఒక్కో దేశంలో ఒక్కో సైగకు ఒక అర్థం ఉంటుంది. సో నేచురల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.

8. భాష : విదేశాల్లో చాలా మందికి ఇంగ్లిషే రాదు అలాంటిది మన భాష వస్తుంది అనుకోవడం కరెక్టు కాదు. అందుకే సింపుల్ ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు మర్యాదపూర్వకంగా ఉండే సైన్స్ వాడండి. 

9. పవిత్ర ప్రదేశాల్లో : మనం గుడిలోకి చెప్పులు వేసుకెళ్లము. అలాగే కొన్ని దేశాల్లో వారి పవిత్ర స్థలాల్లో వెళ్లేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటి గురించి మీరు పక్కగా తెలుసుకోవాలి. లేదంటే స్థానికులు మనసులు గాయపెట్టిన వారు అవుతారు. 

10. మహిళలను గౌరవించండి : ఏ దేశం వెళ్లినా అక్కడి మహిళలను గౌరవించండి. అవసరం అనిపిస్తే తప్పా వారితే మాట్లాడకండి. కొన్ని దేశాల్లో మహిళల ఫోటోలు తీస్తే జైలుకు పంపిస్తారు. మీరు వెళ్లబోయే దేశంలో అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయేమో అని తెలుసుకోండి. దీంతో పాటు కొన్ని దేశాల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఆప్యాయతను ఒలకబోయడం అక్కడి సంప్రదాయాన్ని బట్టి కరెక్టు కాదు. జంటగా వెళ్లే వాళ్లు ఈ విషయంపై కాస్త రీసెర్చ్ చేయాలి.

ఏ దశ మేగినా ఎందు కాలెడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ తల్లి నిండు గౌరవముని

– రాయప్రోలు సుబ్బారావు

గౌరవం పెంచండి | The Respectful Traveler

రాయప్రోలు సుబ్బారావు గారు ఎప్పుడో రాశారు. ఈ పద్యం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోండి. ప్రతీ భారతీయుడు తన గుండెపై ఒక జాతీయ జెండా రెపరెపలాడుతుంది  అని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ కీర్తి సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!