Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నో

షేర్ చేయండి

Credit Cards : పర్ఫెక్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? ఎయిర్ పోర్ట్ లాంజ్, ఎయిర్ మైల్స్ లేదా ఇతర ట్రావెల్ సంబంధిత బెనిఫిట్స్ కావాలా.. అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ లెవల్ ట్రావెల్ క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకుందాం. ప్రతి కార్డుకు దానిదైన ప్రత్యేకతలు ఉన్నాయి – ఇంటర్నేషనల్ లాంజ్ సదుపాయం నుంచి మేక్‌మైట్రిప్, యాత్రా, ఇండిగో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్పెషల్ డిస్కౌంట్ల వరకు అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సమాచారాన్ని పరిశీలించి, జాయినింగ్ ఫీజులు, రివార్డ్ విధానాలు, ప్రయాణ ప్రయోజనాలను కార్డ్ వారీగా తెలుసుకుందాం.

యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్ రెగ్యులర్ గా ప్రయాణించే వారి కోసం రూపొందించబడింది. ప్రయాణ ఖర్చులపై ప్రతి రూ. 100కి 5 EDGE మైల్స్ వరకు సెలక్ట్ చేసిన ఇతర ప్రయాణ ఖర్చులపై 2.5 రెట్లు EDGE మైల్స్‌ను అందిస్తుంది. కొత్తగా చేరిన వారికి 2,500 EDGE మైల్స్ వెల్కమ్ బోనస్‌గా లభిస్తాయి. అలాగే, ఎక్స్ పెండీచర్ టార్గెట్ ఫినిష్ చేస్తే 5,000 EDGE మైల్స్ వరకు సంపాదించవచ్చు. ఈ EDGE మైల్స్‌ను 1:2 నిష్పత్తిలో ఎయిర్ మైల్స్‌గా మార్చుకోవచ్చు. ఈ కార్డుతో సంవత్సరానికి 12 ఇంటర్నేషనల్, 18 డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ వ్యూ ఉంటాయి. ఈ కార్డు జాయినింగ్ , రెన్యూవల్ ఫీజు రూ. 5,000.

Prayanikudu

యాక్సిస్ హారిజన్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ హారిజన్ కార్డ్ యాక్సిస్ ట్రావెల్ EDGE పోర్టల్, విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లలో ప్రతి రూ. 100 ఖర్చుపై 5 EDGE మైల్స్‌ను అందిస్తుంది. ఇతర ఖర్చులపై ప్రతి రూ. 100కి 2 EDGE మైల్స్‌ను ఇస్తుంది. ఈ పాయింట్లను 1 EDGE మైల్ = 1 పార్టనర్ పాయింట్ నిష్పత్తిలో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ సంవత్సరానికి 32 డొమెస్టిక్, 8 ఇంటర్నేషనల్ లాంజ్ విజిటింగ్ పర్మీషన్ ఇస్తుంది. కొత్తగా చేరిన వారికి 5,000 EDGE మైల్స్ వెల్కమ్ బోనస్‌గా, రెన్యూవల్‌పై 1,500 EDGE మైల్స్ లభిస్తాయి. ఇది ఈజీడైనర్లో నెలకు ఒకసారి అర్హత కలిగిన ఖర్చులపై 25శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది. యాన్యువల్ ఫీజు రూ. 3,000.

హెచ్‌ఎస్‌బిసి ట్రావెల్ వన్ క్రెడిట్ కార్డ్
హెచ్‌ఎస్‌బిసి ట్రావెల్ వన్ క్రెడిట్ కార్డ్ విమానాలు, ట్రావెల్ అగ్రిగేటర్లు, విదేశీ కరెన్సీ ఖర్చులపై ప్రతి రూ. 100కి 4 రివార్డ్ పాయింట్‌లను అందిస్తుంది. ఇతర విభాగాలలో ప్రతి రూ. 100కి 2 రివార్డ్ పాయింట్‌లను ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ 1 ఎయిర్ మైల్ లేదా 1 హోటల్ పాయింట్‌కు సమానం. కార్డ్ హోల్డర్‌లకు జొమాటో, యాత్రా, ఈజ్‌మైట్రిప్ లలో 20శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. లాంజ్ యాక్సెస్ సంవత్సరానికి 6 డొమెస్టిక్, 4 ఇంటర్నేషనల్ విజిటింగ్ లను కలిగి ఉంటుంది. కార్డ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత వినియోగదారులు రూ. 4,000 విలువైన వోచర్లు, 3 నెలల ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందుతారు. యాన్యువల్ ఫీజు రూ. 4,999.

ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts

యాక్సిస్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ మాగ్నస్ ఫర్ బర్గుండీ కార్డ్ ఒక ప్రీమియం ఆప్షన్, ఇది యాక్సిస్ ట్రావెల్ EDGE పోర్టల్ ద్వారా ట్రావెల్ బుకింగ్‌లపై ప్రతి రూ. 200కి 60 పాయింట్‌లను అందిస్తుంది. ఇతర ఖర్చులపై ప్రతి రూ. 200కి 35 పాయింట్‌లు లభిస్తాయి. రివార్డ్ పాయింట్‌లను 5:4 నిష్పత్తిలో ఎయిర్ మైల్స్ లేదా హోటల్ పాయింట్‌లుగా మార్చుకోవచ్చు. ఈ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా అన్ లిమిటెడ్ లాంజ్ యాక్సెస్‌ కలిపిస్తుంది. సెలక్ట్ చేసిన రెస్టారెంట్‌లలో 30శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ కార్డ్ జాయినింగ్ , రెన్యూవల్ ఫీజు రూ.30,000.

