ఎలక్ట్రిక్ రైలుకు 100 ఏళ్లు…రైల్వే ప్రస్థానాన్ని చూపించే 23 అరుదైన ఫోటోలు |100 Years Of Electric Railways

షేర్ చేయండి

దేహానికి నరాలు ఎలాగో మన దేశానికి రైల్వే లైను కూడా అలాంటిది. ఎన్ని నరాలో అన్ని ట్రాకులు అన్ని సర్వీసులతో ప్రతీ భారతీయుడి జీవితంలో ఒక విడదీయరాని అంశంగా మారింది రైలు బండి ( 100 Years Of Electric Railways ) ఇలాంటి  భారతీయ రైల్వే అరుదైన మైలు రాయిని చేరుకుంది. ఆవిరి ఇంజిన్ నుంచి విద్యుత్‌తో నడిచే రైల్వే ఇంజిన్లను ప్రవేశపెట్టి 2025 ఫిబ్రవరి 3 తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

Prayanikudu

నిత్యం లక్షలాది మందిని తమ గమ్య స్థానానికి చేర్చే ఎలక్ట్రిక్  రైలు కథ ఎలా మొదలైంది ? ప్రారంభంలో వచ్చిన ఇబ్బందులేంటి ? తరువాత కాలంలో ప్రపంచంలోనే గ్లోబల్ లీడర్ ఎలా అయిందో తెలుసుకుందాం. 

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ “ప్రయాణికుడు” పాఠకులతో పంచుకోమని అందించిన అరుదైన చిత్రాలను మీతో పంచుకుంటున్నాను. వాటిని చూస్తూ ఎలక్ట్రిక్ రైలు ప్రస్థానం, అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం.

