మమ్మీల రాజ్యం , పిరమిడ్ల దేశం ఈజిప్టు ట్రావెల్ గైడ్ | Egypt Travel Guide | 15 Facts

ఈజిప్ట్ అనేది వేలాది సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోన్న దేశం. కాలంతో పనిలేని కాలాతీతమైన దేశం ఇది. ఈ ప్రాచీన నగరం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. ఈ స్టోరిలో ఈజిప్టు ఎలా వెళ్లాలో… ఏం చూడాలో ? ఎక్కడ ఉండాలో ? ఏం తినాలో ? ఎలాంటి పనులు చేయకూడదో మరెన్నో విషయాలతో ఈజిప్టులోని మరో కోణాన్ని ( Egypt Travel Guide )  మీ ముందు ఆవిష్కరించనున్నాను.

ఈజిప్టు గురించి ఇప్పుడు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఎడారి దేశం అయిన ఈజిప్ట్ వెళ్లడానికి వింటర్ కన్నా బెస్ట్ సీజన్ మరొకటి లేదు. అందుకే ఇప్పుడు ఇది అవసరమే. ఈజిప్టు అంటే మనకు పిరమిడ్స్, మమ్మీలు( Egypt Mummies ) అక్కడి కల్చర్, మ్యూజిక్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈజిప్టులో అంతకు మించినవి చాలా ఉన్నాయి. ముందుగా ఈజీప్టు ఎక్కడుంది అనే చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం.

ఈజిప్ట్ ఎక్కడుంది ? | Where Is Egypt
Where is Egypt
ఈజిప్టు దేశం

ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగంలోంది ఉంది ఈజిప్టు. ఈదేశానికి ఉత్తరం వైపు మధ్యధార సముద్రం ( Mediterranean Sea ), తూర్పున ఎర్ర సముద్రం ( Red Sea ), పశ్చిమాన లిబ్యా దేశం, దక్షిణాన సుడాన్ ఉంది, ఈశాన్య భాగంలో గాజా పట్టి ( Gaza Strip ) ఉంది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ఈజిప్టు గురించి ఆసక్తికరమైన విషయాలు | Basic Facts About Egypt

  • రాజధాని : కైరో
  • అధికారిక భాష  : అరబిక్
  • జనాభా  : 104 మిలియన్లు ( 2023 గణాంకాల ప్రకారం )
  • విస్తీర్ణం : 1,001,450 స్క్వేర్ కి.మీ.
  • కరెన్సీ  : ఈజిప్షియన్ పౌండ్
  • అతి పెద్ద మతం  : ఇస్లాం

భౌగోళిక స్వరూపం :  ఇది ఒక ఎడారి దేశం, నైలు నది దేశం గుండా ప్రవాహిస్తుంది. ఇదే ఇక్కడి వ్యయసాయానికి, జీవనానికి ఆధారం

చారిత్రాత్మక ప్రాధాన్యత : ఈజిప్టు నాగరికత అనేది ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలో ఒకటి. ఇక్కడే పిరమిడ్స్ వంటి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ : వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు, సూయజ్ కాలువ ఫీజులు ( Suez Canal ) వంటి వాటిపై ఈ దేశం ఆధారపడి ఉంది.

ఈజిప్టు చరిత్ర చాలా ఘనమైనది. అరబ్ ప్రాంతాల్లో ( Arab Countries ) ఈ దేశం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి చారిత్రాత్మక దేశానికి ఎప్పుడు వెళ్లాలో చూద్దామా? 

ఈజిప్టు ఎప్పుడు వెళ్లాలి ? | When To Go To Egypt

ఈజిప్టు ఎడారి దేశం కాబట్టి అక్కడి వెళ్లడానికి బెస్ట్ టైమ్ ( Best Time To Visit Egypt ) చలికాలమే అని చెప్పాలి. స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెలలు. ఈ సమయంలో వాతావరణం బాగుంటుంది. దాంతో మీరు ప్రశాంతంగా వివిధ ప్రాంతాలను, పురాతన నిర్మాణాలను, అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు నా అన్వేషణలో అన్వేష్‌లా ( Naa Anveshana ). 

