Thailand Travel Guide : హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి ? కంప్లీట్ గైడ్
Thailand Travel Guide : థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా అవసరమా, హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చవుతుంది, అక్కడ ఎలా ప్రయాణించాలి వంటి విషయాలు ముందే తెలుసుకుంటే మీ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గైడ్లో థాయ్‌లాండ్‌కు మొదటిసారి వెళ్లేవారికి అవసరమైన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
Thailand Travel Guide : థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా అవసరమా, హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చవుతుంది, అక్కడ ఎలా ప్రయాణించాలి వంటి విషయాలు ముందే తెలుసుకుంటే మీ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గైడ్లో థాయ్‌లాండ్‌కు మొదటిసారి వెళ్లేవారికి అవసరమైన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి? | Hyderabad to Thailand Trip Plan
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేవారికి బ్యాంకాక్ మెయిన్ ఎంట్రీ పాయింట్ అవుతుంది.బ్యాంకాక్ చేరుకున్న తర్వాత అక్కడే ఉండవచ్చు లేదా డొమెస్టిక్ ప్లైట్స్‌లో ఫుకెట్, క్రాబీ, చియాంగ్ మై వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు.
బ్యాంకాక్ మాత్రమే చూడాలనుకుంటే అక్కడితో ప్రయాణాన్ని ముగించవచ్చు. బీచ్‌లను కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే బ్యాంకాక్‌తో పాటు ఫుకెట్ లేదా క్రాబీని కలిపి ప్రయాణ ప్రణాళిక చేసుకోవచ్చు.
వీసా, ప్రవేశ నిబంధనలు | Thailand Visa and Rules
భారతీయల విషయంలో థాయ్‌లాండ్ వీసా రూల్స్ తరచూ మారుతూ ఉంటాయి. అందుకే మీరు వెళ్లే ముందు ప్రస్తుతం అమలులో ఉన్న నియమ, నిబంధనలను థాయ్‌లాండ్ అఫిషియర్ సోర్సెస్ ద్వారా తెలుసుకుంటే ఉత్తమం. దీని కోసం మీరు అధికారిక థాయ్ రాయబార కార్యాలయం లేదా ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లో తప్పనిసరిగా చెక్ చేయాలి.
థాయ్‌లాండ్‌లోకి వెళ్లే విదేశీ ప్రయాణికులకు థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అంటే TDAC కూడా అవసరం. ఇది వీసా కాదు. థాయ్‌లాండ్ చేరుకునే ముందు సమర్పించాల్సిన డిజిటల్ ఎంట్రీ కార్డు. కాబట్టి ప్రయాణానికి ముందు వీసా నిబంధనలతో పాటు TDACకు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా చెక్ చేయండి.
థాయ్‌లాండ్‌లో ఏం చూడాలి? | Places To Visit In Thailand
థాయ్‌లాండ్‌లో సిటీ లైఫ్, పురాతన దేవాలయాలు, రాజభవనాలు, బీచ్‌లు, ఐలాండ్స్, మౌంటెయిన్స్, మార్కెట్స్ ఇలా ఎన్నో ఎక్స్ప్లోర్ చేయవచ్చు.
బ్యాంకాక్ అనేది థాయ్‌లాండ్ రాజధాని. గ్రాండ్ ప్యాలెస్, వాట్ ఫ్రా కేవ్ (Wat Phra Kwae), వాట్ అరుణ్, వాట్ ఫో, చతుచక్ మార్కెట్, యావరాత్ వంటి ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. నగర సందడి, దేవాలయాలు, మార్కెట్లు కలిపి బ్యాంకాక్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
బీచ్‌లు, దీవులు, సముద్ర ప్రయాణాలు ఇష్టపడేవారికి ఫుకెట్ మంచి ఛాయిస్ అవుతుంది. పటాంగ్, కటా, కరోన్ వంటి బీచ్‌లతో పాటు ఓల్డ్ ఫుకెట్ టౌన్, వివిధ దీవుల పర్యటనలను కూడా ప్రణాళికలో చేర్చుకోవచ్చు.
క్రాబీ ప్రకృతి అందాలకు పాపులర్.
సముద్రం, Sand Stone Cliffs, బీచ్‌లు, దీవులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఆవో నాంగ్ను (Ao Nang) బేస్ చేసుకుని రైలే బీచ్, చుట్టుపక్కల దీవులు, బోట్ ట్రావెల్ చేయవచ్చు.
అయితే కంప్లీట్ బీచ్ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే మాత్రం చియాంగ్ మైకి వెళ్లవచ్చు. డోయి సుతేప్, డోయి ఇంతనోన్, పాత నగరం, స్థానిక మార్కెట్లు, అక్కడి సంస్కృతి ఇవన్నీ ఇక్కడి హైలైట్స్.
