Vizag : వైజాగ్ టూర్ వెళ్తే ఈ నాచురల్ ఆర్చ్ అస్సలు మిస్ అవ్వకండి
Vizag : వేసవి అంటే విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులకు ఆర్కే బీచ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ తోట్లకొండ బీచ్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన బీచ్. అయితే, ఈ మధ్య ఈ ప్రాంతం చాలా ట్రెండీగా మారింది. దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే? అక్కడ ఉన్న సహజసిద్ధమైన ఆర్చ్.. ప్రకృతిచేతనే రూపుదిద్దుకున్న ఈ అద్భుతం.. అక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.
సహజసిద్ధమైన ఆర్చ్ | Natural Arch In Vizag
విశాఖపట్నం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సహజసిద్ధమైన ఆర్చ్‌ను చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. విశాఖపట్నం నుండి భీమిలికి (Bheemili Beach) వెళ్ళే ప్రతి పర్యాటకుడు ఈ ఆర్చ్ వద్ద ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఆర్చ్‌ను మొదటిసారి చూస్తున్నామని పర్యాటకులు ( Tourists ) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యోదయం, సహజసిద్ధమైన ఆర్చ్
వైజాగ్‌లోని ఇతర బీచ్‌ల లాగానే, ఈ బీచ్ కూడా ఒక సూర్యోదయం బీచ్. సూర్యోదయం సమయంలో ఈ ఆర్చ్‌ను చూడటానికి రెండు కళ్ళు చాలవు. బీచ్‌లో సహజసిద్ధమైన ఆర్చ్ గుండా సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుతమైన దృశ్యం. వేల సంవత్సరాల క్రితం తీరం వెంబడి గాలి, ఇసుక చర్యల ఫలితంగా ఈ సహజసిద్ధమైన ఆర్చ్ ఏర్పడింది. అయితే వారాంతాల్లో ఈ బీచ్ రద్దీగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఒకప్పుడు ఏకాంతం, ఇప్పుడు సందడిగా
ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ఈ బీచ్, వారాంతాల్లో సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రజలు సహజసిద్ధమైన వంపు వద్ద సెల్ఫీలు క్లిక్ చేసుకుంటున్నారు. కొందరు భౌగోళికంగా సున్నితమైన ఈ ప్రాంతంలో బైక్ స్టంట్లు కూడా చేస్తున్నారు. అయితే, అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇలాగే ఉందని.. కొద్దిగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.
ఎలా వెళ్ళాలి? | How To Reach Vizag Natural Arch At Beach
మీరు కూడా ఈ తోట్లకొండ బీచ్ (Totlakonda Beach) లేదా మంగమరిపేట బీచ్‌కు (Mangamaripet Beach) వెళ్లాలనుకుంటున్నారా? బీచ్ రోడ్ మీదుగా భీమిలి వైపు వెళితే సరిపోతుంది. మీరు 900కె బస్సు తీసుకోవచ్చు. ఎంవిపి నుండి ఆటోలో కూడా వెళ్లవచ్చు.
✈️ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ ప్యాకేజీలు తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
ఏదైనా ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకుంటే లేదా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, వాట్సాప్‌లో సంప్రదించండి 👇
💬 Chat on WhatsApp సంప్రదించడండి
🗣️ తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.
⚠️ Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
