Tourist Destinations : ఎడారి రాష్ట్రంలో స్వర్గం.. చలికాలంలో రాజస్థాన్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుతమైన ప్రదేశాలు
Tourist Destinations : సాధారణంగా అనగానే వేడి, ఎడారి, ఇసుక మేటలు మాత్రమే గుర్తుకొస్తాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు పేరుగాంచిన ఈ రాష్ట్రం, వర్షాకాలం, చలికాలంలో మాత్రం పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడి సహజ సౌందర్యం, చారిత్రక భవనాలు, పర్వతాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ శీతాకాలంలో చల్లని వాతావరణంలో అద్భుతమైన అందాలను చూడాలనుకుంటే, రాజస్థాన్‌లో కచ్చితంగా సందర్శించాల్సిన ఆ ఐదు అద్భుతమైన ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మౌంట్ అబూ
రాజస్థాన్‌లో ఉన్న ఏకైక, అత్యంత ఆకర్షణీయమైన హిల్ స్టేషన్ మౌంట్ అబూ. ఈ ప్రదేశం చలికాలంలో, వర్షాకాలంలో మరింత పచ్చగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. చల్లని వాతావరణం కారణంగా మౌంట్ అబూ హనీమూన్ స్పాట్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎప్పుడూ పచ్చదనం ఉన్నప్పటికీ, చలికాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నక్కి సరస్సు, దిల్వారా జైన దేవాలయాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

భన్ఘర్ కోట
చిన్న పర్వతాల మధ్యలో ఉన్న భన్ఘర్ కోట వర్షాల తర్వాత పచ్చదనంతో కనువిందు చేస్తుంది. ఇది దాని చారిత్రక నేపథ్యం కంటే, దెయ్యాల కోటగా ప్రసిద్ధి చెందింది. ఈ కోట చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చరిత్రను, థ్రిల్లింగ్ అనుభూతిని ఇష్టపడేవారు ఈ కోట అందాలను చలికాలంలో పర్యటించి చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ అనుమతి ఉండదు.
ఉదయ్‌పూర్ నగరం
చారిత్రక భవనాలకు, రాజభవనాలకు నిలయమైన ఉదయ్‌పూర్, దాని రాజసం, పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఉదయ్‌పూర్ చుట్టూ అనేక పర్వతాలు ఉన్నాయి. వర్షాకాలం పూర్తయిన తర్వాత ఆ పర్వతాల అందం మరింత పెరుగుతుంది, చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల పర్యాటకులు లేక్ పిచోలాలో బోటింగ్ ఆస్వాదించవచ్చు. ఇక్కడ లేక్ పాలెస్, సిటీ పాలెస్, జగ్మందిర్ పాలెస్ చూడదగిన ప్రదేశాలు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
జైపూర్ నగరం
రాజస్థాన్‌లో పర్యటించాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడినప్పుడు, పింక్ సిటీగా పిలువబడే జైపూర్ ఎప్పుడూ ముందుంటుంది. ఇక్కడి వాతావరణం చలికాలంలో ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంబర్ ఫోర్ట్ తో సహా జైపూర్‌లోని అనేక చారిత్రక ప్రదేశాల అందాలను పర్యాటకులు ఇష్టపడతారు. చల్లని వాతావరణం కారణంగా పగటిపూట కోటలను, మార్కెట్లను సందర్శించడం చాలా సులభం. ఇక్కడ హవా మహల్, జల్ మహల్, నహర్‌గఢ్ కోట చూడదగినవి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
జాలూర్
జాలూర్ను గ్రానైట్ అండ్ గ్రాండ్యూర్ నగరం అని పిలుస్తారు. ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి జాలూర్ కోట లోపల ఉన్న తోప్ ఖానా లేదా ఫిరంగిశాల పర్యాటకులకు ముఖ్యమైన ఆకర్షణ. సుమారు 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన, చాముండీ దేవి భక్తులకు పవిత్ర స్థలంగా భావించే సుంధా మాతా ఆలయం కూడా ఈ నగరంలో ప్రసిద్ధి చెందింది. చలికాలంలో ఇక్కడి పర్వతాలను అధిరోహించడం సులభం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.