Udagamandalam : ఉదగమండలం అని ఏ హిల్ స్టేషన్‌ను పిలుస్తారో తెలుసా?
Udagamandalam : మనం అందరం సింపుల్‌గా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. కానీ ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే.
ఉదగమండలం అనే పేరు Toda Tribal Language నుంచి వచ్చింది అని స్థానికులు చెబుతారు. ఒతకల్ మండు లేదా ఉదగై మండలం అని పిలిచే ఈ ప్రదేశం అర్ధం వచ్చేసి పర్వతాల మధ్యలో ఉండే గ్రామం. నీలగిరి కొండల మధ్యలో ఉన్న తోడా తెగల వారికి ఇది ఒక పవిత్ర ప్రదేశం.
బ్రిటిష్ రూల్కి ముందు ఈ ప్రాంతంలో తోడా ట్రైబ్స్ మాత్రమే ఉండేవారు. వాళ్లే ఈ ప్రశాంతమైన పచ్చని ప్రదేశాన్నిఉదగమండలం అని పేరు పెట్టారు. అయితే తెల్లవారు వారి కంఫర్ట్‌ను బట్టి మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లు మార్చరు అని తెలిసిందే కదా.
ఇది కూడా చదవండి : Mini Switzerland : స్విట్జర్లాండ్ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా!
అలాగే ఉదగమండలాన్ని అలా ఎలా మార్చారో తెలియదు కానీ చివరికి Ooty అని పేరు మార్చారు. కానీ ఇప్పటికీ దీనిని ఉదగమండలం అని స్థానికులు చాలా మంది పిలుస్తారు.
ఇప్పుడు కూడా తెలిమంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు, అంతులోని తేయాకు తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ చూస్తే…ఈ ప్రాంతానికి నిజంగా ఉదగమండలం అనే పేరు కరెక్టుగా సెట్ అవుతుంది అనిపిస్తుంది.
సో నెక్ట్స్ టైమ్ మీరు ఊటికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వీలైతే అక్కడి తోడా తెగల గురించి తెలుసుకోండి. అలాగే ఊటి అంటే లోకల్‌గా అర్థం ఏంటో కనుక్కోండి. ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
