రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో, రద్దీని నిర్వహించే విషయంపై భారతీయ రైల్వే (indian Railways) ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఉత్పాదకత పరంగా అదరగొట్టింది.
ముఖ్యాంశాలు
గత సంవత్సరం 6,541 కోచెస్ (బోగీలు) లను ప్రొడ్యూస్ చేయగా ఈ సారి 9 శాతం అధిక ఉత్పత్తిని సాధిస్తూ 7,134 కోచులను ఉత్పత్తి చేసింది. ఇందులో 4,601 ఏసీ బోగీలు ఉన్నాయి. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పిండానికి, మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే శాఖ ఏ విధంగా అంకిత భావంతో పని చేస్తోందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
వివిధ కోచ్ ఫ్యాక్టరీల్లో … | Indian Railways

- ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) : 3,007 కోచులను ఉత్పత్తి చేశారు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (RCF) : 2,102 కోచులను తయారు చేశారు
- మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ (MCF) : 2,025 కోచులను డిలివరీ చేశారు
నాన్ ఏసీ కోచులపై ఫోకస్

చాలా కాలం నుంచి భారతీయ రైల్వేలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో నాన్ ఏసీ కోచుల (Non AC Coaches) తయారీపై ఫోకస్ పెట్టింది రైల్వే శాఖ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి సంఖ్యను పెంచారు.
మేక్ ఇన్ ఇండియా ప్రభావం | Make In India

రైల్వే కోచుల ఉత్పత్తిలో భారతీయ రైల్వే అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తోంది. 2004-14 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం సగటున 3,300 యూనిట్లను ఉత్పత్తి చేయగా. 2014-2024 సంవత్సరాల్లో ఈ సగటు వచ్చేసి 5,481కి పెరిగింది. గత పది సంవత్సరాల్లో మొత్తం 54,809 బోగీలను ఉత్పత్తి చేశారు. భారత ప్రభుత్వ (Govt Of India) మేక్ ఇండియా కార్యక్రమం వల్లే ఈ సంఖ్య భారీగా పెరిగింది.
10 వేల ఏసీ కోచులు
ప్రయాణికుల (Travelers) నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో కోచులను ఉత్పత్తి చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా రానున్న రెండేళ్లలో 10,000 నాన్ ఏసీ కోచెస్ తయారు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.