Salar De Uyuni : ఆకాశం నేలపై కనిపించే అద్భుత ప్రదేశం ఇదే
Salar de Uyuni అనేది దక్షిణ అమెరికాలోని Bolivia దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం. దూరం దూరం వరకు తెలుపు రంగు విస్తరించి కనిపిస్తుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం చూస్తే ఆకాశమే కనిపిస్తుంది; తలదించి నేలను చూసినా ఆకాశమే కనిపిస్తుంది. అదే ప్రతిబింబం.
చూడటానికి ఇదంతా ఒక కళాకారుడి కాన్వాస్‌లా, చిన్నపిల్లాడి ఊహలా అనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడ నీరు పలుచగా పరుచుకున్నప్పుడు మొత్తం మైదానం అద్దంలా మారుతుంది. ఆకాశం, మేఘాలు, సూర్యకాంతి ఇవన్నీ నేలపైకి దిగినట్టుగా కనిపిస్తాయి.
ఆకాశం కిందికి దిగిన విధానం
ఇక్కడికి వెళ్లే పర్యాటకులకు భూమి, ఆకాశం మధ్య వ్యత్యాసమే లేకుండా మొత్తం ఆకాశమే నేల అయినట్టుగా అనిపిస్తుంది. మేఘాల నీడ మాత్రమే కాదు, మేఘాలే భూమిపైకి చేరినట్టుగా కనిపిస్తాయి.

దీనిపై నడుస్తుంటే మనిషి ప్రతిబింబం కూడా ఆ విశాల దృశ్యకవితలో భాగమవుతుంది. దూరంగా నడిచే వ్యక్తులు ఆకాశంలో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తారు.
- ఇది కూడా చదవండి : Rann Of Kutch : సూర్యకాంతిలో మెరిసిపోయే తెల్ల ఎడారి
నిశ్చల విశాలం
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు రంగులు మెల్లిగా మారుతాయి. ఉదయం నీలం, మధ్యాహ్నం నిర్మల తెలుపు వెలుగు, సాయంత్రం గులాబీ, బంగారు వర్ణాలు ఈ ప్రదేశాన్ని మాటలకు వర్ణించనంత అందంగా మార్చుతాయి.
ఈ మైదానం మధ్యలో నిలబడి చూస్తే ప్రపంచం ఒక క్షణం నిశ్చలంగా నిలిచినట్టుగా అనిపిస్తుంది. సాలార్ డె ఉయునీ కేవలం అతిపెద్ద ఉప్పు మైదానం మాత్రమే కాదు… మనసును ప్రశాంతంగా విహరింపజేసే ఒక అపూర్వ అనుభవం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
