భద్రాద్రి రామయ్య భక్తులకు డిజిటల్ అన్నదాన టోకెన్లు.. | Bhadrachalam Temple Annadanam Digital Tokens

షేర్ చేయండి

భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భక్తులకు డిజిటల్ టోకెన్లు ( Bhadrachalam Digital Tokens ) జారీ చేస్తున్నారు. గతంలో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులలో కొంత మందికి మాత్రమే అన్నదానం టికెట్లు అందేవి. అయితే ఇటీవల కాలంలో అన్నప్రసాదం స్వీకరించే భక్తుల కోసం డిజిటల్ టోకెన్లు అందించే విధానాన్ని ప్రారంభించారు.

డిజిటల్ టోకెన్ ప్రత్యేకతలు | Bhadrachalam Annadana Tokens


భక్తులకు అందించే డిజిటల్ టోకెన్లపై ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిపై భక్తుల ఫోటో కూడా ఉంటుంది. అన్నదాన సత్రం వద్ద ఈ టోకెన్ చూపించి భోజనం చేయవచ్చు.ప్రతీ రోజు 1500 నుంచి 2000 మంది వరకు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. మధ్యహ్నం 2 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది.

కొత్తగా వచ్చిన డిజిటల్ టోకెన్ల విధానం వల్ల అన్నదాన ( Bhadrachalam Annadanam ) ప్రక్రియ సమర్థత పెరుగుతుంది అని ఆలయ అధికారులు ఆశిస్తున్నారు. ఈ డిజిటల్ టోకెన్ విధానం వల్ల భక్తుడు భోజనం చేసిన సమయం, తేదీ వంటి వివరాలు కూడా ఆలయ రికార్డుల్లో ఉంటాయి. భద్రాచలం ఆలయంలో కొత్తగా అమలులోకి వచ్చిన ఈ విధానంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!