చెట్ల వేర్ల వంతెనల నుంచి తేలే ద్వీపాల వరకు…Indian Hidden Natural Wonders
Indian Hidden Natural Wonders : ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ఐలాండ్స్ కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు,లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారత దేశంలో ఎన్నో ఉంటాయి.
Indian Hidden Natural Wonders : ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ఐలాండ్స్ కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు,లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారత దేశంలో ఎన్నో ఉంటాయి.
ఈ ఐదు ప్రదేశాలు అలాంటి నేచురల్ వండర్సే. మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జి (Living Root Bridges) నుంచి మహారాష్ట్రలోని కాస్ ప్లాట్యూ (Kaas Plateau) వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు న్యూ లుక్‌లో కనిపిస్తుంది.
వేర్లతోనే వంతెనలు | Meghalaya
మేఘాలలో ఖాసీ ప్రజల లైఫ్ స్టైల్ అనేది ప్రకృతితో మమేకమైన లైఫ్ స్టైల్. దీనికి సాక్షాలే లివింగ్ రూట్ బ్రిడ్జిలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొన్ని బ్రిడ్జెస్ వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ టూరిజం చెబుతుంది.
నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ (Mawlynnong) ప్రాంతాల్లో ఇలాంటి బ్రిడ్జిలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.
నీళ్లపై తేలే జీవితం | Loktak Lake, Manipur
మణిపూర్‌లోని లోక్తాక్ లేక్‌ని మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న ఫ్లోటింగ్ ఐలాండ్స్ కనిపిస్తాయి. వీటిని ఫ్యూండిస్ (Phumdis) అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.
ఇంఫాల్ (Manipur Capital Imphal) నుంచి సుమారు 48 కిమీ దూరంలో ఉన్న లోక్తాక్, నార్త్ ఈస్ట్ ఇండియాలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్ (Keibul Lamjao National Park) ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.
మేఘాలు నివసించే లోయ | Dzukou Valley | Nagaland–Manipur
నాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ వ్యాలీని చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ ఫ్లవర్స్, బాంబూ తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.
హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ జర్నీలో నార్త్ ఈస్ట్ ల్యాండ్‌స్కేప్ మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్ జర్నీలోనే ప్రకృతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.
జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో బాంబూ ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ సైలెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.
త్సో మోరీరి లేక్ | Ladakh
లడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి (Tso Moriri) ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద నేచురల్ పెయింటింగ్‌గా కనిపిస్తుంది.
లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే ల్యాండ్‌స్కేప్ పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది.
కోర్జోక్ గ్రామం (Korzok Village), కోర్జోక్ మోనాస్టరీ, సరస్సు చుట్టూ తిరిగే మైగ్రేటరీ బర్డ్స్ ఈ ప్రదేశంలో ప్రత్యేక మెమోరీగా మిగిలిపోతాయి. చాంగ్పా నోమాడిక్ కల్చర్ కూడా చూసే అవకాశం లభిస్తుంది.
దక్షిణాది పూవుల లోయ | Kaas Plateau | Maharashtra
మహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ ప్లాట్యూని మహారాష్ట్రలోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం కలర్‌ఫుల్ కార్పెట్లా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.
హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ మధ్య సాగే ఈ జర్నీ ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్లో ఈ ప్లాట్యూ పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ లేక్, బమ్నోలి, ఠోసేఘర్ ఫాల్స్, సజ్జన్గడ్ లాంటి ప్రదేశాలు ఈ జర్నీలో హైలైట్‌గా మిగిలిపోతాయి.
సందర్శనీయ ప్రదేశాలు
ఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రక్రుతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపపోయే అనుభవాలే కదా.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
ఎలా వెళ్లాలి ?
హైదరాబాద్ నుంచి ఈ ఐదు డెస్టినేషన్స్‌కు వెళ్లే మార్గం అనేది డెస్టినేషన్‌ను బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి ఎంటర్ అవ్వొచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్ వైపు రోడ్డు జర్నీ చేసి వెళ్లవచ్చు. ఈ జర్నీ చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా రూట్లో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.
ఎక్కడ ఉండాలి ?
లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల సమీపంలో విలేజ్ హోమ్‌స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే స్టేలు, జుకో వ్యాలీ ప్రయాణంలో మౌంటెయిన్ రోడ్లు కనిపించే స్టేస్ బాగుంటాయి.
త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో గెస్ట్‌హౌస్‌లు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్–సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ డెస్టినేషన్‌లో స్టే చేయడం కూడా ఒక మెమోరీగా మారిపోతుంది.
ఏం చూడాలి ?
లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో వ్యాలీలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్ పువ్వులు… ఈ ఐదు డెస్టినేషన్స్‌లో మీరు ఎక్కడా ట్రావెలింగ్ వైబ్‌ని మిస్ అవరు. ఈ డెస్టినేషన్స్‌ను స్పీడ్‌గా కవర్ చేయాలని కాకుండా ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
ఏం తినాలి ?
మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో లోకల్ నాన్‌వెజ్ డిషెస్, లడఖ్‌లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి టేస్టీ టచ్ ఇస్తాయి.
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
యాక్టివిటీస్ | 5 Things To Do
ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకృతి దృశ్యాలను చూడటం, జుకో వ్యాలీలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల రిఫ్లెక్షన్స్‌ను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక స్పెషల్ మెమోరీగా మిగిలిపోతాయి.
యాత్ర, బడ్జెట్ వివరాలు
ఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్ అనేది డెస్టినేషన్‌ను బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో ప్రయాణించడం, లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టే, ఫుడ్ అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.
స్టాండర్డ్ ట్రావెల్ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రీమియం ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌కు అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో వ్యాలీ, లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టేల ఆధారంగా బడ్జెట్ పెరగే అవకాశం కూడా ఉంటుంది.
స్టే విషయానికి వస్తే పర్ నైట్ రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ టేస్ట్ అండ్ ఛాయిస్ ప్రకారం ఈ ఖర్చులు మారుతాయి.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.
లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
జుకో వ్యాలీ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకో లిల్లీకి ప్రసిద్ధి.
త్సో మోరీరి చాంగ్‌థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలో ఉన్న సరస్సు.
కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని స్వయంగా ధృవీకరించుకుని ప్లాన్ చేసుకోండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
