ఇక్కడ అందం ఉంది. ఆపద ఉంది. మంచు ఉంది. తేడాలొస్తే ముంచుతుంది. ప్రపంచానికి దూరంగా ఇక్కడ రాత్రి పూట సూర్యుడు ఉదయిస్తాడు. పగలు చీకటిగా ఉంటుంది. ఒక రకంగా రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఇదే. నరుడు సంచరించని అంటార్కిటికా ( Antarctica ) మంచు పలకలపై పెంగ్విన్ల రాజ్యం నడుస్తుంది.
అంటార్కిటికాలో మీరు వేడి నీళ్లు గాళ్లోకి వేస్తే అది మంచు గడ్డలా మారి కిందికి పడిపోతుంది. ప్రపంచంలోనే 70 శాతం మంచి నీరు అంటార్కిటికాలోనే ఉంది. మానవ జాతికి దూరంగా చల్లగా ఉన్న అంటార్కిటికా ఖండం ( Antarctica Continent) అనేది ఎన్నో అద్భుతాలకు నెలవు. ఈ ఖండం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పోస్టులో మీకోసం.
అతి శీతలం, అత్యందంగా ( ఇది పద ప్రయోగం: అతి+అందం ).. మొత్తానికి అంటార్కిటికా అంటే భౌగోళిక అద్భుతం.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
ఈ మంచు ప్రపంచం గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడి చేరుకోవడమే పెద్ద సాహస యాత్ర, ఇక్కడ నివసించడం అంతకన్నా పెద్ద సాహసం. అయినా ఇక్కడికి వెళ్లాలనే కోరిక కోట్లాది మందిలో ఉంటుంది . ప్రాక్టికల్‌గా ఇది సాధ్యం కాని విషయం. ఎందుకంటే అంటార్కిటికాకు వెళ్లాలంటే అంతర్జాతీయంగా ఎన్నో నియమాలు ఉన్నాయి.
ముఖ్యాంశాలు
1.ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి
The Largest Desert On Earth : మీకు ఇది విచిత్రంగా అనిపించవచ్చు కానీ అంటార్కిటికా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. వార్షికంగా ఇక్కడ అత్యల్పంగా 2 ఇంచులు ( 50 మిల్లీ మీటర్లు ) మాత్రమే వర్షాపాతం పడుతుంది. సైంటిఫిక్‌గా చెప్పాలి అంటే ఆకాశం నుంచి నేలపై ఏదోక రూపంలో నీరు నేలపైకి చేరడాన్ని ప్రిసిపిటేషన్ ( Precipitation in Antarctica ) అంటారు.
ఈ ప్రిసిపిటేషన్ శాతం అనేది ఇక్కడ చాలా తక్కువ. అందుకే దీన్ని ఎడారి అంటారు. నరుడు లేని ప్రాంతాన్ని కూడా ఎడారి అనే పిలుస్తారు. కానీ అది శాస్త్రీయంగా సరైన నిర్వచనం కాదు.
2. అతిపెద్ద మంచు పలక
Largest Ice Sheet On Earth : భూమిపై 71 శాతం నీరు ఉంది. లెక్కల్లో చెప్పాలి అంటే 332 మిలియన్ క్యూబిక్ మైల్స్ అని చెప్పవచ్చు. ఈ 71 శాతంలో 97.5 శాతం నీరు సముద్రాల్లోనే ఉంది. మిగితా 2.5 శాతం నీరు మంచు కొండల్లో, మంచు రూపంలో నిక్షిప్తంగా ఉంది. ఇందులోంచే కొంచెం కొంచెం మంచు కరిగి నీరు నదుల రూపంలో భూమిపైకి చేరుతాయి. మళ్లీ ఇవే నీరు సముద్రంలో కలుస్తాయి.
సో ఈ 2.5 శాతం మంచి నీటి నిల్వల్లో 70 శాతం నీరు అంటార్కిటికాలోనే ( Water On Antarctica ) ఉంది. ఇప్పుడు అర్థం అయిందా మనకు మంచి నీటి సమస్య ఎందుకు వస్తోందో. ఎందుకంటే అంటార్కిటికానే మొత్తం దాచుకుంది. జోక్స్ పక్కన పెడితే. అంటార్కిటికాలోని 98 శాతం విస్తరించిన మంచు పలకల్లో మంచి నీరు పుష్కలంగా ఉంది. ఈ నీరు ఘనీభవించిన మంచు రూపంలో భూమిలోపల 4 కిమీ మీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది.
