Canadas Tallest Lord Ram Idol : కెనడాలో శ్రీ రామ చంద్రుడి భారీ విగ్రహం ఆవిష్కరణ
Canadas Tallest Lord Ram Idol : కేనడలోని ఓంటారియాలో శ్రీరామ చంద్రుడి భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. మిసిసోగా ప్రాంతంలోని హిందూ హెరిటేజ్ సెంటర్లో 51 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది నార్త్ అమెరికాలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం అవడం విశేషం.
విగ్రహం విశిష్టతలో
నార్త్ అమెరికాలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఉక్కు ఆధారంగా చేసుకుని ఫైబర్ గ్లాసుతో ఢిల్లీలో తయారు చేశారు. ఈ మహా విగ్రహం గంటకు 200 కీమీ వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకుని నిలబడగలదు.
ఢిల్లీలో తయారుచేసిన ఈ విగ్రహాన్ని కెనడాకు తీసుకు వచ్చి అక్కడ అసెంబిల్ చేశారు.
- ఇది కూడా చదవండి : తిరుమల (TTD) అప్డేట్స్ మిస్ అవుతున్నారా ? అయితే ఈ లింక్ క్లిక్ చేసి బుక్ మార్క్ చేసుకోండి.
భారీగా తరలివచ్చిన భక్తులు | Canadas Tallest Lord Ram Idol
ఇండో అమెరికన్ అయిన లాజ్ ప్రషర్ అనే వ్యక్తి సాయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నిర్మాణానికి సుమారు 4 ఏళ్ల సమయం పట్టింది. శ్రీరామ చంద్రుడి దర్శనం కోసం, భారీ విగ్రహ దర్శనం కోసం సుమారు 10,000 భక్తులు తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని హిందూ హెరిటేజ్ సెంటర్ అనే టీమ్ విజయవంతంగా నిర్వహించింది.
ఈ విగ్రహం ఎక్కడుంది ? | Where is the Biggest Lord Rama Statue In Canada Located ?
కెనెడాలోనే అత్యంత ఎత్తైన శ్రీరామ చంద్రుడి విగ్రహం అనేది టోరొంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. సిటీలోకి ఎంటరయ్యే యాత్రికులు సులభంగా శ్రీరాముడి దర్శనం చేసుకోవచ్చు.
Toronto, Canada:
— Ishwar Chandra (@Im_TheHindu) August 4, 2025
The 𝙩𝙖𝙡𝙡𝙚𝙨𝙩 idol of Lord Ram in North America has been inaugurated in Mississauga!🙏
51-feet tall idol, rising over 70 feet including the pedestal
🛕The Hindu Heritage Centre also plans to crown the idol with a grand ‘Chhatra’ soon.
𝙅𝙖𝙞 𝙎𝙝𝙧𝙞 𝙍𝙖𝙢 pic.twitter.com/Q5p190vNbj
ప్రపంచ ప్రయాణ విశేషాలు తెలుగులో చూసేందుకు రెగ్యులర్గా ప్రయాణికుడు వెబ్సైట్ను విజిట్ చేయండి.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
విదేశాల్లో జరిగే తెలుగు సంబరాలు, వేడుకల గురించి ప్రయాణికుడులో పోస్ట్ చేయాలి అనుకుంటే మెయిల్ చేయండి
kishoretelugutraveller@gmail.com
Feature Image Source : X/ishwar Chandra