ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్…ధనవంతుల ఫేవరెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ | Foreign wedding destinations
Foreign wedding destinations : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ అందంగా ఉండేలా ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ధనవంతులు ఎంచుకునే వెడ్డింగ్ డెస్టినేషన్స్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి ఇటలీలోని Lake Como.
పర్వతాలే పెళ్లిపెద్దలు | Italy
ఇటలీలో Lake Como తీరం మీద ఏర్పాటు చేసే కళ్యాణ వేదికలో (Lake Como wedding) ప్రతి క్షణం ఒక సినిమా సీన్ చూసినట్టుగా ఉంటుంది. నీటిలో ప్రతిబింబించే విల్లాల దీపాకాంతులు, వెనుక పెళ్లికి సాక్ష్యంగా నిలిచినట్టుగా కనిపించే పర్వతాలు, మధురమైన సంగీతం… ఈ వాతావరణంలో పెళ్లి అనేది ఒక కల నిజం కావడం లాంటిదే.

ప్రభాత వెలుగు సరస్సుపై పడిన మంగళ క్షణంలో మూడు ముళ్లు, ఏడడుగులు జరిగితే అది జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
శాంటోరిని, గ్రీస్ | Greece
తెల్లని గోపురాలు… నీలాకాశం… ఇవే గ్రీస్‌లోని Santorini ద్వీపానికి ప్రత్యేక గుర్తింపు. ఇలాంటి వాతావరణంలో వివాహం చేసుకోవాలని (Santorini destination wedding) చాలా మంది ఏళ్ల తరబడి ప్లాన్ చేస్తుంటారు. కొండ అంచున చిన్న మండపం, ఎదురుగా సముద్రపు అలలు… కలల రాణి చేతిని పట్టుకుని ఏడడుగులు నడిచే ఆ క్షణం గుండెల్లో నిక్షిప్తమైపోతుంది.

సూర్యాస్తమయం సమయంలో మారే రంగులు కొత్త జంటలకు ప్రకృతి ఇచ్చిన కానుకలా అనిపిస్తాయి.
ఫ్రాన్స్ (France)– లావెండర్ సువాసనలో వివాహం
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఫ్రాన్స్ గురించీ చాలా మంది (France lavender wedding) కలలు కంటారు. అక్కడి లావెండర్ తోటల్లో సినిమా స్టైల్ సెట్టింగ్‌లో వివాహం జరగడం ఒక డ్రీమ్‌లా ఉంటుంది. కళ్ల ముందు వరుడు–వధువు, చుట్టూ లావెండర్ సువాసన… ఒక కలలో నడుస్తున్నట్టే ఫీలింగ్ కలుగుతుంది.
బాలి – ప్రకృతి మధ్య వైభవం
ఇండోనేషియాలోని Baliలో ప్రకృతి మధ్య, సముద్ర తీరంలో, అక్కడి ఆలయాల శిల్పకళ వైభవం మధ్య జరిగే కళ్యాణం నిజంగా వైభోగమే (Bali beach wedding) అనిపిస్తుంది. పచ్చదనం, అలల శబ్దం, సంప్రదాయ అలంకరణలు – ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ అంటే కేవలం కొత్త స్థలంలో వివాహం చేసుకోవడం మాత్రమే కాదు. ప్రతి ప్రదేశం తన ప్రకృతి, తన చరిత్ర, తన ప్రత్యేకతతో ఆ వివాహాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది. నింగి, నేల, నీరు, అగ్ని సాక్షిగా కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించే అందమైన అవకాశమే డెస్టినేషన్ వెడ్డింగ్.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