3. జీవ వైవిధ్యం
Biodiversity In Antarctica : అంటార్కిటికా అనేది కర్కశమైన ఖండం. ఇక్కడ బతికడం అసాధ్యం….అని మనం అనుకుంటాం కానీ… ఇక్కడ పెంగ్విన్లు, సీల్స్, సముద్రపు పక్షులు, వేల్స్, సీలయన్స్ ( Sea Lions On Antarctica ) బాగానే బతికేస్తున్నాయి. బతకడం అంటే అట్టా ఇట్టా కాదు దేనికది రాజ్యం ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా బతికేస్తున్నాయి. ఇప్పుడే మనుషుల రాక మొదలైంది కదా చూడాలి వాటి భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి.
6.పెంగ్విన్ల రాజ్యం | Penguins On Antarctica
ఇక్కడ మనం పెంగ్విన్స్‌ను వేల సంఖ్యలో ఒకే చోట చూడవచ్చు. మీకు తెలుసా భూమిపై మొత్తం 18 రకాలపెంగ్విన్స్ ఉన్నాయి. వీటిలో ఎంపరర్ పెంగ్విన్ అని ఒకటి ఉంటుంది. ఇది చెప్పిందే శాసనం. వేసిందే ఆసనం అనుకోండి.
ఇది కూడా చదవండి: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
7. శాశ్వత నివాసాలు లేవు
No Permanent Residents on Antarctica : భూమిపై ప్రతీ ఖండంపై మనుషులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అంటార్కిటికాపై మాత్రం ఒక్కరు కూడా నివసించరు. అయితే ఇక్కడ పరిశోధన కోసం, మిషన్స్ కోసం కొంత మంది పరిమిత సమయం కోసం నివసిస్తుంటారు. వీరి సంఖ్య చలికాలం 1000 మంది మిగితా సమయాల్లో 5000 వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
8. ప్రపంచంలోనే చల్లని ప్రదేశం ఇక్కడే
Coldest Place On Earth : ప్రపంచంలోనే అత్యంత చల్లని నివాసిన ప్రదేశం వచ్చేసి సైబీరియాలోని ఓమ్యాకాన్ ( Oymyakon ). ఒమ్యాకాన్ గురించి నేను 15 ఆసక్తికరమైన విషయాలు నేను గతంలో పబ్లిష్ చేశాను. అయితే ఒమ్యాకాన్‌లో మనుషులు ఉంటారు. కానీ అంటార్కిటికాలో మనుషులు ఉండరు. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చల్లనైన ప్రదేశం ఉంది. 1983 జులై 21న ఈ ఖండంలోని వోస్టాక్ స్టేషన్‌లో ( Vostok Station ) మైనస్ -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
9. అర్థరాత్రి సూరీడు…మిట్టమధ్యాహ్నం చీకటి
Midnight Sun and Polar Nights : అంటార్కిటికాలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం కొన్ని వారాల వరకు సూర్యుడు అస్తమించడు. సో రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఇదేనేమో. దాంతో ఇక్కడ 24 గంటల పాటు పగలే ఉంటుంది. చలికాలం వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొన్ని రోజుల పాటు సూర్యుడు అసలు ఉదయించడు. మొత్తం రాత్రే ఉంటుంది ఆ సమయంలో.
10. అగ్ని పర్వతాశ్రమం
Active Volcanoes On Antarctica: నమ్మశక్యం కాదు కాని అంటార్కిటికాపై కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మౌంట్ ఎర్బెస్ ( Mount Erebus ) అనే అగ్నిపర్వతం వద్ద ఒక సరస్సు ఉంటుంది. అది మామూలు సరస్సు కాదు. 100 శాతం ప్యూర్ లావాతో ( Lake Full Of Lava ) నిండి ఉన్న సరస్సు. ప్రపంచంలోనే ఇలాంటి సరస్సు మరొకటి లేదు. దూర దూరం వరకు విస్తరించి ఉన్న మంచు మధ్యలో లావా…సూపర్ కాంబినేషన్ కదా.
ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
11. అంటార్కిటికా : ఒక మంచు ఆర్టిస్టు
అంటార్కిటికాలో మంచి ఆర్టిస్టు ఉన్నాడు. సారీ మంచు ( Ice Arts Of Antarctica ) ఆర్టిస్టు ఉన్నాడు. ఎందుకంటే ఇది మంచుతో గ్లేషియర్స్ , ఐస్ బర్గ్స్ అని, ఐస్ షెల్వ్స్ అని రకరకాల డిజైన్లు క్రియేట్ చేస్తుంది. అందుకే ఒక ఫోటోకు మరో ఫోటోకు, ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి అసలు పోలికే ఉండదు. మంచు కొండలు లేదా ఐస్ బర్గ్స్ కరిగి సముద్రపు నీటిలో పడుతుంటాయి. అందులో కొన్ని తేలుతూ ఆర్కిటిక్ సర్కిల్ నుంచి బయటికి కూడా వెళ్తుంటాయి.
12 . ఐస్ బర్గ్ | Ice Berg
ఐస్ బర్గ్ పై నుంచి చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ అందులో ఎక్కువ శాతం నీటిలోనే మునిగి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే పీకల్లోతుగా నీటిలో ఉన్నప్పుడు మన తల మాత్రమే బయటికి కనిపిస్తుంది చూడండి దాన్ని బర్గ్ టాప్ ( Berg Top ) అంటారు. చాలా మంది దీనిని ఐస్ బర్గ్ టిప్ ( Tip Of the Iceberg ) అని కూడా అంటాం . బయట కనిపించని నీటిలో ఉన్న భాగం ఉంటుంది చూడండి దాన్ని బర్గ్ బేస్ ( Berg Base ) లేదా కీల్ ( Keel ) అని అంటారు.
13.అంటార్కిటికా ట్రీటీ | The Antarctica Treaty
అంటార్కిటికాకు సంబంధించిన వివిధ దేశాల మధ్య 1961 లో ఒక ఒప్పందం జరిగింది. ఈ ట్రీటీ ప్రకారం వివిధ దేశాలు అంటార్కిటికాలో కేవలం పరిశోధన కోసం మాత్రమే తమ ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా ఇక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు ( Continent Without Army ) జరపబోమని కూడా అన్ని దేశాలు అంగీకరించాయి.
ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
14.అంటార్కిటికా అన్వేషణ
Exploration in Antarctica : 20 వ శతాబ్దంలో సాహసప్రియులకు అంటార్కిటికా ఒక ఛాలెంజ్‌లా అనిపించేది. ఇక్కడే ఎర్నెస్ట్ షాకిల్టోన్, రాబర్ట్ ఫాల్కోన్ స్కాట్ వంటి వారు అంటార్కిటికా చేరుకుని సాహసానికి సరికొత్తగా నిర్వచనం అందించారు.
15. తారా వీక్షణానికి అనువైన చోటు
అంటార్కిటికా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. తారలు చూడాలి అనుకునే వారికి తారా మండలాన్ని చూపిస్తుంది. నక్షాత్రాలను చూసేందుకు అనువైన ప్రదేశాలు ( Star Gazing ) ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే అంటార్కిటికా నుంచి నక్షత్రాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ కాలుష్యం లేదు. దాంతో పాటు గాలిలో తేమ శాతం చాలా తక్కువ. పొడి వాతావరణం ఉంటుంది. దీంతో ఇక్కడ సథర్న్ లైట్స్ ( Aurora Australis ) కూడా చూడవచ్చు. తారామండలాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు.
ముగింపు
అంటార్కిటికా అనేది ఎంత అద్భుతమో అంతే రహస్యమయం. అందుకే ఇక్కడికి వెళ్లాలని ప్రతీ ప్రయాణికుడు ( Prayanikudu ) కోరుకుంటాడు. ఇక్కడి ఐస్ బర్గ్ లేదా పెంగ్విన్ల కోసం అయినా… కారణం ఏది అయినా అంటార్కిటికా ప్రయాణం ( Travel ) అనేది ఇతర ప్రయాణాలకన్నా వినూత్నమైనది. మరి అంటార్కికా మంచు ప్రపంచానికి మీరెప్పుడు వెళ్తున్నారు ?
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
Telugu Travel Vlogs : ప్రయాణికుడు ట్రావెల్ వ్లాగ్స్ కోసం క్లిక్ చేయండి.