Statue Of Unity : ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మన భారత్ లోనే! 182 మీటర్ల అద్భుతం చూశారా?
Statue of Unity – ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహం గుజరాత్ లోని కెవాడియాలో ఉంది. టికెట్ ధర, బెస్ట్ టైమ్, లిఫ్ట్ జర్నీ, టాప్ వ్యూ, మ్యూజియం, లేజర్ షో తో షార్ట్ గైడ్ వీడియో పబ్లిష్ చేశాను. అది చూసే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని ఈ పోస్ట్ పబ్లిష్ చేస్తున్నాను.
బాటనీ చదవితే పూవులు అందం బాగా తెలుస్తుంది అంటారు…అందుకే నా ప్రయాణికుడులో ఈ పోస్టు చదివితే ఆ వీడియో బ్యూటి తెలుస్తుంది.
భారతదేశం అంటేనే ఐక్యతకు ప్రతీక. ఆ ఐక్యతకు నిలువెత్తు నిదర్శనమే గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఈ విగ్రహం గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున, కెవాడియా అనే చిన్న పట్టణంలో ఉంది.
ఈ విగ్రహం భారతదేశ ఉక్కు మనిషి, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. దేశంలోని 562 సంస్థానాలను ఏకం చేసి నేటి అఖండ భారతాన్ని నిర్మించిన ఘనత ఆయనదే. ఆయన సేవలకు గుర్తుగా 2018 అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నేను సర్డార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కొలువై ఉన్న గుజరాత్లోని ఏక్తా నగర్ వెళ్లాను..దానికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలో పబ్లిష్ చేస్తాను…ఆలోపు మీ కోసం చిన్న ట్రైలర్ వీడియో prayanikudu official అనే Insta handle లో పోస్ట్ చేశాను…
నా భారత్ పర్వ్ 2026 యాత్రలో భాగంగా నేను ఇటీవల ఈ విగ్రహాన్ని సందర్శించాను. దగ్గరగా వెళ్తున్న కొద్దీ భారీ విగ్రహాన్ని చూస్తుంటే నోట మాట రాలేదు. విగ్రహం ప్రపంచంలోనే రెండవ అత్యంత ఫాస్టెస్ట్ లిఫ్టు ద్వారా 135 మీటర్ల ఎత్తులో ఉన్న వ్యూయింగ్ గ్యాలరీకి క్షణాల్లో వెళ్లాను.
అక్కడి నుంచి నర్మదా (దీనిని సర్దార్ సరోవర్ డ్యామ్ అని కూడ అంటారు) డ్యామ్, సత్పురా, వింధ్య పర్వత శ్రేణులు, మొత్తం కెవాడియా వ్యాలీ అద్భుతంగా కనిపిస్తుంది.
ఇక్కడ కేవలం విగ్రహమే కాదు, మ్యూజియం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, సర్దార్ సరోవర్ డ్యామ్ వ్యూ, రాత్రి వేళ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటాయి. రెండు రోజులు మొత్తం కేటాయిస్తేనే పూర్తిగా చూడగలం.
కెవాడియా చేరుకోవడానికి అహ్మదాబాద్ లేదా వడోదర నుండి రైలు, బస్సు సౌకర్యం ఉంది. టికెట్ ధరలు 150 రూపాయల నుండి మొదలవుతాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. చలికాలం అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వెళ్లడం బెస్ట్.
ఈ విగ్రహం చూసిన తర్వాత నిజంగా అనిపించింది – ఇది కేవలం విగ్రహం కాదు, మన భారతదేశ ఆత్మగౌరవం అని…
ఈ ట్రైలర్ వీడియో మీకు నచ్చితే ఫుల్ వ్లాగ్ త్వరలో PRAYANIKUDU Facebook and Youtube ఛానల్ లో వస్తుంది. ఇదే స్పీడులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రిగారితో 3000 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్లో నేను చేసిన ఈ ఇంటర్వ్యూను చూడండి…
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
