ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ? తేదీలేంటి ? AP Flamingo Festival 2026 Dates, Location Complete Guide
AP Flamingo Festival 2026 Dates : ఏపీలో వేలాది ఫ్లెమింగో పక్షులు సందడి చేయనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే ఈ సందర్భాన్ని ఫ్లెమింగో ఫెస్టివల్‌గా సెలబ్రేట్ చేస్తారు. ఈ పోస్టులో ఈ ఫెస్టివల్ జరిగే ప్రదేశం, తేదీలు తదితర వివరాలు అందిస్తాం.
ప్రతీ చలికాలం కోస్తా ఆంధ్రా ప్రాంతం (Coastal Andhra Pradesh) అనేది ఒక సైలెంట్ వండర్లాండ్లా మారిపోతుంది. ప్రశాంతమైన వెట్ల్యాండ్స్లో వేల కొద్ది వలస పక్షులు వాలిపోతాయి. అయితే అందులో ఫ్లెమింగో పక్షులు మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఈ బ్యూటిఫుల్ అండ్ నేచురల్ ఈవెంట్‌ని సెలబ్రేట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం AP Flamingo Festival ను 2026 జనవరిలో నిర్వహిస్తుంది.
ముఖ్యాంశాలు
ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి | 🦩 AP Flamingo Festival 2026 – Overview
ఇది ఒక కమర్షియల్ ఫెస్టివల్ కాదు. అలాగే సరదా కోసం ఏర్పాటు చేసే ఫెస్టివల్ అసలే కాదు. ఇది ఎకోటూరిజం ఇష్టపడేవారికి, పక్షి ప్రేమికుల కోసం మంచి అవకాశంగా చెప్పవచ్చు. వన్య ప్రాణి సంరక్షణను బాధ్యతగా తీసుకుని దాని గురించి అవగాహన కల్పించే వేదిక ఇది.
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts
ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు | AP Flamingo Festival 2026 Dates
ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ప్రతీ సంవత్సరం జనవరి నెలలో నిర్వహిస్తారు. వలస పక్షులు ఎక్కువగా వచ్చే పీక్ సీజన్లోనే దీని ప్లాన్ చేస్తారు.
ఈ సారి జనవరి 10,11వ తేదీల్లో రెండు రోజుల పాటు దీనిని నిర్వహించనున్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది | Flamingo Festival Locations
ఈ పక్షుల పండగ అనేది పులికాట్ సరస్సు (Pulicat Lake), నేలపట్టు బర్డ్ శాంక్చువరిలో (Nelapattu Bird Sanctuary) నిర్వహిస్తారు. పులికాట్ అనేది దేశంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఆంధ్ర ప్రదేశ్‌లో అది పెద్ద సరస్సు కూడా ఇదే.
- సంతానోత్పత్తికి ఇది ఫ్లెమింగోలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
- దీంతో పాటు Nellore District లో ఉన్న నేల పక్షుల సంరక్షణ కేంద్రంలో కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
- ఇక్కడ మెయిన్‌గా వ్యూ పాయింట్స్ బాగుంటాయి.
- నేలపట్టు, పులికాట్లో మొత్తం 1,00,000 కన్నా ఎక్కువ పక్షులు వచ్చి చలికాలంలో సంతానోత్పత్తి కోసం ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025: Nelapattu Bird Sanctuary ఎలా చేరాలి, టైమింగ్ & టికెట్ వివరాలు
ఎప్పుడు వెళ్లాలి ? | Best Time to See Flamingos
పక్షులను మాత్రమే చూడటం కోసం ఇక్కడికి వెళ్తాం కదా అలాంటప్పుడు అవి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాయో తెలుసుకుంటే మనం వెళ్లిన పర్పస్ పూర్తి అవుతుంది. మీరు ఉదయం 6:00 AM నుంచి 9:00 AM మధ్యలో వెళ్లినా, సాయంత్రం వెళ్లినా పక్షుల సందడి చూడవచ్చు.
- ఈ సమయంలో పక్షులు చాలా యాక్టీవ్‌గా ఫీడింగ్ చేసే పనుల్లో అటూ ఇటూ కదులుతూ ఉంటాయి.