ఒక వేళ మీరు ఈజిప్టు విజిట్ ( Egypt Visit ) చేయాలని భావిస్తోంటే అక్టోబర్, నవంబర్ లేదా మార్చి ఎప్రిల్ సమయాల్లో ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రరిలో వెళ్తే రద్దీతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

ఎలా వెళ్లాలి ? | How To Reach Egypt From Hyderabad ?

మీరు హైదరాబాద్ నుంచి ఈజిప్టు వెళ్లాలి అనుకుంటే డైరక్టు ఫ్లైట్స్ కోసం వెతికేయకండి. ఈ పోస్ట్ పబ్లిష్ చేసే సమయానికి అయితే డైరక్ట్ ఫ్లైట్స్ ( Hyderabad To Egypt Direct Flights ) లేవు. ఒకటి లేదా విమానాలు మార్చాల్సి ఉంటుంది. మీరు దోహా ( Doha ), దుబాయ్, అబు ధాబి నుంచి ఖతార్ దారిలో ఈజిప్ట్ రాజధాని కైరోకు చేరుకోవచ్చు. సాధారణంగా ఖతార్ ఎయిర్వేస్ , ఎమిరేట్స్, ఎతిహా్ ఎయిర్‌వేస్‌ ఈ సర్వీసును అందిస్తాయి.

మీరు ఖచ్చితమైన సమాచారం వెతుకుతోంటే మాత్రం వివిధ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్స్ లేదా ఫ్లైట్ కంపారిజన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు. మంచి డీల్స్ దొరకాలంటే మాత్రం మీరు టికెట్స్ అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే బెటర్.

ఇక టికెట్ ధర విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి కువైట్ ఫ్లైట్ వివరాలు చెబుతున్నాను. మిగితావి మీరు కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. కైరో వెళ్లడానికి మీరు ముందు హైదరాబాద్ నుంచి కువైట్ ( Kuwait ) వెళ్లాల్సి ఉంటుంది. ఇది సుమారు 12 గంటల ప్రయాణం. కువైట్‌లో ఒక 4 గంటల వరకు వెయిట్ చేసి కైరో విమానం క్యాచ్ చేయాల్సి ఉంటుంది.

ఈ జర్నీ 3 గంటలు ఉంటుంది. మొత్తానికి కైరో వెళ్లడానికి మీరు సుమారు 20 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. వన్వే టికెట్ తక్కువలో తక్కువగా రూ.23,000 వేల వరకు పడుతుంది. టూ వే టికెట్ అయితే కనీసం రూ.55,000 వరకు పడుతుంది. 

గమనిక : ఈ ధరల్లో సమయాన్ని బట్టి సీజన్ను హెచ్చు తగ్గులు ఉండవచ్చు. 

ఈజిప్టులో చూడాల్సిన ప్రదేశాలు | Places To Visit In Egypt

ఈజిప్టు ఎడారి దేశం అయినా ఇక్కడ పర్యాటకుల కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వేలాది సంవత్సరాల నాగరికతకు ఆలవాలం అయిన ఈ దేశంలో మీరు అనేక ప్రదేశాలను విజిట్ చేయవచ్చు.

1.కైరో | Cairo 

ఈజిప్టు రాజధాని కైరో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తాం కదా అలా ఉంటుంది. కైరో వెళ్తే మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే.

