ప్రపంచంలో కొన్ని దేశాలు రోజురోజుకూ సైనిక శక్తిని పెంచుకుంటున్న వార్తలు మీరు చదివే ఉంటారు. అయితే మరోవైపు కొన్ని దేశాలకు మాత్రం అసలు ఆర్మీయే (Countries Without Army) లేదు. అయితే ఆర్మీ లేకుండా ఆ దేశాలు ఎలా నడుస్తున్నాయో ఈ పోస్టులో చెక్ చేద్దాం.
ప్రపంచంలో కొన్ని దేశాలు రోజురోజుకూ సైనిక శక్తిని పెంచుకుంటున్న వార్తలు మీరు చదివే ఉంటారు. అయితే మరోవైపు కొన్ని దేశాలకు మాత్రం అసలు ఆర్మీయే లేదు. ఈ దేశాలు అసలు సెక్యూరిటీ కోసం ఆర్మీపైనో, లేదా దేశ అంతర్గత భద్రత పైనో ఆధారపడవు.
ఎందుకంటే సైనిక శక్తి కంటే శాంతియుతంగా (Peaceful Nations) ఉండేందుకే ఈ దేశాలు ఇష్టపడతాయి. అయితే ఆర్మీ లేకుండా ఆ దేశాలు ఎలా నడుస్తున్నాయో ఈ పోస్టులో చెక్ చేద్దాం..
ముఖ్యాంశాలు
10. మార్షల్ ఐల్యాండ్స్ | Marshall Islands

పేరులో మార్షల్ ఉన్నా ఈ దేశంలో ఒక్క మార్షల్ కనిపించడు. ఈ దేశ భద్రతను ఆ దేశ పోలీసులు మాత్రమే చూసుకుంటారు. ఇందులో సముద్ర కదలికలపై నిఘాపెట్టే ఒక యూనిట్ కూడా ఉంటుంది. ఒక వేళ వీరికి సైనిక వక్తి అవసరం అయితే మాత్రం యునైటెడ్ స్టేట్స్ (United States) వారికి అండగా నిలుస్తుంది. దీని కోసం కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ అనే ఒక ఒప్పందం చేసుకుంది.
9. పలావు | Palau

మార్షల్ ఐల్యాండ్స్ లాగే పలావు దేశ రక్షణ బాధ్యత కూడా అక్కడి పోలీసు విభాగమే చూసుకుంటుంది. దీంతో పాటు పలావు దేశపు తీరప్రాంత రక్షక దళం (Maritime Surveillance Unit) కూడా చాలా యాక్టివ్‌గా పని చేస్తుంది. దీంతో పాటు అమెరికా కూడా ఈ దేశానికి కావాల్సిన రక్షణను కల్పిస్తుంది.
8. సమోవా | Samoa

ఈ అతిచిన్న దేశం తన దేశ రక్షణ కోసం ఒక చిన్న పోలీసు దళాన్ని ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు తీరప్రాంత రక్షణ దళం కూడా రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. 1962 కుదిరిన ఒక సంధి ప్రకారం న్యూజిలాండ్ (New Zealand ) ఈ దేశాన్ని రక్షించే బాధ్యతలు తీసుకుంది.
7.తువాలు | Tuvalu

తువాలు దేశం అనేది తన దేశాన్ని రక్షించేందుకు పోలీసు వ్యవస్థతో పాటు తీరప్రాంత రక్షణ దళంపై ఆధారపడి ఉంది. సైనిక శక్తి అవసరం లేకుండానే ఈ దేశం తన ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
6. వాటికన్ సిటీ | Vatican City

ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయిన వాటికన్ సిటీ అనేది అంతర్జాతీయ టూరిస్టు డెస్టినేషన్ కూడా. ఇక ఈ దేశ సెక్యూరిటీ విషయానికి వస్తే పోప్ (Pope) ను స్విస్ గార్డులు (Swiss Guard) రక్షిస్తారు. 15 నిమిషాల్లోనే చూడదగ్గ ఈ దేశ రక్షణ అనేది గెండార్మెరీ కార్ప్స్ (Gendarmerie Corps) అనే పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. ఇక వాటికన్ సిటీ సార్వభౌమత్వాన్ని ఇటలీ దేశం రక్షిస్తుంది.
5. నవారు | Nauru

నవారు దేశానికి చాలా పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసులు దేశాన్ని అంతర్గతంగా రక్షిస్తారు. ఇక ఈ దేశాన్ని ఆస్ట్రేలియా (Australia) సైనిక పరంగా రక్షణగా నిలుస్తుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య ఈ విషయంలో ఎలాంటి ఒప్పందం లేకపోయినా కేవలం ఒక అండస్టాండింగ్‌తో ఇలా చేస్తుంది ఆస్ట్రేలియా.
4. సోలోమన్ ఐల్యాండ్స్ | Solomon Islands

ఈ దేశంలో ఒకప్పుడు జాతి సంఘర్షణలు బాగా జరిగాయి. తరువాత అక్కడి మిలటరీ (Military) వ్యవస్థను నిర్వీర్యం చేసింది సోలోమన్ ఐల్యాండ్స్. ఇక దేశ అంతర్గత భద్రతను పోలీసులు చూసుకుంటారు.
3. లిచ్టెన్‌స్టెయిన్ | Liechtenstein

1868లోనే లిస్టెన్‌స్టెయిన్ తమ ఆర్మీని ఆర్థిక కారణాల వల్ల నిర్వీర్యం చేసింది. నేడు లా ఎంఫోర్స్‌మెంట్ ఏజెన్సీ దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది. దీనికి స్వాట్ (SWAT) టీమ్స్ కూడా దేశ అంతర్గత భద్రతకు బాధ్యతలు వహిస్తుంది.
2. గ్రెనెడా | Grenada

1983 అమెరికా దండయాత్ర (Invasion) తరువాత గ్రెనెడా తన సైనిక దళాలను నిర్వీర్యం చేసింది. అంతర్గత రక్షణ బాధ్యతలను గ్రెనెడా పోలిస్ ఫోర్స్ నిర్వహిస్తుంది. డిఫెన్స్ విషయాన్ని అక్కడి ప్రాంతీయ రక్షణ వ్యవస్థ చూసుకుంటుంది.
1. ఆండోర్రా | Andorra

ఆండోర్రా దేశానికి ఆర్మీ లేదు. ఈ దేశ రక్షణ బాధ్యతలు అనేవి స్పెయిన్ (Spain), ఫ్రాన్స్ లాంటి దేశాలు చూసుకుంటాయి. దీని కోసం ఈ దేశాలతో సంధి కుదుర్చుకుంది ఆండోర్రా. దేశంలో కేవలం వేడుకలు, ఫార్మాలిటీ కోసం చిన్న సైజు ఆర్మీని మెయింటేన్ చేస్తుంది. ఈ దేశం.
ఇలా సైన్యం లేని దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. తమ దేశ రక్షణ కోసం ఇతర దేశాలతో ఒప్పందం, సంధి చేసుకుని ఖర్చులు తగ్గించుకుని శాంతియుతంగా దేశాన్ని నడుపుతున్నాయి ఈ దేశాలు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.