- ఫోటోగ్రఫీకి కూడా ఇవి పర్ఫెక్ట్ సమయాలు
ఎంట్రీ, ఇతర సమాచారం | Entry & Visitor Information
ఎంట్రీ పాసులు సాధారణంతా బర్డ్ శాంక్చువరి గేట్ దగ్గరే లభిస్తాయి. లేదా మీరు టూరిజం కౌంటర్లో కూడా లభిస్తాయి. బోట్ రైడ్స్ లేదా స్పెషల్ వ్యూ పాయింట్స్ కోసం అదనపు చార్జీలు ఉండవచ్చు.
పర్యాటకులు పాటించాల్సిన నియమాలు | Rules for Visitors
పక్షలను చూడటానికి వెళ్లినప్పుడు అనవసరమైన శబ్దం చేయరాదు. ఎందుకంటే మనకు ఇది ఫెస్టివల్ కావొచ్చు….కాని ఇది వాటి జీవితం. మనం వాటిని డిస్టర్బ్ చేయరాదు.
పక్షులకు దూరంగా ఉండాలి. అలాగే అధికారులు చెప్పే సూచనలు పాటించాలి.
- ఇది కూడా చదవండి : శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
ఎక్కడ ఉండాలి ? | Where to Stay
ఇక్కడికి చాలా మంది లోకల్ పర్యాటకులే వస్తుంటారు. కానీ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వెళ్లేవారు సుల్లూరుపేట (Sullurpeta), నెల్లూరులో ఉండవచ్చు.
- బడ్జెట్లో మీకు ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లు, బడ్జెట్ హోటల్లు లభిస్తాయి.
- దూరం నుంచి వెళ్లే వారు ముందుస్తు బుకింగ్ చేసుకుంటే బెటర్.
- ఎందుకంటే సంక్రాంతి ఆల్మోస్ట్ వచ్చేసింది.
- పైగా ఈ సీజన్లో ఈ ప్రాంతం చుట్టుపక్కల జిల్లాలు అన్నీ పర్యాటకులతో కిక్కిరిపోతాయి.
- మొత్తం ఒక Tourist Hub లా మారిపోతుంది.
- తిరుపతి నుంచి Pulicat Cab Packages ఉంటాయి.
పులికాట్ ఎంత దూరం | how far is pulicat? distance guide for flamingo festival
- హైదరాబాద్ నుంచి పులికాట్ (hyderabad to pulicat distance) వచ్చేసి సుమారు 520 km ఉంటుంది. బై రోడ్ వెళ్తే 9–10 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ట్రైన్లో అయితే నెల్లూరు లేదా సూళ్లూరుపేట వరకు వెళ్లొచ్చు.
- చెన్నై నుంచి పులికాట్ (chennai to pulicat distance) వచ్చేసి సుమారు 60–70 km ఉంటుంది. ప్రయాణ సమయం 1.5–2 hrs, అంటే గంటన్నర నుంచి రెండు గంటల్లో చేరుకోవచ్చు.
- తిరుపతి నుంచి పులికాట్ (tirupati to pulicat distance) సుమారు 120 km. క్యాబ్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణానికి సుమారు 3–4 గంటలు పట్టవచ్చు.
- నెల్లూరు నుంచి నేలపట్టు బర్డ్ శాంక్చువరి (nellore to nelapattu bird sanctuary distance) సుమారు 30 km ఉంటుంది. 45 నిమిషాల నుంచి ఒక గంటలోపు చేరుకోవచ్చు.
- సుళ్లూరుపేట నుంచి పులికాట్ (sullurpet to pulicat distance) వచ్చేసి కేవలం 20 km మాత్రమే. 30 నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. సుళ్లూరుపేటలో స్టే (stays in sullurpeta) ప్లాన్ చేయవచ్చు.
- విజయవాడ నుంచి పులికాట్ లేక్ (vijayawada to pulicat lake distance) సుమారు 390 km. ప్రయాణ సమయం 7–8 hrs. నెల్లూరు వరకు ట్రైన్లో రావడం బెస్ట్ ఆప్షన్.
AP Flamingo Festival అంటే ఒక ఈవెంట్ కాదు. ఇది పర్యావరణానికి మనం ఇచ్చే గౌరవం. వలస పక్షుల జీవన విధానాన్ని అర్థం చేసుకునే అవకాశం.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
