నార్త్ ఈస్ట్‌లో బెస్ట్ కూల్ సమ్మర్ డెస్టినేషన్ ఇదే | Pelling Summer Travel
Pelling Summer Travel : ఎండాకాలంలో నార్త్ ఈస్ట్ అందం ఏ మాత్రం తగ్గదు. మరీ ముఖ్యంగా సెవెన్ సిస్టర్స్‌కు బ్రదర్ లాంటి స్టేట్ అయిన Sikkim లోని Pelling సమ్మర్లో ఇంకా బాగుంటుంది.
దేశం మొత్తంలో ఎండలో ఇబ్బంది పడుతున్న సమయంలో పెల్లింగ్ మాత్రం కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది. పచ్చని పర్వతాలు, తెల్లని మంచుతో కలిసిన మబ్బుల కదలికలు “సమ్మర్ అంటే ఇలా ఉండాలి” అనే ఫీలింగ్ కలిగిస్తాయి.
సూర్యోదయం సమయంలో పర్వతాల వెనక నుంచి సరికొత్తగా ఉదయించే సూర్యుడు గుడ్ మార్నింగ్ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. మబ్బుల చాటున కనిపించీ కనిపించనట్టు ఉండే చెట్ల అందాలను ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ ఉదయాలు చల్లని గాలితో ప్రారంభం అవుతాయి. అందుకే చాలా మంది మార్నింగ్ సమయంలో వాకింగ్ చేస్తూ నేచర్‌ను ఎంజాయ్ చేస్తారు.
- ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
నేచర్ వాక్ | Nature Walk In Pelling
పెల్లింగ్లో సమ్మర్ సీజన్లో పచ్చదనం పీక్‌లో ఉంటుంది. పైన్ వృక్షాల వనాల్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు తాజా గాలి మనసును రిలాక్స్ చేస్తుంది. రంగురంగుల అడవి పుష్పాలు దారిపొడవునా పర్యాటకులను పలకరిస్తూ హాయిని కలిగిస్తాయి.

సూర్య కిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుంచి పడుతుంటే భూమిపై నీడలతో కొత్త ప్యాటర్న్లు, కొత్త డిజైన్లు కనిపిస్తాయి. ఎండాకాలంలో ట్రెక్కింగ్ ట్రైల్స్ కూడా సులభంగా అనిపిస్తాయి. అందుకే చాలా మంది ఈ సమయంలో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తారు.
కాంచన్‌జంగా వ్యూపాయింట్
ఎండాకాలంలో ఆకాశం చాలా క్లియర్‌గా ఉండటంతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం అయిన Kanchenjunga అత్యంత అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. మబ్బులు తక్కువగా ఉండటం వల్ల ఈ మౌంటెన్‌ను క్లియర్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
పెల్లింగ్ ఎలా చేరుకోవాలి? | How to Reach Pelling
పెల్లింగ్కు దగ్గరలో Pakyong Airport ఉంటుంది. అలాగే Bagdogra Airport కూడా చేరుకోవచ్చు. రైల్లో ప్రయాణించే వారు దగ్గరలోని New Jalpaiguri Railway Station వద్ద దిగిపడి, అక్కడి నుంచి క్యాబ్ లేదా షేర్డ్ జీప్ ద్వారా పెల్లింగ్ చేరుకోవచ్చు.
ఎండాకాలంలో ఇక్కడి వాతావరణం చల్లగా, కామ్‌గా రిఫ్రెష్ అయ్యే హిమాలయ బ్రేక్‌లా అనిపిస్తుంది. అందుకే ఈ సమ్మర్ ఎక్కడికైనా వెళ్లాలని ఫీలింగ్ వస్తే పెల్లింగ్ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి!
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
