Diwali Sweets : పండగ ప్రయాణాల్లో తప్పక రుచి చూడాల్సిన ఐకానిక్ ఇండియన్ స్వీట్స్!
Diwali Sweets : దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదు..తీయని వేడుక చేసుకునే అవకాశం కూడా. అందుకే తీయని మిఠాయిలతో ఈ దీపావళిని తీపావళిగా సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ప్రయాణాల్లో ఉంటే ఏ ప్రదేశంలో ఏం ట్రై చేయాలో స్వీట్ గైడ్ మీ కోసం…
ఢిల్లీ | Delhi Sweets
దౌలత్ కీ చాట్, మోతీచూర్ లడ్డు
చాందినీ చౌక్ లో దీపావళి లైట్ల మధ్య దొరికే దౌలత్ కీ చాట్ కేవలం చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. పాల నురగతో చేసే ఈ స్వీట్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అక్కడి పాత షాపుల్లో మోతీచూర్ లడ్డు, పిర్ని కూడా దీపావళి స్పెషల్ గా చేస్తారు.
జైపూర్ | Jaipur Sweets
ఫీణి, మావా కచోరీ
జోహారీ బజారలో దీపావళి షాపింగ్ చేస్తూ ఫీణి, స్వీట్ మావా కచోరీ తప్పకుండా ట్రై చేయాలి. నెయ్యిలో వేయించిన సన్నటి నూడుల్స్ లాంటి ఫీణిపై పంచదార, డ్రై ఫ్రూట్స్ వేస్తారు. మావా కచోరీ లోపల తీపి మావా అంటే స్టఫ్ ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
ఇండోర్ | Indore Sweets
మావా బాటీ, మోహన్ థాల్:
ఫుడ్ లవర్స్ కి ఇండోర్ స్వర్గం లాంటిదే. సరాఫా నైట్ మార్కెట్ లో దీపావళి రోజు లైట్ల వెలుగులో మావా బాటీ, మోహన్ థాల్, కాజూ పాక్ తింటూ షికారు చేయవచ్చు. మావా బాటీని గోధుమ బంతిలా చేసి నెయ్యిలో ముంచి ఇస్తారు. ఇది మనం తినే గులాబ్జామున్లానే ఉంటుంది.
హైదరాబాద్ | Hyderabad Sweets
బాదం కి జాలి, ఇరానీ స్వీట్స్
హైదరాబాద్లో చార్మినార్ దగ్గర దీపావళి లైటింగ్ చూస్తూ పాతబస్తీలో బాదం కి జాలి, దిల్ ఖుష్, అశర్ఫీ టేస్ట్ చేయండి. ఇవి నిజాం కాలం నాటి రెసిపీలు. హైదరాబాదీ ఇరానీ బేకరీల్లో దీపావళి స్పెషల్ డ్రై ఫ్రూట్ బిస్కెట్లు కూడా బాగుంటాయి. బేగంబాజర్ వెళ్తే గల్లీగల్లీలో స్వీట్ షాపులు ఉంటాయి. ఏం టేస్ట్ చేయాలి అనేది మీకు అక్కడి వెళ్లగానే అర్థం అయిపోతుంది.
తమిళనాడు | Tamo
తిరునల్వేలి హల్వా, పాల్కోవా
తమిళనాడు వెళ్తే సాగుతూ, నెయ్యి కారుతూ ఉండే తిరునల్వేలి హల్వాను అస్సలు మర్చిపోవద్దు. ఇరుట్టుకడై హల్వా షాపులో వేడి వేడి హల్వా ఇస్తారు. అలాగే శ్రీవిల్లిపుత్తూర్ పాల్కోవా కూడా దీపావళి గిఫ్ట్ కి బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరి వెలుగులతో పాటు ఆ ఊరి మిఠాయినీ ట్రై చేస్తే ఈ దీపావళి తీపావలి అవుతుంది. ఈ సారి కెమెరా నిండా ఫోటోలతో పాటు వెళ్లిన ప్రతీ ప్రాంతం నుంచి బ్యాగు నిండా స్వీట్స్ కూడా తెచ్చుకోని బంధు మిత్రులకు షేర్ చేసి ఆనంధాన్ని డబుల్ చేసుకోండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
