Srivari Laddu: శ్రీవారి లడ్డూలో దారం అంటూ వైరల్ వీడియో.. టీటీడీ క్లారిటీ
Srivari Laddu: కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు భక్తులు ఎప్పుడు వెళ్లినా లడ్డూ ప్రసాదం ఆరగించకుండా తిరిగిరారు. అలాగే ఇంటికి వచ్చి చుట్టుపక్కల వారికి, బంధుమిత్రలకు ఆ లడ్డూను పంచుతారు.
అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పందించింది.
పవిత్రంగా, పరిశుభ్రంగా | Srivari Laddu Making
శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అత్యంత పవిత్రత, పరిశుభ్రతతో తయారు చేసి భక్తులకు అందిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్తో అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది.
పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో సిల్క్ క్లాత్ ముక్క
— Telugu Feed (@Telugufeedsite) August 25, 2026
లడ్డూ తయారీలో నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించిన భక్తుడు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/pSKVBiTSuO
ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో కఠినమైన ప్రమాణాలను పాటిస్తున్నామని, తయారీ ప్రక్రియలో ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ వివరించింది. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతతో ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల భక్తుల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని తెలిపింది.
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వీడియోలను షేర్ చేయవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రసాదానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరింది.
శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసింది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
