తెలుగువారి సీక్రెట్ సమ్మర్ గెటవే… | Lambasingi Summer Travel
Lambasingi Summer Travel : విజయవాడ, గుంటూరు వేడి నుంచి తప్పించుకోవాలి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఈ చిన్న చల్లని ప్రదేశమే. చాలా మంది సమ్మర్ ట్రిప్ అంటే చాలా దూరం వెళ్లాలి అనుకుంటారు.
కానీ దగ్గర్లోనే ఇంత ప్రశాంతమైన చోటు ఉండటం నిజంగా తెలుగువారి లక్కు అనుకోవాలి. కానీ ఫస్ట్ టైమ్ వెళ్లేవారికి ఇది ఈజీగా, దగ్గరలోనే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. నేచర్‌ని ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది.
అక్కడి గాలిలో ఉండే చల్లదనం మనసుని వెంటనే తాజాగా మార్చేస్తుంది. చుట్టూ ఉన్న కొండా కోణలు, అక్కడక్కడ కనిపించే కాఫీ తోటలు చాలా అందంగా ఉంటాయి. పొద్దుపొద్దున్నే లేచి చూస్తుంటే మంచు తెరలు తొలుగుతూ భానుడి కిరణాలు కొండలపై పడటం, వాటిని చూడటం ఒక గొప్ప దృశ్యంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. నిశ్శబ్దం మనల్ని పలకరిస్తుంది.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
సందర్శనీయ స్థలాలు | Places to Visit
Andhra Pradesh hill Station : సూజాన్ గార్డెన్లో విరబూసిన పూవులు, తాజాగా రిజర్వాయర్ దగ్గర ఉన్న నీటి అందాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కొత్తపల్లి జలపాతం దగ్గర జలజల జారే నీటి ధారలు చూస్తుంటే మనసులోని భారం అంతా దూరం అయిపోతుంది. ఘాట్ రోడ్డు మలుపుల్లో సాగే ప్రయాణం ప్రతీ క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఏం తినాలి? | Food to Eat
అక్కడ దొరికే వేడివేడి చికెన్ తింటుంటే ఆ మట్టి వాసన, తాజాదనం తెలుస్తుంది. స్థానికంగా ఉండే టీ స్టాల్స్ దగ్గర దొరికే కాఫీ తాగుతూ, చల్లని గాలిలో కూర్చోవడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సింపుల్‌గా ఉండే స్థానిక వంటలు మనసుకు హాయిని ఇస్తాయి.
అల్లూరి జిల్లా లంబసింగి, వణజంగి వద్ద చలి తీవ్రత. మంచు తెరలు చూసేందుకు పక్క రాష్ట్రాల నుండీ భారీగా తరలివస్తున్న పర్యాటకులు. #Vanjangi #Lambasingi #UANow #AndhraPradesh #Vizag pic.twitter.com/xu59YScia4
— UttarandhraNow (@UttarandhraNow) November 25, 2024
ఎప్పుడు వెళ్లాలి? | Best Time to Visit
నవంబర్ నుండి మార్చి వరకు చాలా చల్లగా ఉంటుంది. ఏప్రిల్ సమ్మర్లో కూడా సాయంత్రం సమయంలో చాలా చల్లగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇక్కడి మనుషుల అమాయకత్వం, వారి మర్యాద మన ప్రయాణాన్ని ఇంకా అందంగా మార్చేస్తాయి.
ఎలా వెళ్లాలి? | How To Plan From Hyderabad
విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్లే వారికి చింతపల్లి దగ్గర రైల్వే స్టేషన్ అనుకూలంగా ఉంటుంది. లంబసింగి ప్రయాణం మనసులోని అలసటను దూరం చేసి, కొత్త శక్తి ఇస్తుంది. ప్రకృతి ఒడిలో కొన్ని క్షణాలు గడిపితే అది జీవితాంతం గుర్తుండే ప్రయాణంగా మారిపోతాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
