Travel Advisory: థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త త్వరగా ఇది తెలుసుకోండి
Travel Advisory: థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తన పౌరులకు కొన్ని ప్రయాణ సూచనలు జారీ చేసింది. పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఘర్షణలు జరుగుతుండటంతో భారత రాయబార కార్యాలయం థాయిలాండ్‌లోని ఏడు ప్రావిన్స్‌లకు వెళ్లవద్దని సూచించింది. ప
ర్యాటకులు ప్రయాణం చేసే ముందు థాయిలాండ్ అధికారిక వర్గాల నుండి.. థాయ్ లాండ్ టూరిజం న్యూస్‌రూమ్ నుండి తాజా సమాచారం తెలుసుకోవాలని రాయబార కార్యాలయం X (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.
టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ (TAT) ప్రకారం.. థాయిలాండ్‌లోని ఏడు ప్రావిన్సులు ఉబోన్ రట్చాతాని, సూరిన్, సిసాకెట్, బురీరామ్, సా కయో, చాంతబురి, ట్రాట్ లు ప్రస్తుతం పర్యాటకులు సందర్శించడానికి సురక్షితం కాదని ప్రకటించింది. ఈ ప్రాంతాలలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.

థాయిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి సోమ్సాక్ తేప్సుథిన్ శుక్రవారం బ్యాంకాక్‌లో మాట్లాడుతూ.. సరిహద్దు ఘర్షణల్లో 13 మంది పౌరులు, ఒక సైనికుడు సహా మొత్తం 14 మంది మరణించారని తెలిపారు. మరో 46 మంది గాయపడ్డారని తెలిపారు.
పౌరులు, ఒక ఆసుపత్రిపై కంబోడియా చేసిన దాడులను ఆయన ఖండించారు. వాటిని యుద్ధ నేర చర్యలుగా అభివర్ణించారు. కాంబోడియా తమవైపు ప్రాణనష్టం గురించి గురువారం సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణ ఇది. పోరాటం రెండో రోజుకు చేరుకోవడంతో థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాల నుండి 1,30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
థాయిలాండ్ తాత్కాలిక ప్రధానమంత్రి ఫూంతమ్ వెచాయాచై మాట్లాడుతూ.. “ప్రస్తుత దూకుడు చర్యలు తీవ్రమవుతున్నాయి. యుద్ధ స్థాయికి చేరుకోవచ్చు” అని హెచ్చరించారు. అయితే, ప్రస్తుత సైనిక చర్యలు థాయిలాండ్ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించడానికి మాత్రమే ఉద్దేశించబడినవని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తాజా ఉద్రిక్తతలు మే నెలలో ప్రారంభమయ్యాయి. అప్పుడు వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో దళాల మధ్య కాల్పులు జరిగాయి. దీనిలో ఒక కంబోడియా సైనికుడు మరణించాడు. పరిస్థితి బుధవారం మరింత తీవ్రమైంది. ఒక ల్యాండ్‌మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. వారంలో ఇది రెండవ సంఘటన. థాయిలాండ్ మైన్లను పాతినందుకు కంబోడియాను నిందించింది.
అయితే కంబోడియా రాజధాని ఈ ఆరోపణలను ఖండించింది. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకాక్ నంఫోమ్ నుండి తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కంబోడియా రాయబారిని బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.