థాయ్‌లాండ్ వెళ్లడానికి ఉత్తమ సమయం | Best time to Visit
థాయ్‌లాండ్ వెళ్లడానికి కళ్లుమూసుకుని ఇదే బెస్ట్ టైమ్ అని ఒకటి చెప్పలేము. ఎందుకంటే బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, చియాంగ్ మై ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి.
ముఖ్యంగా ఫుకెట్ లేదా క్రాబీకి వెళ్లాలనుకుంటే మీరు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో అక్కడి వాతావరణాన్ని ముందే చూసుకోవడం మంచిది. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో హోటళ్లు, పర్యటనలకు డిమాండ్ కూడా పెరగవచ్చు.
థాయ్‌లాండ్‌లో ఏం తినాలి? | Thai Food
థాయ్‌లాండ్ ప్రయాణంలో అక్కడి స్థానిక ఆహారాన్ని రుచి చూడటం కూడా ఒక ముఖ్యమైన అనుభవం. పద్ థాయ్, టామ్ యమ్, గ్రీన్ కర్రీ, సోమ్ టామ్, మ్యాంగో స్టిక్కీ రైస్ వంటి డిషెస్ చాలా పాపులర్.
వెజిటేరియన్స్ అయితే ఫుడ్‌లో వాడే పదార్థాల గురించి ముందుగానే అడగడం మంచిది. కొన్ని థాయ్ వంటకాల్లో ఫిష్ సాస్, రొయ్యల పేస్ట్ వంటివి వాడతారు. అందుకే ముందే ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పడం బెస్ట్.
థాయ్‌లాండ్‌లో ఎక్కడ ఉండాలి? | Places To Stay in Thailand
హోటల్ ఎంచుకునేటప్పుడు ధరలో పాటు అది ఉన్న ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంకాక్‌లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉన్న ఏరియాలో హోటల్ తీసుకోవడం బెస్ట్.
ఫుకెట్‌లో మీకు నచ్చిన బీచ్‌కు దగ్గరగా హోటల్ తీసుకోవచ్చు.
క్రాబీలో ఆవో నాంగ్ను కేంద్రంగా చేసుకుని స్టే చేయడం ఐలాండ్ విజిట్స్‌కి సౌకర్యంగా ఉంటుంది. చియాంగ్ మైలో పాత నగరం లేదా నిమ్మాన్ ప్రాంతాలను పరిశీలించవచ్చు.
థాయ్‌లాండ్‌లో స్థానిక రవాణా | Thailand Local Transport
బ్యాంకాక్‌లో మెట్రో, స్కైట్రైన్, ట్యాక్సీలు, బస్సులు వంటి అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఫుకెట్, క్రాబీ వంటి ప్రాంతాల్లో ట్యాక్సీలు, లోకల్ వెహికల్ సర్వీసెస్ ఉపయోగించవచ్చు.ఐలాండ్స్కు వెళ్లాలంటే ఫెర్రీ, స్పీడ్‌బోట్ లేదా లోకల్ బోట్స్ అవసరం కావచ్చు.
థాయ్‌లాండ్ ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది? | Thailand Budget
థాయ్‌లాండ్ ట్రిప్ బడ్జెట్ అనేది మీ ట్రావెల్ డేట్స్, విమాన టికెట్లు, హోటల్, ఫుడ్, స్థానిక రవాణా, ఐలాండ్ విజిట్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Bhutan Travel Guide 2025 🇧🇹 : భూటాన్ ఎలా వెళ్లాలి? ఖర్చు, ఫుడ్, టిప్స్ | Exploring Bhutan
బ్యాంకాక్ మాత్రమే వెళ్తే డొమెస్టిక్ ఫ్లైట్ ఖర్చు, హోటల్ ఛేంజ్, ఐలాండ్ విజిట్స్ ఉండవు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. అయితే ఫుకెట్ లేదా క్రాబీని కలిపితే ఫ్లైట్స్, హోటల్స్, బోట్ జర్నీ, ఇతర యాక్టివిటీస్ ఖర్చులు ఉంటాయి. దీనిని బట్టి బట్జెట్ ప్లాన్ చేసుకుంటే బెటర్.
కెమెరా, డ్రోన్ తీసుకెళ్లవచ్చా? | Thai Drone and Camera Rules
థాయ్‌లాండ్‌లో ప్రయాణించే సమయంలో కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అయితే కొన్ని దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఫొటోగ్రఫీకి ప్రత్యేక నిబంధనలు ఉండవచ్చు. అక్కడి సూచనలను పాటించాలి.
