అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.
ముఖ్యాంశాలు
శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమల, అర్చన్, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను విడుదల చేయనుంది. వచ్చే ఏడాది అంటే మార్చి 2025 నెలకు సంబంధించిన కోటా వివరాలు తితిదే ( Tirumala Tirupati Devasthanam ) 2024 డిసెంబర్ 18వ తేదీ ఉదయం అప్‌డేట్ చేయనుంది. ఈ అప్‌డేట్స్ మీరు ఆన్‌లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు.
నమోదు ఇతర వివరాలు | TTD Updates
శ్రీవారి ఆర్జిత సేవా ( Arjitha Seva ) మార్చి టికెట్ల కోసం డిసెంబర్ 18వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు మీరు ఆన్‌లైన్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. 20వ తేదీ ఉదయం 10 గంటల్లోపల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ పూర్తి చేసి, టికెట్లు పొందిన భక్తులు డిసెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసిన వారిలో కొంత మందికి లక్కీ డిప్‌లో టికెట్లు అలాట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
శ్రీవారి ఆర్జిత బ్రహ్మెత్సవం, కల్యాణోత్సవం, ఉంజల్ సేవ ( Urjal Seva ), సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. వీటిని 2024 డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. దీంతో పాటు వర్చువల్ సేవలు, స్లాట్స్ మార్చి కోటాను 2024 డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. వీటిని మీరు తితిదే ఆన్‌లైన్లో ( TTD Online ) చెక్ చేయవచ్చు.
డిసెంబర్ 23వ తేదీ
- ఉదయం 10 గంటలకు : అంగ ప్రదక్షిణం టోకెన్లు
- ఉదయం 11 గంటలకు : శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్ టికెట్ల కోటా
- మధ్యాహ్నం 3 గంటలకు : దివ్యాంగులు, వృద్ధుల, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి దర్శనం కోటా.
డిసెంబర్ 24వ తేదీ:
- ఉదయం 10 గం.: మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
- మధ్యాహ్నం 3 గం.: మార్చి నెల గదుల కోటా విడుదల.
తిరుమల అప్డేట్స్ | Tirumala Updates
- TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి !
- TTD Updates : తిరుపతి స్థానికులు శ్రీవారిని ఈ రోజుల్లో దర్శించుకోవచ్చు…టీటీడి 6 మార్గదర్శకాలు
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.