విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం (Sri Durga Malleswara Swamy Varla Devasthanam) మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో పాటు మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు ద్వాదశి ప్రదక్షిణలు, పవళింపు సేవలు జరగనున్నాయి.
ముఖ్యాంశాలు
కార్యక్రమాల వివరాలు | Indrakeeladri Maha Shivaratri Ustavalu 2025
2025 ఫిబ్రవరి 24 : ఈ రోజున ఉదయం 9 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవరుకు మంగళస్నానంతో పాటు, వధూవరుగా అలంకరణ జరుగుతుంది.
ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ జరుగుతుంది. అనంతరం అంకురార్పణ, మండప ఆరాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, హారతి తదితర కార్యక్రమాలు జరుగుతాయి
ఫిబ్రవరి 25 నుంచి 28వ తేదీ వరకు :
ఉదయం 8 గంటలకు : మంటప పూజ, మూల మంత్ర వాహనములు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది
సాయంత్రం 4 గంటలకు : మంటప పూజ, మూల మంత్ర వాహనములు, బలిహారణ, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది
ప్రత్యేక పూజలు, అభిషేకాలు | Special Pujas on Indrakeeladri
ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రికాల అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాల సమయాలు :
- ఉదయం 6 నుంచి 9 వరకు
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు
- మధ్యహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ అభిషేకాలు జరుగుతాయి.
- రాత్రి 9 గంటలకు మహాన్యాసం చేసిన తరువాత లింగోద్భవ కాల అభిషేకం జరుగుతుంది.
- తరువాత మహా నివేదన, హారతి, మంత్రపుష్పం జరుగుతుంది.
ఆ తరువాత శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి లీలా కల్యాణోత్సవం జరుగుతుంది.
ఫిబ్రవరి 27 వ తేదీన : పైన వివరించిన కార్యక్రమాలతో పాటు సాయంత్రం 4 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం శివాలయం నుంచి కనకదుర్గా నగర్, బ్రహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్, కెనాల్ రోడ్ , సెంటరుకు చేరుకుని తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
ఫిబ్రవరి 28వ తేదీన పైన వివరించిన కార్యక్రమాలతో పాటు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది.
మార్చి 1వ తేదీన శ్రీ మల్లేశ్వర స్వామి వారికి సాయంత్రం సమయంలో హారతి ఉంటుంది. తరువాత 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించిన పవళింపు సేవ నిర్వహిస్తారు.
మార్చి 2,3వ వ తేదీన రాత్రి 8 గంటలకు పవళింపు సేవలు జరుగుతాయి.
కళ్యాణం, ఆర్జిత సేవ వివరాలు
ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి జరిగే మహాశివరాత్రి (Maha Shivaratri 2025) కళ్యాణంలో భాగం అవ్వాలి అనుకునే భక్తులు రూ.1,116 రుసుము చెల్లించి భాగం అవ్వవచ్చు.శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జరిగే ఈ కళ్యాణంలో పొల్గొనే భక్తులకు శేష వస్త్రం, రవిక, శ్రీ చక్ర లడ్డూనున ప్రసాదంగా అందిస్తారు.
ఆర్జిత సేవలో భాగం అవ్వాలి అనుకునే భక్తులు దేవస్థానం ఆర్జిత సేవా కేంద్రం లేదా అధికారిక వెబస్ సైట్ www.kanakadurgamma.org ను విజిట్ చేసి టికెట్లు తీసుకోవచ్చు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.