1. 2025 ఫిబ్రవరి 3వ తేదీ నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ రైలు సేవలు మొదలై 100 ఏళ్లు పూర్తయింది. ఇది భారతీయ రైల్వేకు ఒక అరుదైన అఛీవ్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు.
2. ప్రపంచంలో తొలి రైలు వచ్చేసి ( First Train In World ) 1825 సెప్టెంబర్‌లో నడిచింది. భారత దేశంలో ( First Train In India ) 1853 ఏప్రిల్ 16 తొలిసారి ట్రైన్ సర్వీస్ మొదలైంది.
3.First Electric Train in india : మన దేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రైను 1925 ఫిబ్రవరి 3వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలోని కుర్లాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ప్రారంభమైంది.
4.100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దాదాపు 100 శాతం శాతం బ్రాడ్ గేజ్ నెట్వర్కును విద్యుదీకరణ చేశారు.
5.First Electric Train In World : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చేసి 1879లో జర్మనీలో పరుగులు మొదలు పెట్టింది. మనకు ఈ సాంకేతిక అందిపుచ్చుకునేందుకు 43 సంవత్సరాలు పట్టింది.
6.అప్పటి వరకు ఆవిరీతో నడిచే రైలు ఇంజిన్లు ఉండేవి. వీటిని స్టీమ్ ఇంజిన్ ( Steam Engines ) అంటారు. అయితే విద్యుత్‌తో నడిచే రైలు ఇంజిన్ పవర్‌ విషయంలోనూ, సమర్థత, నిర్వహణ, పర్యావరణంపై ప్రభావం విషయంలో స్టీమ్ ఇంజిన్‌ను వెనక్కి నెట్టేసింది.
7.20వ శతాబ్దంలో ముంబై లాంటి మహానగరాల్లో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య అత్యంత వేగంగా పెరగడం మొదలైంది. దీంతో పెరిగిన జనాబాను వేగంగా గమ్యస్థానాన్ని చేర్చేందుకు వేగం, ఖచ్చితత్వం ఉన్న రవాణా వ్యవస్థ, కొత్త సాంకేతికత అవసరం పడింది.
8. దీంతో 1904 లో డబ్ల్యూ హెచ్ వైట్ ( W H White ) ముంబైలోని రైల్వే నెట్వర్కును విద్యుదీకరణ చేసే ప్రస్థావనను నాటి ప్రభుత్వం ముందు ఉంచాడు.
9.కానీ తరువాత కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం ( World War 1) మొదలవడంతో ఈ ప్రస్తావన మూలన పడిపోయింది. చివరిగా 16 సంవత్సరాల తరువాత వైట్ చేసిన ప్రపోజల్‌ను అప్పటి ప్రభుత్వం అమోదం తెలిపింది.
10.తొలి ఎలక్ట్రిక్ రైలు 1500 V డైరెక్ట్ కరెంట్ ( DC ) ని ఉపయోగించుకుని 16 కిమీ మేరా నడిచింది.
11. ఈ టెస్టు అనంతరం ప్రపంచ స్థాయిలో ఎలక్ట్రిక్ రైల్వే సేవలను ప్రారంభించిన 24వ దేశంగా, ఆసియాలో 3వ దేశంగా అవతరించింది భారత్.
12. ఇక దక్షిణ భారతదేశం విషయానికి వస్తే మద్రాస్ బీచు నుంచి తంబారమ్ లైను మధ్యలో ఎలక్ట్రిక్ రైల్వే సర్వీసుకు భీజం పడింది.
13. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి అంటే 1947 సమయానికి కేవలం 388 కిమీ మేరా రైల్వే లైన్లను విద్యుదీకరణ చేశారు. ఇందులో ఎక్కువ భాగం ముంబై, చెన్నైలో ఉండేవి.
14. ప్రపంచ యుద్ధాల సమయంలో తూర్పు భారత దేశంలోని ప్రాంతాల్లో రైల్వే లైన్లను విద్యుదీకరణ చేయడంలో జాప్యం జరిగింది.
15. 1957 లో హౌరా ( Howrah - Kolkata ) నుంచి షియోరాఫులి అనే ప్రాంతం మధ్యలో ఉన్న రైల్వే లైన్‌లను విద్యుదీకరించారు. ఈశాన్యంలో ఇదే తొలి ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అయింది.
16. మెరుగైన ప్రయోజనాల కోసం తరువాత కాలంలో డీసీ పవర్ నుంచి 25,000 వీ ఏసి సిస్టమ్‌ను ఎంచుకోవడం ప్రారంభించారు. సోవియెట్ యూనియన్ ( Soviet Union ) తరువాత ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న రెండవ దేశంగా అవతరించింది భారత్.
17 మెరుగైన ప్రయోజనాల కోసం తరువాత కాలంలో డీసీ పవర్ నుంచి 25,000 వీ ఏసి సిస్టమ్‌ను ఎంచుకోవడం ప్రారంభించారు. సోవియెట్ యూనియన్ ( Soviet Union ) తరువాత ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న రెండవ దేశంగా అవతరించింది భారత్.
18. ప్రస్తుతం భారతీయ రైల్వే 2x25 కేవీ ఏసి ట్రాక్షన్‌ విద్యుత్ సాంకేతికతతో మెరుగైన సేవలు అందిస్తోంది.
19. 1966 నాటికి ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లలో ఫ్రైట్ ట్రాఫిక్ ( గూడ్స్ రైలు)‌లో సగం వరకు విద్యుద్‌తో నడిచే ఇంజిన్లే ఉండేవి. అంటే సగం వరకు గూడ్స్ రైళ్లు విద్యుత్‌తో నడిచేవి.
20.సబ్ అర్బన్ రైల్వే నెట్వర్కులను విద్యుదీకరణ చేయడం మొదలు పెట్టడం అనేది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. దీని వల్ల డిజిల్ వినియోగం తగ్గి, రైల్వే సమర్థత మరింత పెరిగింది.
21.1951 నాటికి కేవలం 388 కిమీ రైల్వే లైన్లను మాత్రమే విద్యుదీకరణ చేయగా నేడు దాదాపు 100 శాతం రైల్వే లైన్లను విద్యుదీకరణ చేశారు.
22.నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుదీకరణ చేసిన రైల్వే నెట్వర్క్‌గా సత్తా చాటుతోంది భారత్. అయితే కొన్ని పర్వత ప్రాంతాలు, వారసత్వ సంపదగా భావించే కొన్ని రైల్వే లైన్లను వీటి నుంచి మినహాయించారు.
23.100 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత ఎలక్ట్రిక్ రైల్వే తన అద్భుతమైన ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని ఆశిస్తోంది.

Photo Provided By : South Central Railways

ఈ  Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!