Honeymoon Spots : కొత్తగా పెళ్లయిందా.. అయితే హైదరాబాద్‌కు దగ్గరలో బెస్ట్ హనీమూన్ స్పాట్స్ ఇవే
Honeymoon Spots : కొత్తగా పెళ్లయిన జంటలు తమ జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శించి, మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటారు. చాలామంది తమ హనీమూన్ కోసం ప్రదేశాలను వెతుకుతుంటారు. మీరు కూడా మీ పార్టనర్ తో కలిసి సరదాగా గడిపి, మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటే, హైదరాబాద్ సమీపంలోని ఈ ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి.
అనంతగిరి హిల్స్
హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అనంతగిరి కొండలు జంటలకు ఒక అద్భుతమైన ప్రదేశం. వీటిని తెలంగాణ ఊటీ అని పిలుస్తారు. దట్టమైన పచ్చని అడవులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు మీ పార్టనర్ తో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఇక్కడికి వెళ్లిన ప్రయాణం మీ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

వరంగల్
తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ ఒకప్పుడు కాకతీయ రాజవంశానికి రాజధాని. మూడవ శతాబ్దానికి చెందిన ఈ నగరం గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడి కోటలు, దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) వంటి ప్రదేశాలు జంటలను ఆకట్టుకుంటాయి. సాంస్కృతిక గొప్పతనం, ప్రశాంతమైన వాతావరణం కోసం వరంగల్‌ను తప్పక సందర్శించాలి.
శ్రీశైలం
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. మీరు మీ భాగస్వామితో కలిసి ఇక్కడ అనేక దేవాలయాలను సందర్శించవచ్చు. దట్టమైన పచ్చని అడవులు, కృష్ణా నదిలో బోటు ప్రయాణం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, చుట్టూ ఉన్న కొండలు మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ ఉండే పాతాళ గంగ, అక్క మహాదేవి గుహలు వంటి ప్రదేశాలు కూడా చూడదగినవి.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
నాగార్జున సాగర్
భారతదేశంలో ఉన్న అతిపెద్ద డ్యామ్‌లలో నాగార్జున సాగర్ ఒకటి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉన్న పచ్చని ప్రకృతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ బోటు రైడింగ్‌తో పాటు, నాగార్జున కొండపై ఉన్న బౌద్ధ మ్యూజియంను సందర్శించడం ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ జరిగే సౌండ్ అండ్ లైట్ షో జంటలకు చాలా నచ్చుతుంది.
బీదర్
బీదర్ కర్ణాటక రాష్ట్రంలోని చాలా అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇది కోటలు, సమాధులు, మొఘల్ కాలం నాటి చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఇక్కడి బీదర్ కోట చాలా ఆకట్టుకుంటుంది. ఫోటోలు తీసుకోవడానికి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం. కొత్తగా పెళ్లయిన జంటలు ఇక్కడ అద్భుతమైన ఫోటో షూట్లు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
హైదరాబాద్‌లోని ఇతర హనీమూన్ ప్రదేశాలు
- హుస్సేన్ సాగర్ లేక్: ఇక్కడ బోటింగ్ చేస్తూ, లేక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్లో నైట్ డ్రైవ్ చేయడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఇక్కడ క్రూయిజ్ డిన్నర్ కూడా లభిస్తుంది.
- రామోజీ ఫిల్మ్ సిటీ: మీరు ఇక్కడ సరదాగా, సినిమా ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ గడపవచ్చు. ఇది జంటలకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
- చౌమహల్లా ప్యాలెస్: ఈ ప్యాలెస్ రాయల్టీకి ప్రతీక. అందమైన తోటలు మరియు చారిత్రక కట్టడాల మధ్య నవ దంపతులు మంచి ఫోటోలు దిగవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.