Sanjeevaiah Park Laser Show : సంజీవయ్య పార్కులో కొత్త లేజర్ షో.. టైమింగ్స్, టికెట్ ధరలు ఇవే
Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ఏదైనా కొత్తగా ఎక్స్‌పీరియెన్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే సంజీవయ్య పార్క్ ఇప్పుడు మీ వీకెండ్ ప్లాన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ కావచ్చు. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్ అండ్ మ్యూజికల్ ఫౌంటెయిన్ సిటీలో మరో కొత్త ఎంటర్టైన్మెంట్ అట్రాక్షన్‌గా నిలవనుంది.
వాటర్ స్క్రీన్ | Water Screen
సాధారణంగా ఫౌంటెన్ షోలో లైట్స్, వాటర్ జెట్స్తో బ్యూటిఫుల్ ప్రదర్శన జరుగుతుంది. అయితే ఈ కొత్త లేజర్ షోలో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యూజిక్కు అనుగుణంగా కదిలే మ్యూజికల్ ఫౌంటెయిన్తో పాటు, నీటినే స్క్రీన్‌లా ఉపయోగించి విజువల్స్ ప్రొజెక్ట్ చేస్తారు.
మరో హైలైట్ ఏంటంటే దీనికి లేజర్ ప్రొజెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. దీంతో నైట్ టైమ్‌లో ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది ఈ లేజర్ షో.
ఎవరు డెవలప్ చేశారు?
ఈ ప్రాజెక్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) రూ.49.65 కోట్ల వ్యయంతో డెవలప్ చేసింది.
భాగ్యనగరానికి వచ్చే టూరిస్టులతో పాటు, సిటీలోనే వీకెండ్లో సాయంత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకునే ఫ్యామిలీస్ కోసం ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
షోస్ ఎప్పుడు ఉంటాయి? | Sanjeevaiah Park Laser Show Timings
రోజూ రెండు షోస్ ఉంటాయి. ఫస్ట్ షో సాయంత్రం 7:00 నుంచి 7:30 వరకు, సెకండ్ షో రాత్రి 8:00 నుంచి 8:30 వరకు ఉంటుంది.
టికెట్ ధరలను కూడా ఫ్యామిలీ ఔటింగ్‌కు తగినట్టు రీజనబుల్‌గా ఫిక్స్ చేశారు.
పెద్దలకు రూ.150 కాగా, 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఈ టికెట్ ధరను రూ.120గా ఫిక్స్ చేశారు.
వీకెండ్ ప్లాన్‌కు సెట్ అవుతుందా? | Hyderabad Weekend
డెఫినెట్‌గా ఇది వీకెండ్‌కు సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలతో సాయంత్రం సమయాన్ని సరదాగా గడపాలి అనుకునే కుటుంబాలకు ఇది ఒక షార్ట్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీగా ఉపయోగపడుతుంది.
షో డ్యూరేషన్ కేవలం 30 నిమిషాలే కాబట్టి, మొత్తం ఈవెనింగ్‌ను ఇక్కడే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా నేను కూడా ఒక ప్లాన్ సజెస్ట్ చేయగలను… నచ్చితే ట్రై చేయండి.
ఆ సింపుల్ ప్లాన్ ఏంటంటే.. ఈవెనింగ్ సంజీవయ్య పార్క్‌కు వెళ్లి షో చూసి, ఆ తర్వాత ఎక్కడైనా డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. తరువాత మరోచోట ఐస్‌క్రీమ్ లేదా హాట్ ఇరానీ టీ ట్రై చేయవచ్చు.
హైదరాబాద్‌లో ఇప్పటికే పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేసిన వాళ్లకు కూడా ఇది ఒక ఫ్రెష్ ఈవెనింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు.
వీకెండ్లో వెళ్లాలని అనుకుంటే కొంచెం ముందుగానే రీచ్ అవ్వడం బెటర్. టికెట్ అవైలబిలిటీ, పార్కింగ్, ఎంట్రీ అరేంజ్మెంట్స్ గురించి వెళ్లడానికి ముందు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే ఇంకా కన్వీనియెంట్గా ఉంటుంది.
ఓవరాల్‌గా చూస్తే, వాటర్ స్క్రీన్ మీద విజువల్స్, లేజర్ లైట్స్, మ్యూజిక్, ఫౌంటెన్ కలిసి క్రియేట్ చేసే ఈ షో హైదరాబాద్‌లో ఒక డిఫరెంట్ నైట్‌టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయాలనుకునే వాళ్లకు ఇంట్రెస్టింగ్ ఆప్షన్.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
