తిరుమల బ్రహ్మోత్సవాలు 2026 – దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్లాలి? | Tirumala flower exhibition 2026
Tirumala flower exhibition 2026 : తిరుమల కళ్యాణ వేదికలో 1.5 ఎకరాల్లో పూల ప్రదర్శన, ఫల ప్రదర్శన, ఫోటో ప్రదర్శన వివరాలు. 18 రకాల పూలు, 14 థీమ్స్, నాలుగు యుగాల కథ విశేషాలు..
తిరుమల అంటే చాలా మందికి దర్శనం, క్యూ లైన్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు అక్కడ వాతావరణం వేరేలా ఉంటుంది. లక్షల మంది భక్తులు వస్తారు.

ఇలా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఫ్లవర్ షో ప్రారంభించారు టీటీడి అధికారులు. మనలాంటి సామాన్య భక్తులకు ఇది మంచి విషయం. దర్శనం అయ్యాక కూడా గంట సేపు ప్రశాంతంగా చూసేందుకు మంచి చోటు ఉందని చాలా మందికి తెలియదు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారికి రోజూ 45 రకాల నైవేద్యాలు.. పేర్లు వింటే ఆశ్చర్యపోతారు | Tirumala Naivedyam
- తిరుమలలో రామ్ బగీచా 2 లో కొత్త మీడియా సెంటర్ ప్రారంభించారు. ఇక్కడ వైఫై, కంప్యూటర్లు, ప్రింటింగ్ మెషిన్ అన్ని సౌకర్యాలు పెట్టారు.
- మీడియా కేంద్రంతో పాటు కళ్యాణ వేదిక దగ్గర ఫల, పుష్ప, ఫోటో, తోట, ఫారెస్ట్, శిల్ప కళాశాల, ఆయుర్వేద ప్రదర్శనలు కూడా మొదలుపెట్టారు.
- కళ్యాణ వేదికలో పెట్టిన పూల ప్రదర్శన 1.5 ఎకరాల స్థలంలో ఉంది. ఇది చాలా పెద్దది.

- ఈ ప్రదర్శన కోసం 18 రకాల పూలు వాడారు, మొత్తం 72 వేల పూలతో అలంకరణ చేశారు.
- మొత్తం 14 రకాల అంశాలతో, నాలుగు యుగాల కథను పూలతో చూపించారు.
ప్రదర్శన లోపల ఏముంది – Inside Exhibition
ఇది మామూలు పూల షో కాదు, ఒక కథలా అనిపిస్తోంది నాకు..
- నాలుగు యుగాలు: కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన ఘట్టాలను పూలతో బొమ్మలుగా చేశారు. ప్రతి బొమ్మ దగ్గర నిలబడి చూస్తే ఆ యుగంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

- 14 అంశాలు: భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలను 14 రకాల అంశాలుగా ప్రజెంట్ చేశారు. ప్రతి అంశంలో పూలను వినూత్నంగా వాడారు.
- ఫోటో ప్రదర్శన: తిరుమల గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో తెలియజేసే అరుదైన ఫోటోలు ఇక్కడ పెట్టారు. తిరుమల కాలక్రమేణా ఎలా మారిందో ఈ ఫోటోలు చక్కగా చూపిస్తున్నాయి.

- మిగిలిన విభాగాలు: తోట, ఫారెస్ట్, శిల్ప కళాశాల వాళ్ళ బొమ్మల ప్రదర్శన, ఆయుర్వేద మూలికల ప్రదర్శన చూడొచ్చు.
- ఇది కూడా చడవండి : 1000 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలా జరిగేదో తెలుసా? శాసనాల్లో బయటపడ్డ అసలు నిజం
ఎందుకు చూడాలి ?
ఈ ప్రదర్శనను చూడటానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం తిరుమలకు వెళ్తే కొన్ని గంటలల పాటు క్యూలో ఉంటాం. దర్శనం అయ్యాక అలసిపోయి వెళ్లిపోతాం. కానీ ఈ ప్రదర్శన చూస్తే తిరుమల కాలంతో పాటు ఎలా మారిందో తెలుసుకోవచ్చు.
పిల్లలను ఈ ప్రదర్శన బాగా ఆకట్టుకుంటుంది. పుస్తకంలో చదవడం కంటే పూలతో చేసిన బొమ్మలు చూస్తే వారికి విషయాలు బాగా గుర్తుంటుంది. ఇక్కడ రద్దీ తక్కువ, ప్రశాంతంగా తిరగొచ్చు. ఫోటోలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది.

తిరుమల వెళ్లే భక్తులు ఈ ప్రదర్శనను ఎక్కడ చూడొచ్చు? – Location Guide
స్థలం: తిరుమలలో కళ్యాణ వేదిక దగ్గర. రామ్ బగీచా 2 కి దగ్గరలోనే.
ఎలా వెళ్లాలి: బస్ స్టాండ్ నుంచి నడిచి వెళ్లే దూరమే. ఆలయం నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో అడిగితే చెబుతారు.
ఎప్పుడు వెళ్లాలి: బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజులు మాత్రమే ఇది ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు తెరిచే ఉంటుంది. సాయంత్రం వెళితే దీపాల వెలుగులో పూల అలంకరణ ఇంకా బాగుంటుంది.
నా సూచన: దర్శనం సమయాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. దర్శనానికి ముందు లేదా తర్వాత చూడొచ్చు. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొడుగు, మంచినీళ్ల సీసా తీసుకెళ్లడం మంచిది.
తరచుగా అడిగే ప్రశ్నలు – FAQ
1. ఈ ప్రదర్శనకు టికెట్ ఉందా?
లేదు, ఉచిత ప్రవేశం. ఎవరైనా వెళ్లి చూడొచ్చు.
2. 72 వేల పూలు అంటే నిజమేనా?
అవును, 18 రకాల పూలు వాడారు. చామంతి, లిల్లీ, గులాబీ లాంటి రంగు రంగుల పూలతో 14 సెగ్మెంట్స్తో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
3. మీడియా కేంద్రంలోకి సామాన్య భక్తులకు అనుమతి ఉందా?
లేదు, అది వార్తల వాళ్ల కోసం మాత్రమే. కానీ దాని వల్ల మనకు లాభం ఏంటంటే పండుగ వార్తలు, వాహన సేవలు మనకు ఫోన్ లో తొందరగా వస్తాయి.
Source: TTD Official Press Release
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్
