Ravana Lanka : రావణుడి లంక ఎలా ఉంటుంది? ఎలా వెళ్లాలి ? 5 Facts ! 

భారత దేశానికి అత్యంత సమీపంలో ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. లంక అనగానే భారతీయులకు ముందుగా రావణుడే గుర్తుకు వస్తాడు. అలాంటి రావణాసురుడు ఉన్న లంక ( Ravana Lanka ) గురించి ఈ పోస్టులో మీకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందిస్తున్నాను. 

రావణ లంకకు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి దగ్గర్లో ఏం చూడాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోస్టులో మీతో షేర్ చేసుకోనున్నాను. శ్రీలంకాలోని ( Sri Lanka ) సెంట్రల్ ప్రావిన్సులో మటాలే జిల్లాలో సిగిరియా అనే కోట ఉంది. దీనిని రావణ ప్యాలెస్, లయన్ రాక్ లేదా రావణ కోట, రావణ లంక అని పలు పేర్లతో పిలుస్తుంటారు.

సిగిరియా రాక్ అంటే ఏంటి ? | What is Sigiriya Rock ?

సిగిరియా రాక్ అనేది యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ( UNESCO World Heritage Site) గుర్తింపు తెచ్చుకున్న ఒక నేచురల్ రాక్. శ్రీలంక దేశ చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది సిగిరియా రాక్. దీనిని వరల్డ్ వండర్ ( World Wonder) అని కూడా అంటారు. కానీ ఎక్కడా అధికారికంగా దీన్ని వండర్ అని నమోదు చేయలేదు. 

Sigiriya Rock Srilanka Prayanikudu
సిగిరియా మందు ఒక ప్రయాణికురాలు | PC : Pexels

200 మీటర్ల ఎత్తైన ఈ కొండను పై నుంచి చూస్తే ఇది వండరే అనిపిస్తుంది. ఈ కొండపైనే రావణుడి కోట ఉండేది అని అంటారు. లయన్స్ రాక్ పై భాగంలోకి చేరుకోవాలి అంటే 1200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 

రావణ ప్యాలెస్ చరిత్ర | Ravana Lanka History 

లయన్ రాక్‌పై ఉన్న నిర్మాణం లంకకు ఒకప్పటి మహారాజు అయిన రావణుడి కోట అని అంటారు. రావణుడి తరువాత సిగిరియా లేదా లయన్ రాక్‌ను 5వ శతాబ్దంలో కష్యప మహారాజు ( King Kashyapa) మరింతగా అభివృద్ది చేశాడంటారు. 

Ravana Palace Srilanka4
సిగురియా | Sri Lanka

దీంతో పాటు లయన్ రాక్‌ను లింక్ చేస్తూ మరెన్నో చారిత్రాత్మక విషయాలను స్థానికులు చెబుతుంటారు. ఒక వేళ మీరు ఇక్కడికి వెళ్తే ఒక టూరిస్టు గైడు సహాయం తీసుకుంటే బెస్ట్. సుమారు రూ.3000-5000 లకే టూరిస్టు గైడు మీకు దగ్గరుండి అన్నీ వివరిస్తాడు. కొండపై ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు, వాటర్ గార్డెన్స్, నాటి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని చాలే నిర్మాణాలు కనిపిస్తాయి. నాటి శ్రీలంక ఎలా ఉండేదో చూడాలంటే ఈ కొండపైకి వస్తే చాలు.

సిగిరియా గురించి 5 ఆసక్తికరమైన విషయాలు

5 interesting Facts About Sigiriya :  శ్రీలంక చరిత్రలో సిగిరియాది కీలక పాత్ర అని చెప్పవచ్చు.

ఒకప్పటి శ్రీలంక ఎలా ఉండేదో తెలుసుకునేందు ఇది మంచి స్పాట్.

1. కుడ్య చిత్రాలు | Sigiriya Frescoes 

లయన్ రాక్‌‌పై కొన్ని చోట్ల గోడలపై అద్భుతమైను కుడ్య చిత్రాలు కనిపిస్తాయి. ఈ కుడ్య చిత్రాలు సుమారు 1500 ఏళ్లనాటివి అని చెెెబుతారు. సహజ రంగులతో, పలు పౌరాణిక పాత్రలను ఇక్కడ మనం పెయింటింగ్స్ రూపంలో చూడవచ్చు. 

Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

2. లయన్స్ గేట్ | The Lions Gate

రావణుడి ప్యాలెస్ ఎంట్రెన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్ అనడం కన్నా విశిష్టంగా ఉంది అనొచ్చు. ఒక సింహం పంజా ఆకారంలో కొండను తొలిచారు. అందుకే దీన్ని లయన్స్ రాక్ అని కూడా పిలుస్తుంటారు. 

Sigiriaya Lion Rock Prayanakudu Pexels 2
సిరిగియా సింహద్వారం | PC: Pexels

3. గార్డెన్స్ | Lions Rock Gardens

లయన్స్ రాక్‌పై పలు గార్డెన్స్ కనిపిస్తాయి. నాటి టెర్రెస్ ల్యాండ్ స్కేపింగ్, సిమ్మెట్రికల్ ప్యాటెర్న్, సింహాలిక్ నిర్మాణ శైలికి ఈ గార్డెన్స్ ఉదాహరణగా నిలుస్తాయి.

Prayanikudu

4. యూనెస్కో గుర్తింపు 

సిగిరియా రాక్ విశిష్టతను బట్టి యూనెస్కో 1982 లో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. లయన్ రాక్ చరిత్ర, నిర్మాణ శైలి గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

5. బౌద్ధాలయం | Buddha Monastery

రావణుడి తరువాత లయన్ రాక్ ఎంత మంది రాజులు నుంచి చివరికి కష్యప మహరాజు ఆధీనంలోకి వచ్చింది అంటారు. అంతకు ముందు ఈ కొండ బౌద్ధ మతస్తులకు ఆలయంగా ఉండేదట.

