Alert for Air Passengers: దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు కొత్త రూల్స్.. విమానంలో తీసుకెళ్లకూడని వస్తువుల లిస్ట్ ఇదే!
Alert for Air Passengers: ఇతర ప్రయాణ మార్గాల కంటే విమాన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు కూడా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అయితే, అన్ని దేశాలలో కస్టమ్స్ నియమాలు ఒకేలా ఉండవు. కాబట్టి, ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వస్తువులను గమ్యస్థాన దేశానికి తీసుకెళ్లాలి, వేటిని తీసుకెళ్లకూడదో తెలుసుకోవడం ముఖ్యం. ఇటీవల, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దుబాయ్‌కి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త నియమాలను ప్రకటించింది. ఆ దేశ కస్టమ్స్ నిబంధనల ప్రకారం కొన్ని మార్పులు చేసింది. ఈ నియమాలు జూన్ 21, 2024న ప్రకటించి, జూన్ 22 నుండి అమలులోకి వచ్చాయి. ఇవి కేవలం దుబాయ్‌కి వెళ్లే వారికి మాత్రమే వర్తిస్తాయి.
దుబాయ్‌కి విమానాల్లో వెళ్లేవారు మందులు, ఇతర ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. కానీ, ఏ మందులను తీసుకెళ్లాలి, వేటిని తీసుకెళ్లకూడదో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా నియమాలలో స్పష్టం చేసింది. యూఏఈ, దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలలో కస్టమ్స్ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ మాదక ద్రవ్యాలపై పూర్తిగా నిషేధం ఉంది. ఎవరైనా మాదక ద్రవ్యాలు లేదా ఇతర మత్తు పదార్థాలను తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడితే, వారికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. నిషేధించిన వస్తువులు తీసుకెళ్తే అరెస్టు కూడా కావొచ్చు. అందుకే ప్రయాణికులు ఇలాంటి విషయాలపై తప్పనిసరిగా తెలుసుకోవాలి.
విమానంలో తీసుకెళ్లకూడని ముఖ్యమైన వస్తువులు:
దుబాయ్‌కి విమానంలో వెళ్లేవారు కొన్ని వస్తువులను పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. ఈ జాబితా చాలా ముఖ్యమైనది:
మాదక ద్రవ్యాలు: కొకైన్, హెరాయిన్, గసగసాలు, అలాగే మత్తు కలిగించే లేదా తలతిరిగే మందులు వంటివి అస్సలు తీసుకెళ్లకూడదు. ఇవి తీవ్రమైన నేరాలు.
పొగాకు, మూలికలు: తమలపాకులు, పాన్, కొన్ని రకాల మూలికలు కూడా అనుమతించరు.
అరుదైన జంతు ఉత్పత్తులు: ఖడ్గమృగం దంతాలు, కొమ్ములు వంటివి కూడా నిషేధించారు.
ఇతర నిషేధిత వస్తువులు: జూదం ఆడే పరికరాలు, మూడు పొరల ఫిషింగ్ వలలు, నిషేధించబడిన దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులు తీసుకెళ్లకూడదు.
ఆహారం, నకిలీ నోట్లు: నకిలీ బ్యాంక్ నోట్లు, ఇంట్లో తయారుచేసిన ఆహారం, మాంసం ఉత్పత్తులను దుబాయ్‌లోకి తీసుకురావడం నేరం.
కొత్తగా చేర్చినవి: ప్రింటెడ్ మెటీరియల్స్, పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్‌లు, కొన్ని రకాల పుస్తకాలు, రాతి శిల్పాలు కూడా కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయి.

అనుమతితో, డబ్బు కట్టి తీసుకెళ్లగల వస్తువులు
కొన్ని వస్తువులు దుబాయ్‌లోకి తీసుకెళ్లాలంటే, మీరు ముందుగానే అనుమతి తీసుకోవాలి. వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. ఈ జాబితాలో ఇవి ఉన్నాయి:
వ్యవసాయ వస్తువులు: మొక్కలు, ఎరువులు.
వైద్య సంబంధిత వస్తువులు: కొన్ని రకాల మందులు, వైద్య పరికరాలు.
వ్యక్తిగత వినియోగ వస్తువులు: పుస్తకాలు, సౌందర్య సాధనాలు, రేడియోలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
పానీయాలు: ఆల్కహాలిక్ పానీయాలు.
పొగాకు ఉత్పత్తులు: ఎలక్ట్రానిక్ సిగరెట్లు, హుక్కాలు. ఈ వస్తువులను దుబాయ్‌లోకి తీసుకురావాలంటే, మీరు తప్పకుండా ముందుగానే అనుమతులు పొందాలి మరియు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి.
దుబాయ్‌లో నిషేధించిన కొన్ని ప్రత్యేక మందులు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
దుబాయ్‌కి ప్రయాణించేవారు తమ క్యాబిన్ బ్యాగేజీలో లేదా చెక్డ్ బ్యాగేజీలో ఈ కింది మందులను అస్సలు తీసుకెళ్లకూడదు. ఈ మందులు చాలా కఠినమైన నిషేధం కిందకు వస్తాయి.. అవి బీటామెథోల్, ఆల్ఫా-మిథైల్ఫెనాంథైల్, మారిజువానా, కోడొక్సైమ్, ఫెంటానిల్, మెథడోన్, ఓపియం, ఆక్సికోడోన్, ట్రైమెపెరిడిన్, ఫెనోపెరిడిన్, కాథినోన్, కోడైన్, అంఫెటమిన్ ఈ మందుల పేర్లను ప్రయాణికులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాలి, లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
