కరిగే లింగంలో శివతత్త్వం బోధించే అమర్‌నాథ్ గుహాలయం | Amarnath Cave Temple

Amarnath Cave Temple : హిమాలయాల మధ్యలో, మంచు గుహలో మహాశివుడు రాతిరూపంలో కాదు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు.

సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది.

అమర్‌నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ పూర్తి నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. కానీ ఆ శివయ్య ఉంటే సవాళ్లు ఎంతటివి అయినా వాటిని తట్టుకునే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు కదా.

అందుకే తొలిసారి అమర్‌నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడు.

ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి, ప్రతీ శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అధ్బుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదు… పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు.

ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతీ అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది.

లింగం కరిగిపోతుంది… కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్‌నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివ తత్త్వం.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!