హెచ్‌డిఎఫ్‌సి డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్
హెచ్‌డిఎఫ్‌సి డైనర్స్ క్లబ్ బ్లాక్ కార్డ్ ప్రతి రూ. 150 ఖర్చుపై 5 రివార్డ్ పాయింట్‌లను, హెచ్‌డిఎఫ్‌సి స్మార్ట్‌బై పై 10 రెట్లు పాయింట్‌లను అందిస్తుంది. వినియోగదారులకు క్లబ్ మారియట్ , అమెజాన్, స్విగ్గీ వన్ కోసం కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌లు లభిస్తాయి. ఇది ప్రైమరీ, యాడ్-ఆన్ మెంబర్స్ కు అన్ లిమిటెడ్ లాంజ్ యాక్సెస్‌ను, ప్రతి త్రైమాసికంలో 6 కాంప్లిమెంటరీ గోల్ఫ్ గేమ్స్ అందిస్తుంది. రివార్డ్ పాయింట్‌లను 1:1 నిష్పత్తిలో ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకోవచ్చు. యాన్యువల్ ఫీజు రూ. 10,000.

ఇండస్‌ఇండ్ అవియోస్ వీసా ఇన్ఫినిట్
ఈ కార్డ్ ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ ప్లేసుల్లో ప్రతి రూ. 200కి 6 అవియోస్‌ ను, ఖతార్ ఎయిర్‌వేస్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ లపై ప్రతి రూ. 200కి 5 అవియోస్‌ను అందిస్తుంది. కొత్తగా చేరిన వారికి 20,000 అవియోస్‌ వెల్కమ్ బోనస్‌గా, రెన్యూవల్‌పై 5,000 అవియోస్‌ లభిస్తాయి. ఎక్స్ పెండీచర్ టార్గెట్ ద్వారా 36,000 అవియోస్‌ వరకు సంపాదించవచ్చు. కార్డ్ హోల్డర్‌లకు ప్రతి క్వార్టర్లీ రెండు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్స్, రెండు డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఉంటాయి. జాయినింగ్ ఫీజు రూ. 10,000, వార్షిక రెన్యూవల్ ఫీజు రూ. 5,000.

ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

కొటక్ ఇండిగో 6ఈ రివార్డ్స్ XL
ఇది ఇండిగోతో కలిసి రూపొందించిన కార్డ్, ఇండిగో బుకింగ్‌లపై ప్రతి రూ. 100కి 6 పాయింట్‌లను, డైనింగ్, గ్రోసరీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులపై 3 పాయింట్‌లను అందిస్తుంది. కార్డ్ హోల్డర్‌లకు రూ. 3,000 ఇండిగో టికెట్, రూ. 1,099 విలువైన 6E ప్రైమ్ యాడ్-ఆన్ స్వాగత ప్రయోజనంగా లభిస్తాయి. లాంజ్ యాక్సెస్ సంవత్సరానికి 8 డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విజిట్స్ కలిగి ఉంటుంది. జాయినింగ్, రెన్యూవల్ ఫీజు రూ. 1,500.

ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసిఐసిఐ ఎమరాల్డ్
ఈ కార్డ్ ప్రతి రూ. 100 ఖర్చుపై 2.5 స్కైవార్డ్స్ మైల్స్‌ను అందిస్తుంది. కొత్తగా చేరిన వారికి కాంప్లిమెంటరీ సిల్వర్ టియర్ మెంబర్‌షిప్ లభిస్తుంది. సంవత్సరానికి రూ. 15 లక్షలు ఖర్చు చేస్తే గోల్డ్ టియర్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. జాయినింగ్, రెన్యూవల్ ప్రయోజనాలలో 20,000 స్కైవార్డ్స్ మైల్స్ ఉన్నాయి. అన్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇందులో ఉంటుంది. జాయినింగ్ , యాన్యువల్ ఫీజు రూ. 10,000.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

మారియట్ బాన్‌వాయ్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్
మారియట్‌తో కలిసి రూపొందించిన ఈ కార్డ్, ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులపై ప్రతి రూ. 150కి 4 పాయింట్‌లను, ఇతర అన్ని ఖర్చులపై 2 పాయింట్‌లను అందిస్తుంది. వినియోగదారులకు మారియట్ బాన్‌వాయ్ సిల్వర్ ఎలైట్ స్టేటస్, జాయినింగ్ టైంలో ఒక ఉచిత నైట్ అవార్డ్ లభిస్తాయి. రూ.6 లక్షలు, రూ.9 లక్షలు, రూ. 15 లక్షల టార్గెట్ చేరుకుంటే ఎక్స్ ట్రా నైట్ అవార్డులు అందించబడతాయి. లాంజ్ యాక్సెస్ సంవత్సరానికి 12 సందర్శనలను కలిగి ఉంటుంది. యాన్యువల్ ఫీజు రూ. 3,000.

మేక్‌మైట్రిప్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్
ఈ కార్డ్ మేక్‌మైట్రిప్ హోటల్ బుకింగ్‌లపై 6% మైక్యాష్‌ను, విమానాలు, హాలిడే ప్యాకేజీలు, క్యాబ్‌లపై 3% మైక్యాష్‌ను అందిస్తుంది. ఇతర అన్ని ఖర్చులపై 1% మైక్యాష్ వర్తిస్తుంది. వినియోగదారులకు ప్రతి సంవత్సరం రూ. 1,000 ఎమ్‌ఎమ్‌టి (MMT) వోచర్ లభిస్తుంది. ఇందులో ప్రతి నెలా ఒక బుక్‌మైషో డిస్కౌంటెడ్ టికెట్ కూడా ఉంటుంది. ఈ కార్డ్‌కు తక్కువ ఫారెక్స్ మార్కప్ (0.99%) ఉంటుంది. యాన్యువల్ ఫీజు రూ. 999.

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!