చర్లపల్లి–తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ | Charlapalli Thiruvananthapuram train
Charlapalli Thiruvananthapuram train : భారతీయ రైల్వే తెలంగాణ–కేరళ మధ్య లాంగ్-డిస్టెన్స్ రైల్వే కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక కొత్త ట్రైన్ సర్వీసును ప్రకటించింది. చర్లపల్లి–తిరువనంతపురం నార్త్–చర్లపల్లి Amrit Bharat Weekly Express అనే ఈ ట్రైన్ 2026 జనవరి 23న ప్రారంభం కానుంది.
ట్రైన్ నెం.06308 : చర్లపల్లి అమృత్ భారత్ స్పెషల్
Train No. 06308 Thiruvananthapuram North – Charlapalli Amrit Bharat Special అనేది జనవరి 23వ తేదీన ఉదయం 10.45 నిమిషాలకు తిరువనంతపురం నార్త్ నుంచి బయల్దేరుతుంది.
- మరుసటి రోజు మధ్యాహ్నం 4.30 నిమిషాలకు చర్లపల్లి రీచ్ అవుతుంది.
- ఈ ట్రైను సర్వీసులతో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వీక్లీ సేవలు అధికారికంగా మొదలవుతాయి.
కీలక స్టేషన్లు | Major Stations on Route
ఈ ట్రైన్ కోల్లం, కాయంకులం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిశూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, కట్పాడి, రెణిగుంట, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మిర్యాలగూడ , నల్గొండ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
- ఈ రూట్ కేరళ, తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది.
- ఇది కూడా చదవండి : Amrit Bharat Express: తెలుగు ప్రయాణికులకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది ?
కోచుల ఏర్పాటు విధానం | Coach Composition
ఈ కొత్త ట్రైనులో మొత్తం 8 స్లీపర్ క్లాస్ కోచులరు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచులు, 1 పాంట్రీ కారు, 2 దివ్యాంగులకు అనుకూలంగా రూపొందించబడిన సెకండ్ క్లాస్ కోచులు ఉంటాయి. సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం ట్రైనులో పలు సదుపాయాలు కల్పించనున్నారు.
రైల్వే అధికారులు సూచిస్తున్నారని, రెగ్యులర్ సర్వీస్ కోసం Train No. 17041 / 17042 వివరాలను వేరుగా ప్రకటిస్తారు. యాత్రికులు రైల్వే అధికారిక అప్డేట్స్ ఫాలో అవుతూ ముందుగానే ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి అని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
Feature Image Credit : roadsandrailsorg
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