డ్రోన్ విషయంలో మాత్రం ముందుగానే నిబంధనలు తెలుసుకోవాలి. డ్రోన్ నమోదు, పైలట్ అర్హత, అనుమతులు, నో ఫ్లై జోన్ ప్రాంతాలకు సంబంధించిన నియమాలు ఉండవచ్చు. కాబట్టి థాయ్‌లాండ్‌కు వెళ్లే ముందు అక్కడి పౌర విమానయాన అధికార సంస్థ నిబంధనలను పరిశీలించి, అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే డ్రోన్ ఎగరేయాలి.
డబ్బు, సిమ్, ఇంటర్నెట్ | Thailand Currency
థాయ్‌లాండ్ కరెన్సీ థాయ్ బాట్ (Baht). ప్రయాణ సమయంలో కార్డుతో పాటు కొంత నగదు కూడా ఉంచుకోవడం ఉపయోగకరం. ముఖ్యంగా చిన్న దుకాణాలు, మార్కెట్లలో నగదు అవసరం కావచ్చు.
ఇంటర్నెట్ కోసం స్థానిక సిమ్ లేదా ఈ-సిమ్ తీసుకోవచ్చు.
ప్రయాణానికి ముందే మ్యాప్స్, Translation App, కరెన్సీ కన్వర్టర్, హోటల్, రవాణాకు సంబంధించిన యాప్‌లను ఫోన్లో సిద్ధంగా ఉంచుకుంటే ప్రయాణంలో సమయం ఆదా అవుతుంది.
మొదటిసారి థాయ్‌లాండ్ వెళ్లేవారికి | First Time Thailand Trip
దేవాలయాలకు వెళ్లేటప్పుడు అక్కడి దుస్తుల నియమాలు, స్థానిక సంప్రదాయాలను గౌరవించాలి. పాస్‌పోర్ట్‌ను భద్రంగా ఉంచడం కూడా ముఖ్యం. హోటల్లో సేఫ్టీ లాకర్ ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు.
ఐలాండ్ విజిట్, లేదా షిప్ జర్నీ సమయంలో ఆ రోజు వాతావరణ పరిస్థితులను ముందే తెలుసుకోవడం మంచిది.
అలాగే వీసా, TDAC, డ్రోన్ నిబంధనలు వంటి విషయాలను ప్రయాణానికి ముందు మరోసారి అధికారిక వెబ్సైట్లలో చెక్ చేయండి
హైదరాబాద్ నుంచి 6 రోజుల థాయ్‌లాండ్ ట్రిప్
| Hyderabad to Thailand 6 Days Trip itinerary
హైదరాబాద్ నుంచి మొదటిసారి థాయ్‌లాండ్ వెళ్లేవారు ఆరు రోజుల్లో బ్యాంకాక్, ఫుకెట్ రెండింటినీ కలిపి ప్రయాణించవచ్చు.
- మొదటి రోజు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ చేరుకుని హోటల్లో స్టే చేసి సాయంత్రం నగరాన్ని చూడవచ్చు.
- రెండో రోజు గ్రాండ్ ప్యాలెస్, వాట్ ఫ్రా కేవ్, వాట్ ఫో, వాట్ అరుణ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.
- మూడో రోజు బ్యాంకాక్ నుంచి విమానంలో ఫుకెట్ చేరుకుని హోటల్లో స్టే చేసిన తర్వాత సాయంత్రం బీచ్‌కు వెళ్లవచ్చు.
- నాలుగో రోజు దీవుల పర్యటన, పడవ ప్రయాణం, స్నార్కెలింగ్ వంటి యాక్టివిటీస్ చేయవచ్చు.
- ఐదో రోజు ఫుకెట్ నుంచి తిరిగి బ్యాంకాక్ చేరుకుని షాపింగ్ లేదా యావరాత్ ప్రాంతాన్ని చూడవచ్చు.
- ఆరో రోజు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ అవ్వొచ్చు.
థాయ్‌లాండ్ అంటే కేవలం బీచ్‌లు మాత్రమే కాదు. బ్యాంకాక్ లైఫ్‌స్టైల్, పురాతన దేవాలయాలు, ఫుకెట్ బీచ్‌లు, క్రాబీ ప్రకృతి, చియాంగ్ మై పర్వత ప్రాంతాల…ప్రతి ప్రాంతం ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
మొదటిసారి వెళ్తున్నవారు టైమ్, బడ్జెట్‌ను బట్టి బ్యాంకాక్‌తో పాటు ఫుకెట్ లేదా క్రాబీని ఎంచుకోవచ్చు. ప్రయాణానికి ముందు వీసా, TDAC, వాతావరణం, విమానాలు, హోటళ్లు, డ్రోన్ నిబంధనలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అధికారిక వనరుల ద్వారా నిర్ధారించుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
▶️ వీడియో చూడండి :