Pyramids of Giza
గీజాలోని పిరమిడ్స్

A ) గీజా పిరమిడ్స్ | The Pyramids Of Giza : ఈజిప్టు వెళ్లేది పిరమిడ్స్ చూసేందుకే అంటే తప్పుకాదు. ఈ పిరమిడ్స్ తప్పా చాలా మందికి ఈజిప్టు గురించి ఏమీ తెలియదు. అందుకే డైరక్టుగా ఫస్ట్ పిరమిడ్స్ చూసేస్తే అదే శాటిస్ఫాక్షన్. ఇక్కడ ది గ్రేట్ పిరమిడ్ , మనిషి తలతో ఉన్న ఒక రహస్య జీవి ప్రతిమ “ ది స్పింక్స్ “  (Sphinx ) ను మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇక్కడికి మీరు గుర్రం లేదా ఒంటెపై వెళ్లవచ్చు.

B ) ఈజిప్టు పురావస్తుశాల | Egyptian Museum

మీలో చాలా మంది ది మమ్మీ ( The Mummy Movie )  సినిమా చూసే ఉంటారు. ఇందులో ఈజిప్టుకు సంబంధించిన అతి పురాతనమైన వస్తువులను మీరు ఎన్నో చూసి ఉంటారు. అంతకు మించిన వస్తువులను, నాటి రాజు టుటన్‌ఖామున్( King Tutankhamun ) నిధిని కూడా చూడవచ్చు. మీతో పాటు ఒక గైడు ఉంటే మీకు అన్ని విషయాలు క్లియర్‌గా అర్థం అవుతాయి.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

2.లగ్జర్  | Luxor 

ఈజిప్టులో కైరో తరువాత చాలా మంది వెళ్లేది లగ్జర్ అనే ప్రాంతానికే. ఈ ప్రాంతం ఒక ఊహా ప్రపంచం ఉడిపడిన ముక్కలా ఉంటుంది. 

valley of kings
ఈజిప్టులోని వ్యాలీ ఆఫ్ కింగ్స్

A ) వ్యాలి ఆఫ్ కింగ్స్ |  Valley Of The Kings & Queens

కైరోలో ఇతర ప్రాంతాల్లో పిరమిడ్స్‌ ఆకారంలో సమాధులు కట్టారు అక్కడి రాజులు. ఈ రాజులను పైరోస్  ( Pharaohs ) అని కూడా అంటారు. పిరమిడ్స్ కట్టి డబ్బులు వేస్ట్ చేయడం మంచిది కాదనో లేదా సమాధులు కొత్త డిజైన్ కావాలనో… కారణం ఏదైనా కొత్త ఈజిప్టు నిర్మాణ సమయంలో  కొండలను తవ్వి సమాధులు నిర్మిండటం మొదలు పెట్టారు.

ఈ సమాధులు లగ్జర్ అనే ప్రాంతంలో ఉన్న వ్యాలీ ఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్ లో ఉన్నాయి. మీరు ఇక్కిడికి వెళ్తే టుటన్‌ఖామున్ ( Tomb Of Tutankhamun ) సమాధిని తప్పకుండా చూడండి. ఇంకో విషయం ఇక్కడ కొన్ని సమాధులను చూసేందుకు భారీగా ఎంట్రెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

B) కర్నాక్ టెంపుల్ | Karnak : ఇది ఈజిప్టులోనే అది పెద్ద ఆలయం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక కేంద్రాలలో ఇది కూడా ఒకటి. భారీ పిల్లర్స్‌తో, గోడలతో విశాలంగా ఉంటుంది ఈ ఆలయం. ప్రతీ గోడకు, నిర్మాణానికి ఒక కథ ఉంటుంది. పరోస్‌ విజయగాథలు, కోర్టు హాల్లు, విజయానికి ప్రతీకగా నిలిచే ఏకశిలా స్థూపాలు ఇలా చాలా ఉంటాయి.

3. ఆస్వాన్ |  Aswan 

కొత్త ఈజిప్టు సమయంలో అక్కడి రాజులు చేపట్టిన నిర్మాణాలు ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే అందులో కొన్ని నిర్మాణాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి.

Philae Temple Egypt
ఇసీస్ అనే దేవతకు కట్టిన ఫిలే అనే ఆలయం

A) ఫిలే ఆలయం | Philae Temple : ఇసిస్ ( goddess Isis ) అనే దేవతకు ఇక్కడ ఒక ఆలయం ఉంది. ఆలయం నుంచి నైలు నదిని ( Nile River ) చూసినా, నైలు నది నుంచి ఈ ఆలయం చూసినా ఆ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు.