హైదారాబాద్ నుంచి సిగిరియా ఎలా చేరుకోవాలి ?

How to Pan Hyderabad to Sigiriya Tour :  శ్రీలంక చాలా అందమైన దేశం. దేశం చుట్టూ సముద్రం, దేశం లోపల ఎటు చూసినా అందమైన ప్రకృతి కనిపిస్తుంది. ఇలాంటి అందమైన దేశానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందామా?

Read Also : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
  • విమానంలో | Sri Lanka By Air From India

శ్రీలంకలోని సిగిరియాకు అతి దగ్గరిలో ఉన్న ఎయిర్ పోర్టు పేరు బండారనైకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CMB Colombo Bandaranayake ) . ఇది శ్రీలంక రాజధాని కొలంబోలో ఉంది. హైదరాబాద్ నుంచి కొలంబోకు మధ్య పలు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 3-4 గంటల్లో మీరు శ్రీలంకాకు చేరుకోవచ్చు. రానూ పోను టికెట్లకు మీకు రూ.20,000 నుంచి 22,000 వరకు ఖర్చు అవ్వొచ్చు. 

lion gate sigiriya Srilanka Prayanikudu
లయన్ గేట్, సిగిరియా

కొలంబో నుంచి సిగిరియా | Sigiriya To Colombo

మీరు కొలంబో చేరుకున్న తరువాత వెంటనే లేదా మీ ప్లాన్ ( Sri Lanka Itinerary ) ప్రకారం సిగిరియా ప్లాన్ చేసుకోవచ్చు. కొలంబో నుంచి లయన్ కార్ 160 కిమీ దూరంలో ఉంటుంది. కార్ లేదా ట్యాక్సీలో మీరు సిగిరియాకు చేరుకోవచ్చు. ఏ1 హైవేలో మిమ్మల్ని 4-5 గంటల్లో సిగిరియా వద్దకు చేర్చుతాడు.

Place in Ravana Lanka Sri Lanka
సిగిరియా | Sri Lanka

ఒక వేళ మీరు బస్సులో ప్రయాణించాలి అనుకుంటే కొలంబో బస్ స్టేషన్ నుంచి ఢంబుల్లా ( Colombo to Dambulla Bus) కు వెళ్లే బస్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. తరువాత డంబుల్లా నుంచి లోకల్ ఆటోలో ( Sigiriya Tuk Tuk) మీరు సిగిరియా చేరుకొచ్చు. ఇలా వస్తే మీకు డబ్బు సేవ్ అవుతుంది. కానీ కాస్త టైమ్ ఎక్కువ పడుతుంది అంతే.

ప్రైవేట్ టూర్ | Private Tour

బస్సులు, గైడ్లు ,ట్యాక్సీల గొడవ వద్దు అనుకుంటే మీరు ట్రావెల్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీరు చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు.

దగ్గర్లో యాక్టివిటీస్ | Activities Near Sigiriya 

1.లయన్ రాక్ క్లైంబింగ్ | Lion Rock Climbing

సిగిరియా టూర్లో హైలైట్ ఏంటి అంటే లయన్ రాక్ ఎక్కడమే. ఈ మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. వీటిని కొండను తొలిచి ఏర్పాటు చేశారు. మెట్లను ఎక్కుతూ మీరు చుట్టుపక్కన ఉన్న అందాలను వీక్షించవచ్చు.

Sigiriya Fort Prayanikudu
సిగురియా లేదా లయన్ రాక్ | Sri Lanka | PC: Unsplash

2.కుడ్య చిత్రాలు | Visit The Frescoes 

మీరు సిగిరియా వెళ్తే పైన గోడలపై ఉన్న కుడ్య చిత్రాలను చూడవచ్చు. వందల ఏళ్లు అయినా చెక్కుచెదరని వాటి సౌందర్యం మిమ్మల్ని తప్పుకుండా ఆశ్చర్యపరుస్తాయి.

3. వాటర్ గార్టెన్ | Water Gardens

ఒక్కసారి మీరు లయన్ రాక్‌పైకి ఎక్కిన తరువాత అక్కడ ఉన్న గార్డెన్స్‌ను వీక్షించవచ్చు. కిందా పైగా భాగంలో ఉన్న పౌంటేన్స్,  సరస్సులు, కెనాల్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

Read Also: Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

4. అద్దాల గోడ | Mirror Wall

ఇక్కడ మిర్రర్ వాల్ అని ఉంటుంది. ఈ గోడపై ప్రయాణికులు, బంధు మిత్రులు ఫోటోలు ఉంటాయి.  ఇక్కడికి వచ్చిన కవులు రాసిన కవితలు కూడా చూడవచ్చు. 

5. వన్య జీవులు | Sigiriya Wildlife

సిగిరియా సమీపంలో చారిత్రాత్మక ప్రదేశాలే కాదు…నేచర్ కూడా బాగుంటుంది. ఇక్కడ పలు రకాల పక్షులు, జంతువులు ఉంటాయి. కాస్త టైమ్ ఉంటే ఇది కూడా ట్రై చేయవచ్చు. వీటితో పాటు డంబుల్లా గుహాలయం ( Dambulla Cave Temple ) , మిన్నెరియా నేషనల్ పార్క్ కూడా సందర్శించవచ్చు.

wild animals at sigiriya
సిగిరియా సమీపంలో …

మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి.  మీ ప్రయాణ అనుభవాన్ని మాతో కూడా షేర్ చేసుకోండి.

ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!