Kedarnath : కేదార్‌నాథ్ ఆలయం ఫోటోకు ఆనంద్ మహీంద్రా ఫిదా..ఎందుకో చూడండి

కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయానికి చెందిన ఒక నైట్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ఎక్స ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో అద్భుతమైన హిమాలయ పర్వతాల మధ్య కేదార్‌నాథ్ ఆలయం అత్యంత వైభవంగా ప్రకాశిస్తుంది.

మాటలకు అందని ఆధ్మాత్మిక భావన్ని కలిగించేలా ఉన్న దృశ్యం ఇది. దీనిని ( Kedarnath Night View ) ప్రత్యక్షంగా చూసిన వారు నిజంగా అదృష్టవంతులే అంటున్నారు నెటిజెన్లు.

ఈ ఫోటో కేవలం ఆలయ వైభవాన్ని మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న పర్వతాల అందాన్ని కూడా చూపుతోంది. ఈ దృశ్యం కోసమే భక్తులు, ప్రయాణికులు ( Travelers ) , ఇద్దరూ కూడా ఈ కేదార్‌నాథ్‌కు రావడానికి ఇష్టపడుతుంటారు. రాత్రి సమయంలో మిలమిల మెరిసే తారల్లో ఆలయాన్ని దర్శించుకోవడం అనేది నయనానందం మాత్రమే కాదు ఆధ్మాత్మికంగా కూడా ప్రశాంతతను కలిగిస్తుంది. 

ఇది కూడా చదవండి : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు 

మీరు కేదార్‌నాథ్ ఎందుకు వెళ్లాలి ? | Why Should You Visit Kedarnath ?
1. ఆధ్మాత్మిక ప్రాధాన్యత

హిందూ మతంలో కేదార్‌నాథ్ ఆలయానికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే ప్రతీ హిందువు  తన జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే నాలుగు ధామాల్లో ( Char Dham Yatra ) ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం మహాశివుడి ( Lord Shiva ) భక్తులకు అతి పవిత్రమైన తీర్థ క్షేత్రం. 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ( Uttarakhand ) ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి కేవలం భారత దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడి ఆధ్మాత్మిక శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. భక్తి ( Spiritual ), మానసిక ప్రశాంత పొందడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

2. అద్భుతమైన ప్రకృతి

అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాల్లో ( Himalayas )  కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయం ప్రకృతి అందాలకు నెలవు లాంటిది. పగటి పూట ఎలాగూ అందంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో ( Kedarnath Night Views ) ఇక్కడ ఆలయం వెలుగుతో పాటు ఆకాశంలో జిగేలు మని ప్రకాశించే తారలు, చంద్రుడి వెలుగు వల్ల కనిపించే మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఇదో అందమైన కావ్యం లాంటి దృశ్యం.

ఆలయ నిర్మాణం ఎంత విశిష్టంగా ఉంటుందో చుట్టుపక్కన ఉన్న వ్యూ ( Kedarnath Location ) కూడా అంతే రమణీయంగా ఉంటుంది. అందుకే ఇక్కడ శివ భక్తిలో మునిగితేలే భక్తులే కాదు ప్రకృతి ఆరాధకులు ఆరాధిస్తూ కనిపిస్తారు. తమ కెమెరాలకు పని చెబుతూ అక్కడి సీన్స్‌ను క్యాప్చర్ చేస్తారు. ఈ ఆలయం చలికాలం మూసి ఉంటుంది. మీరు 2024 మే తరువాత వెళ్లగలరు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్…

ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra ) కూడా కేధార్‌నాథ్ ధామ్ గురించి షార్ట్ అండ్ క్రిస్పీగా వర్ణించారు. ఈ ధామం కేవలం సైట్‌సీయింగ్ కోసం మాత్రమే కాదు ఆధ్మాత్మికంగా ( Devotional ), ప్రకృతి ఆరాధన పరంగా ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది అని చెప్పకనే చెప్పారు. 

ఈ పోస్టు మీరు కూడా చూడండి

నెటిజెన్ల స్పందన

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు సోషల్ మీడియా సిటిజెన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అందులో కొన్ని కామెంట్స్ మీరు కూడా చూడండి.

ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts

కామెంట్స్ ఇవే…

@YadavDevendra83 :Kedarnath dham and Kailash are in top of my list

యాదవ్ దేవంద్ర అనే ఎక్స్ యూజర్ కేదార్‌నాథ్, కైలాస పర్వతం తన లిస్టులో టాప్‌లో ఉంటాయని కామెంట్ చేశాడు

  • @ShiivamD :  No filters used.  But the pic is

ఈ ఫోటో ఎలాంటి ఫిల్టర్లు వాడకపోయినా చాలా బాగుంది అని కామెంట్ చేశాడు శివం అనే యూజర్.

  • @tootihaddi : Pls save these pristine spiritual places from construction and reel bhakts.

ఈ పవిత్ర క్షేత్రాన్ని నిర్మాణాలు, రీల్స్ కోసం వచ్చే భక్తుల నుంచి కాపాడండి అని టూటీ హడ్డీ అనే యూజర్ కామెంట్ చేశాడు

  • @veda1791: Place of our beloved Mahadeva turned into tourist destination. Earlier only those who were physically fit and filled with devotion can get glimpse of our beloved. Nowadays anyone can visit this.

మా ప్రియాతిప్రియమైన మహాశివుడి క్షేత్రం ఒక పర్యాటక ( Tourism Spot ) స్థలంగా మారింది. గతంలో కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉన్న వాళ్లు, మనసు నిండా భక్తి ఉన్న వాళ్లు మాత్రమే దర్శనం చేసుకునే వారు. కానీ నేడు ప్రతీ ఒక్కరు వెళ్తున్నారు అని వేదా అనే యూజర్ కామెంట్ చేశారు.


ఛార్ ధామ్ యాత్రలో భాగంగా..

ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా జూన్ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు చాాలా మంది భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది ఒక అద్భుతమైన ఆధ్మాత్మిక ప్రయాణం. దీని కోసం ఎత్తైన హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఫోటో చూసిన తరువాత మీకు ఏం అనిపిస్తోందో కామెంట్ చేయండి. దీంతో పాటు మీరు ఎప్పుడైనా కేదార్‌నాథ్ వెళ్లి ఉంటే ఆ విశేషాలు షేర్ చేయండి. 

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
Kedarnath : కేదార్‌నాథ్ ఆలయం ఫోటోకు ఆనంద్ మహీంద్రా ఫిదా..ఎందుకో చూడండి

Leave a Comment

error: Content is protected !!