Reel : శివలింగ దర్శనానికి వచ్చే నాగుపాములు | Begum Bazar Omkareshwar Temple
Begum Bazar Omkareshwar Temple : భారతదేశంలో ఆధ్యాత్మిక రహస్యాలు, పరమశివుడి మహిమలు ఎన్నో ఆలయాల్లో మనకు కనిపిస్తుంటాయి. అలాంటి ఒక విశేషమైన అనుభూతిని మన ప్రయాణికుడు (PRAYANIKUDU) సరికొత్త షార్ట్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం.
ఈ పురాతన శివాలయంలో నాగుపాములు స్వయంగా వచ్చి శివలింగాన్ని దర్శించుకుని వెళ్తుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇది ఏదో శ్రావణ మాసంలోనో లేదా ప్రత్యేక పర్వదినాల్లోనో మాత్రమే కాదు… ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటాయట! అవి ఏ సమయంలో వస్తాయో ఎవరికీ తెలియదు, కానీ ఎవరికీ హాని చేయకుండా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాయి అని ఆలయ పురోహితులు మహాజన్ చేతన్ గిరి తెలిపారు.
- ఇది కూడా చదవండి : బేగంబజార్ భూలక్ష్మి అమ్మవారి ఆలయం గైడ్
పూర్వం నుంచి ఉన్న గురువులు, పెద్దలు మాత్రమే ఈ అద్భుత దృశ్యాన్ని స్వయంగా చూశారని ఆయన తెలిపారు. శివునికి నాగాభరణుడనే పేరు ఎలా సార్థకమైందో గుర్తుచేసే ఈ ఆసక్తికరమైన సంఘటనను మీరు కూడా వీక్షించండి!
వీడియో లింక్: రోజూ శివాలయానికి వచ్చే నాగుపాములు ! | Snakes Visiting Shiva Lingam | #shorts #prayanikudu