B) నుబియన్ గ్రామం | Nubian Village : ఈజిప్టులోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇసుక రంగు భవనాలు, ఇసుక రంగు ఆలయాలు, నిర్మాణాలు చూసి బోర్ కొట్టేస్తుంది. అందుకే చాలా మంది నుబియాన్ గ్రామానికి వెళ్తారు. ఇక్కడ ఈజిప్టులోని రంగులన్నీ కనిపిస్తాయి. రంగు రంగుల నివాసాలు, అద్భుతమైన ఆతిథ్యం, ఒంటెపై సవారి, ఇలా నుబియాన్ గ్రామానికి వెళ్తే మీరు డిసపాయింట్ అవ్వరు.

ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!

 4. షర్మ్ ఎల్- షేక్ | Sharm El-  Sheikh

ఈజిప్టు వెళ్లిన వారిలో చాలా మంది ఇక్కడే రిలాక్స్ అవుతుంటారు. ఇక్కడి బీచులో రిసార్టులు, రెస్టారెంట్స్‌లో ప్రశాంతంగా సమయం గడపవచ్చు. షర్మ్ ఎల్ షేక్‌లో మీరు స్నార్కిలింగ్, డైవింగ్ కూడా చేయవచ్చు

Sharm El-  Sheikh
ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ వద్ద సముద్రపు నీరు
5.ఖాన్ ఎల్ ఖలీలీ బజార్ | Khan El Khalili Bazaar

ఇది ఈజిప్టులోనే ఫేమస్ మార్కెట్. కైరోలో ఉంటుంది. 14 వ శతాబ్దంలో మొదలైన ఈ మార్కెట్ వైభవం నేటికీ తగ్గలేదు. ఇక్కడ మీరు బంగారం, మసాలా దినుసులు, యాంటిక్స్ లాంటివి ఎన్నో కొనొచ్చు. ఇక్కడ ఈజిప్టు కల్చర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్తే బేరం చేయడం నేరం కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా ధరలు మామూలుగా ఉండవు.

Prayanikudu WhatsApp2
వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి ( 100 శాతం సేఫ్ )

ఈజిప్టులో ఏం తినాలి | Food To Eat In Egypt

ఈజిప్టు వెళ్తే అక్కడి ఫుడ్ తప్పుకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు మీ ప్లేటు వైభవాన్ని పెంచుతాయి. మరీ ఇష్టపడి తింటే మీ బొజ్జను కూడా పెంచుతాయి.

Food To Eat In Egypt for Tourists
కాజాను పోలి ఉండే బక్లావా అనే స్వీట్

కోషారి | Koshari : ఇది అన్నం, ఆకుకూరలు, పాస్తా, శనగలతో చేసే ఒక కంప్లీట్ డిష్. దీన్ని స్పైసీ టమాటో, ఫ్రైడ్ ఉల్లిపాయలతో వడ్డిస్తారు. ఇది చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్.

ఫుల్ మడేమ్స్ | Ful Medames :  ఫావా బీన్స్ అనే ఒక రకం విత్తనాలతో చేసే వంటకం ఇది. దీనిని అల్లం, నిమ్మకాయ, ఆలీవ్ నూనెతో సర్వ్ చేస్తారు. చాలా మంది దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు.

మోలోఖియా | Molokhia : జనపనార ఆకులతో తయారు చేసే గ్రీన్ సూప్ ఇది. దీనిని చికెన్ లేదా ఇతర మాంస పదార్థాలు, అన్నంతో వడ్డిస్తారు.

