Nepal Floods : నేపాల్లో భారీ వరద బీభత్సం.. 157 మంది మృతి, 400 మందికిపైగా గల్లంతు
Nepal Floods: నేపాల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న నేపాల్–చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో (Rasuwa) భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వరద వల్ల కనీసం 157 మంది మృతి చెందగా.. 400 మందికిపైగా గల్లంతయ్యారని సమాచారం. గల్లంతైన వారిలో ఎక్కువగా విదేశీ పర్యాటకులు, కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది.
Never seen boulders this massive being moved by the sheer force of water. Such boulders can sometimes change the flow of water or protect structures by taking impact, but this time they are nothing in front of the sheer force of the flood Death toll 160 and 750+ missing
— Nikhil saini (@iNikhilsaini) August 27, 2026
#Nepal pic.twitter.com/6YP2I2w0Aj
అతలాకుతలం | Nepal Floods
ఫ్లాష్ ఫ్లడ్స్ ధాటికి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు, నదిపై ఉన్న వంతెనలు, చుట్టుపక్కల ఉన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి. రసువాతో పాటు నువాకోట్, ధాదింగ్ ప్రాంతాలపై కూడా దీని ప్రభావం పడింది. సహాయక బృందాలు హెలికాప్టర్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే మారుమూల కొండ ప్రాంతాలకు చేరుకోవడం మాత్రం సవాలుగా మారింది.
అసలు ఏం జరిగింది | Reason For Nepal Flash Floods
నేపాల్లో ఈ విలయానికి అసలైన కారణం ఏంటి అనే విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అయితే అధికారుల కామెంట్స్, కొన్ని మీడియా సంస్థల రిపోర్ట్స్ ప్రకారం…
భోటే కోషి నదిలో ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం పెరగడానికి హిమనదం (Glacier) కూలిపోవడం, అనంతరం భారీ కొండచరియలు నదిలో పడటం ప్రధాన కారణంగా ఉన్నట్లు తాజా సైంటిఫిక్ ఎనలిటిక్స్ సూచిస్తున్నాయి.
అయితే దీనికి కారణం అక్కడ వచ్చిన భూకంపమే అయి ఉండొచ్చు అని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే తాజా USGS విశ్లేషణలో గ్లేసియర్ కూలిపోవడమే ప్రధాన కారణంగా గుర్తించినట్లు AP నివేదించింది.
టూర్ ప్లాన్ చేస్తున్నవారు అప్రమత్తం | Tips Before Travelling Nepal
ప్రస్తుతం నేపాల్ వెళ్లాలనుకునే పర్యాటకులు ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా రసువా, భోటే కోషి–ట్రిషూలీ నది పరివాహక ప్రాంతాల్లో రోడ్డు పరిస్థితులు, వాతావరణ సూచనలు ఏంటో ముందుగా తెలుసుకోవాలి. నేపాల్ టూరిజం బోర్డు తాజా ప్రయాణ సమాచారాన్ని కూడా పరిశీలించాలి.
ఇప్పటికే నేపాల్లో ఉన్నవారు నదులు, వాగులు, కొండచరియలు విరిగే ప్రాంతాలకు వెళ్లకూడదు. రాత్రివేళ కొండ రహదారులపై అనవసర ప్రయాణాలను తగ్గించి, స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.
అఫిషియల్ అప్డేట్స్ కోసం : Nepal Tourism Board – Latest Travel Updates, Nepal Department of Hydrology and Meteorology
Prayanikudu Update: పరిస్థితి వేగంగా మారుతున్నందున ప్రయాణికులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మకుండా అధికారిక వర్గాల తాజా ప్రకటనల ఆధారంగానే తమ ప్రయాణ నిర్ణయం తీసుకోవాలి.
‘ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
