Visa Sale : నమ్మశక్యం కాని ఆఫర్.. భారతదేశంలోనే తొలిసారిగా రూపాయికే వీసా.. ఏకంగా 15కు పైగా దేశాలు తిరగొచ్చు
Visa Sale : భారతదేశ ట్రావెల్ టెక్ రంగంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. సాధారణంగా వీసా తీసుకోవాలంటే పెద్ద తలనొప్పి, ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ఇప్పుడు అట్లాస్ అనే కంపెనీ ఒక సంచలనానికి తెరలేపింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రూపాయి వీసా సేల్‌ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే యూఏఈ, యూకే, వియత్నాం వంటి 15కు పైగా దేశాలకు వీసాలు పొందవచ్చు. రెండు రోజుల పాటు జరిగే ఈ సేల్ విదేశీ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
బెంగళూరుకు చెందిన అట్లాస్ ప్లాట్‌ఫారమ్ ‘అట్లాస్ వన్ వే అవుట్’ పేరుతో రెండు రోజుల సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ద్వారా భారతీయ ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వీసాల కోసం కేవలం రూపాయికే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేల్ ఆగస్టు 4, 5 తేదీలలో అట్లాస్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతార్, కెన్యా, తైవాన్ వంటి దేశాలకు వీసాలు కేవలం ఒక్క రూపాయికి లభిస్తాయి. ఇక యూఎస్, షెంజెన్ ప్రాంతంలోని కొన్ని దేశాలకు ఫిజికల్ అపాయింట్మెంట్లు తప్పనిసరి. అలాంటి దేశాలకు వీసా అపాయింట్మెంట్ల బుకింగ్‌లు కూడా రూపాయికే అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
అట్లాస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహక్ నహ్తా ప్రకారం.. వీసా దరఖాస్తులకు అయ్యే అధిక ఖర్చుల సమస్యకు ఇది ఒక వ్యూహాత్మక పరిష్కారం. 2024 యూరోపియన్ కమిషన్ నివేదిక ప్రకారం.. గతేడాది ఒక్కదానికే భారతీయ ప్రయాణికులు తిరిగి చెల్లించబడని వీసా ఫీజుల రూపంలో రూ.664 కోట్లకు పైగా నష్టపోయారు. విద్యార్థులు, సోలో ట్రావెలర్స్, కుటుంబాలు ఇలా అందరూ ఈ ఖర్చును భరించాల్సి వస్తుంది. ఒకవేళ వీసా నిరాకరించబడితే వారికి డబ్బు తిరిగి రాదు.
గత రెండు నెలల్లో వియత్నాం, ఇండోనేషియా, జార్జియా, యూకే వంటి దేశాలకు యూజర్ల ఆసక్తి బాగా పెరిగింది. మునుపటి కాలంతో పోలిస్తే ఈ దేశాలకు సెర్చ్ వాల్యూమ్‌లు 44% వరకు పెరిగాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణం యంగ్ ట్రావెలర్స్. టైర్ 1, టైర్ 2 నగరాల నుండి వచ్చిన మొదటిసారి పాస్‌పోర్ట్ పొందిన వారు, ముఖ్యంగా జనరేషన్ Z, యువ మిలీనియల్స్ ఈ ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. అట్లాస్ ఈ సేల్ సమయంలో యూఏఈ, యూకేలకు భారీ ఆసక్తిని అంచనా వేస్తోంది. ఈ దేశాలు భారతీయ ప్రయాణికులలో చాలాకాలంగా ప్రాచుర్యం పొందాయి.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
వాటి వీసా ప్రక్రియలు కూడా సాపేక్షంగా సులభం. అయితే, అట్లాస్ లక్ష్యం కేవలం బుకింగ్‌లను పెంచడం మాత్రమే కాదు. ట్రావెల్ ప్లానింగులో భాగంగా సాధారణంగా చాలా కష్టమైన భాగాన్ని ఈజీగా మార్చడం. ఫ్లైట్ ఫ్లాష్ సేల్స్ విమాన ప్రయాణంలో విప్లవం సృష్టించినట్లే.. రూపాయి వీసా మోడల్ కూడా విదేశీ పర్యాటక రంగంలో అదే మార్పును తీసుకురాగలదని అట్లాస్ నమ్ముతోంది. 2021లో ప్రారంభించిన అట్లాస్, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ల కంటే ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేసింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.