Dubai Visa : భారతీయుల కోసం వీసా రూల్స్ మార్చిన దుబాయ్… 3 కొత్త రూల్స్ ఇవే !

దుబాయ్ వెళ్లే భారతీయుల కోసం రూల్స్ మారాయి. ఈ రూల్స్ వల్ల మరింతమంది అర్హులైన భారతీయులు తమ దేశాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. కొత్త రూల్స్ (Dubai Visa Rules) ఎంటో తెలుసుకుందామా…

భారత్ దుబాయ్ మధ్య స్నేహ బంధం రోజురోజుకూ బలపడుతోంది. దీనికి నిదర్శనంగా భారతీయుల కోసం వీసా రూల్స్‌ అప్డేట్ చేసింది దుబాయ్.

ఈ కొత్త రూల్స్ వల్ల భారత్, యూఏఈ (United Arab Emirates) మధ్య పర్యాటకుల రాకపోకలు మరింతగా పెరగనున్నాయి.

దుబాయ్ కొత్త వీసా రూల్స్‌ | Dubai Visa New Rules

ఈ కొత్త రూల్స్ ప్రకారం భారతీయ పాస్‌పోర్టు ఉన్న వ్యక్తులు వీసా అప్లై చేయడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ప్రయాణికులు వీసా ఆన్ అరైవల్ ( visa on arrival) కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా 14 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. కావాలంటే మరో 14 రోజులు పొడగించుకోవచ్చు.

Read Also : UAE : యూఏఈలో చూడాల్సిన టాప్ 5 ప్రదేశాలు ఇవే

రెండో ఆప్షన్ విషయానికి వస్తే 60 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే నాన్ ఎక్స్‌టెండెబుల్ ( non extendable visa) అంటే పొడగించే అవకాశం లేని వీసా కోసం అప్లై చేయవచ్చు.

యూఏఈ రెగ్యులేషన్‌ను బట్టి వీసా అప్లికేషన్ చార్జీలను వసూలు చేయడం జరుగుతుంది.

ఈ కొత్త వీసా రూల్స్ మీకు వర్తించాలి అంటే మీ భారతీయ పాస్‌పోర్టు వ్యాలిడిటీ మరో 6 నెలలు మిగిలి ఉండాలి.

ఎన్నిసార్లు అయినా వెళ్లి రావచ్చు..

ఈ కొత్త రూల్స్‌తో పాటు దుబాయ్ మరో అవకాశం కూడా భారతీయులకు కల్పిస్తోంది. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న వారికి 5 సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ ( multiple entry) ఉన్న వీసాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొత్తానికి ఈ కొత్త రూల్స్ అనేవి భారత్, దుబాయ్ మధ్య దోస్తీని మరింతగా బలాన్ని చేకూర్చుతాయి.
దీంతో పాటు దుబాయ్ వెళ్లాలని భావిస్తున్న వారికి ఈ కొత్త రూల్స్ ఎంతో ప్రయోజనాన్ని కల్పించనున్నాయి.

దుబాయ్ వీసా ఆన్ అరైవల్ ఎలా అప్లై చేయాలి ?


What Is Dubai Visa- On- Arrival Process for Indians
| వీసా ఆన అరైవల్ అంటే మీరు ఆ దేశానికి వెళ్లి అక్కడే వీసా కోసం అప్లై చేయడం. దుబాయ్ ఇప్పుడు భారతీయులకు ఈ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ ఆన్ ఆరైవల్ వీసా ఎలా అప్లై చేయాలో స్టెప్‌బై స్టెప్ మీకోసం అందిస్తున్నాము.

dubai visa rules
ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ | Photo: Moin meine -Pixabay

దుబాయ్ ఆన్ అరైవల్ వీసా అప్లై చేసే విధానం

స్టెప్ 1 | ఇమ్మిగ్రేషన్ కేంద్రం

ముందుగా మీరు దుబాయ్ చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న మర్హబా సర్వీస్ సెంటర్ (Marhaba Service Center) వద్దకు చేరుకోండి. ఇక్కడి అధికారులు మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వమని కోరతారు.

మీరు అందించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించి పాస్‌పోర్ట్ స్కాన్ చేస్తారు.

Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

స్టెప్ 2 | వీసా పొందడం

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత వీసా ఫీజును మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మీరు అమెరికన్ డాలర్ రూపంలో లేదా ఏఈడీ (United Arab Emirate Dirham)
అంటే అరేబియాన్ దిర్హామ్ రూపంలో చెల్లించవచ్చు.
ఈ సమయంలో దుబాయ్ అధికారులు మీ బోర్డింగ్ పాస్, ఇతర డాక్యుమెంట్స్‌‌ ఫోటోలు తీసుకుంటారు. తరువాత మీకు వీసా అందిస్తారు.

స్టెప్ 3 | ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్

దుబాయ్ వీసా రావడానికి 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు సమయం పట్టవచ్చు.అంతకు మించిన సమయం కూడా పట్టవచ్చు. ఈ సమయం అనేది మీతో పాటు వీసా కోసం ఎంత మంది అప్లై చేశారో అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

సో దుబాయ్ కొత్త రూల్స్ అనేవి మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. దీంతో పాటు దుబాయ్ వెళ్లడానికి ఇష్టపడే వారికి ఈ కొత్త వీసా రూల్స్ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దుబాయ్ ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీకి అడ్డాలాంటిది.

వైవిధ్యమైన భౌగోళిక స్వరూపం, విశిష్టమైన చరిత్ర, వినూత్నమైన అక్కడి జీవన విధానం, బూర్జ్ ఖలీఫా లాంటి ఎన్నో ఆకర్షణీయమైన బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ దుబాయ్‌ను పాపులర్ ట్రావెల్ డెస్టినేషగా మార్చాయి.

ఈ కొత్త రూల్స్‌పై పోస్టు పెట్టాను. అది ఖచ్చితంగా చదవాల్సిందిగా కోరుతున్నాను. 
దుబాయ్ వెళ్లడం ఇంకా అంత ఈజీ కాాు

ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!