Flight Journey Tips : ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? వీటినరి అస్సలు తీసుకెళ్లకండి
Flight Journey Tips : మొదటిసారి ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ట్రైన్ లేదా బస్సులో మనం క్యాజువల్‌గా కేరీ చేసే వస్తువులు కొన్ని విమానాల్లో అనుమతి ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్లడానికి ముందు లగేజ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.
Flight Journey Tips : మొదటిసారి ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ట్రైన్ లేదా బస్సులో మనం క్యాజువల్‌గా కేరీ చేసే వస్తువులు కొన్ని విమానాల్లో అనుమతి ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్లడానికి ముందు లగేజ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.
ముఖ్యాంశాలు
పెద్ద లిక్విడ్ బాటిల్స్ వద్దు | No Liquid
షాంపూ, పెర్ఫ్యూమ్, లోషన్, క్రీమ్స్, జెల్స్ లాంటి ద్రవ పదార్థాలను క్యాబిన్ బ్యాగేజీలో తీసుకెళ్లేప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెద్ద బాటిల్స్ కన్నా ట్రావెల్ సైజ్ కంటెయినర్స్ తీసుకెళ్లడం బెటర్. సెక్యూరిటీ చెక్ దగ్గర అనవసర కన్ఫ్యూజన్ రాకుండా ముందుగానే ప్యాక్ చేసుకోవాలి.
షార్ప్ వస్తువులు తీసుకెళ్లరాదు | No Sharp Things
కత్తి, బ్లేడ్, కటర్, పెద్ద కత్తెర, ఐరన్ స్కేల్ లాంటి షార్ప్ వస్తువులను బ్యాగులో పెట్టుకోరాదు. వీటి వల్ల సెక్యూరిటీ చెక్‌లో ఆపేసే అవకాశం ఉంది. అవసరమైన వస్తువులు ఉంటే ఎయిర్‌లైన్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం వాటిని ప్యాక్ చేయడం మంచిది.
పవర్ బ్యాంక్ చెకిన్ బ్యాగ్‌లో పెట్టకండి | No Power Bank
ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వారు సాధారణంగా చేసే తప్పుల్లో పవర్ బ్యాంకును చెకిన్ బ్యాగులో పెట్టడం ఒకటి. జనరల్లీ పవర్ బ్యాంకును, స్పేర్ లిథియం బ్యాటరీలను క్యాబిన్ బ్యాగేజ్లోనే కేరీ చేయాలి. చెకిన్ బ్యాగేజీలో పెట్టడానికి అనుమతి ఉండకపోవచ్చు.
లైటర్స్, అగ్గిపెట్టెలు… | No Match Box and Lighters
లైటర్స్, అగ్గిపెట్టెలు లాంటి నిప్పు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లడం నిషేధం కావచ్చు. వీటిని లగేజీలో పెట్టే ముందు మీ ఎయిర్‌లైన్ రూల్స్‌ను పక్కాగా చెక్ చేయండి.
- ఇది కూడా చదవండి : Gulmarg: భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
బొమ్మ ఆయుధాలు కూడా వద్దు | No Toy Guns
టాయ్ గన్స్, రెప్లికా ఆయుధాలు, ఆయుధాల లాగా కనిపించే వస్తువులు ఉంటే సెక్యూరిటీ వద్దే ఆపేసే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వస్తువులను ఫ్లైట్‌లో కేరీ చేయకపోవడమే మంచిది.
పేలుడు వస్తువులు తీసుకెళ్లకండి | No Explosives
టపాసుల వంటి ఫైర్ వర్క్స్, ఫ్యూయల్, గ్యాస్ సిలిండర్, కెమికల్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులను ఫ్లైట్‌లో తీసుకెళ్లడం నిషేధం. వీటిని చెక్డ్ బ్యాగేజీలో కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఉండకపోవచ్చు.
లగేజ్ బరువు | Luggage Weight
ఫస్ట్ టైమ్ అవసరం లేని వస్తువులతో బ్యాగును ఫుల్ చేయడం కన్నా అవసరమైన వస్తువులను మాత్రమే కేరీ చేయడం మంచిది. పాస్‌పోర్ట్ లేదా ఐడీ, టికెట్, ఫోన్, చార్జర్, మందులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని సులభంగా లభించే ప్రదేశంలో ఉంచుకుంటే ఎయిర్పోర్ట్ ప్రాసెస్ సులభంగా ఉంటుంది.
ఫ్లైట్‌కు ముందు చెక్ చేయండి
చివరిగా ప్రతీ ఎయిర్‌లైన్‌లో బ్యాగేజి రూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండవచ్చు. కాబట్టి ఫ్లైట్‌కి బయల్దేరే ముందు మీ ఎయిర్‌లైన్ అఫిషియల్ బ్యాగేజ్ రూల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ముందుగానే ప్రిపేర్ అయితే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ టెన్షన్ లేకుండా స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