బక్లావా | Baklava : పర్షియన్, అరేబియన్ దేశాల్లో ఎక్కువగా కనిపించే వంటకం ఇది. ఇది మన కాజా లాగే ఉంటుంది. కానీ మధ్యలో లేయర్స్ ఉంటాయి కదా అక్కడ వీళ్లు డ్రైఫ్రూట్స్, ఇతర పదార్థాలతో స్టఫింగ్ చేస్తారు. 

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

ఈజిప్టు కల్చర్ గురించి | Culture Of Egypt

ఏ దేశం వెళ్లినా అక్కడి సంప్రదాయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈజిప్టు వెళ్లాలి అనుకున్నా…లేదా అక్కడి కల్చర్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఈ పాయింట్స్ చదవండి.

భాష | Egypt Language : ఈజిప్టు అధికారిక భాష వచ్చేసి అరబిక్ . ఈజిప్టులోని కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు. అయితే అది మనకు కొన్ని సార్లు అర్థం అవ్వకపోవచ్చు. అందుకే మీరు కూడా కొన్ని అరబిక్ పదాలు నేర్చుకోండి.

వస్త్రధారణ | Dress Code In Egypt : ఈజిప్టు ఒక ముస్లీం దేశం. అందుకే ఇక్కడ హుందాగా ఉండేలా దుస్తువులు ధరించండి. అక్కడి పవిత్ర స్థలాలను సందర్శించే ముందు ఖచ్చితంగా హుందాగా కనిపించండి. 

ఈజిప్టులో చేయకూడని పనులు | Things not To Do In Egypt

మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పొరపాటున కూడా మనం ఎవరినీ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అది కూడా పరాయి దేశంలో అస్సలు ఎవరినీ ఇబ్బంది పెట్టరాదు.

Egypt Market in Cairo

కల్చర్‌ను గౌరవించండి : ఈజిప్టు వెళ్తే అక్కి సంప్రదాయాలను, ఆచారాలను గౌరవించండి. మరీ ముఖ్యంగా పవిత్ర స్థలాలకు వెళ్లినప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి.

ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

ఫోటోలు : మిలటరీ స్థావరాలు, లేదా మిలటరీ అధికారులు, మహిళల ఫోటోలు తీయకండి. తేడాలొస్తే మీరు లీగల్ సమస్యల్లో పడవచ్చు. ఎవరి ఫోటో అయినా తీయాల్సి వస్తే వారి నుంచి అనుమతి తీసుకోండి.

బేరం | Bargaining in Egypt : బేరం నేరం కాదు అని ఇంతకు ముందు చెప్పాను. మరో విషయం కూడా చెబుతాను చదవండి. మరీ గింజుకునేటట్టు బేరం చేయకండి. గొడవలు పడేట్టు బేరం చేయకండి. మనం టూరిస్టులుగా వెళ్తున్నాం రుపాయి ఎక్కువో తక్కువో నచ్చితే కొనాలి లేదంటే వదిలేయాలి. అంతే కాని 10 పౌండ్స్ చెబితే 10 పౌండ్స్‌కు ఇవ్వమనేలా బేరం చేయకండి.

మొత్తానికి 

తెలుగు రాష్ట్రాల నుంచి ఈజిప్టు వెళ్లడం అనేది సాధారణ ట్రిప్ కాదు. ఈ ప్రయాణంలో మీరు చరిత్ర, సంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు, భోజన విధానం మరెన్నో విషయాలు తెలుసుకుంటారు. అయితే మంచి సీజన్‌లో ఈజిప్టు ట్రిప్ ప్లాన్ ( Egypt Travel Plan ) చేయండి. ఎట్టిపరిస్థితుల్లో ఎండాకాలం వెళ్లకండి. 

వెళ్లే ముందు బ్రష్షులు, బట్టలు, కొన్ని అరబిక్ పదాలు, మాటలు, వీలైతే పాటలతో సిద్ధం అవ్వండి. ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. వీలైతే మీ జర్నీ విషేషాలు ప్రయాణికుడితో షేర్ చేసుకోండి.

నా మెయిల్ ఐడీ : kishoretelugutraveller@gmail.com

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!