IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

షేర్ చేయండి

IRCTC Tour Package : సింగపూర్ ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, పార్కులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అందుకే చాలామంది అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు. అయితే, ఖర్చులు, ప్రయాణం గురించి ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక అదిరిపోయే ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో మీరు సింగపూర్, మలేషియా లాంటి దేశాలను ఒకే ట్రిప్‌లో చుట్టేయొచ్చు. అదీ తక్కువ ధరకే. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు ప్రయాణం? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC టూరిజం మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్ అనే పేరుతో ఈ ప్యాకేజీని నడుపుతోంది. ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ హైదరాబాద్‌ నుండి విమాన ప్రయాణం ద్వారా జరుగుతుంది. ముందుగా బుక్ చేసుకున్న 34 మందికి మాత్రమే ఈ టూర్‌లో అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మీరు మలేషియా, సింగపూర్‌లోని చాలా ప్రదేశాలను చూడొచ్చు. ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 11, 2025 న అందుబాటులో ఉంది.

10 Countries Offering E-Visa for Indian Travelers

టూర్ షెడ్యూల్:
మొదటి రోజు (Day 1): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. లాంఛనాలు పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు విమాన ప్రయాణం మొదలవుతుంది.

రెండో రోజు (Day 2): ఉదయం 10 గంటలకు మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి, చెక్-ఇన్ చేసి ఫ్రెషప్ అవుతారు. భోజనం తర్వాత, స్థానికంగా కింగ్స్ ప్యాలెస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మాన్యుమెంట్, పెట్రోనాస్ ట్విన్ టవర్, చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసి కౌలాలంపూర్‌లో బస చేస్తారు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

మూడో రోజు (Day 3): అల్పాహారం తర్వాత బటు గుహలను సందర్శిస్తారు. ఆ తర్వాత, జెంటింగ్ హైలాండ్స్‌కు వెళ్లి అక్కడ ఆనందించి రాత్రికి కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసి అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు (Day 4): టిఫిన్ తర్వాత హోటల్ నుండి చెక్-అవుట్ చేసి పుత్రజయను సందర్శించి, భోజనం పూర్తి చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా సింగపూర్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి భోజనం చేసి సింగపూర్‌లో బస చేస్తారు.

ఐదో రోజు (Day 5): అల్పాహారం తర్వాత సిటీ టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్కిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్‌ను సందర్శిస్తారు. భోజనం తర్వాత, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్ ను సందర్శిస్తారు. రాత్రి భోజనం తర్వాత సింగపూర్‌లోని హోటల్‌లో బస చేస్తారు.

ఆరో రోజు (Day 6): అల్పాహారం తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ను సందర్శిస్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వచ్చి, రాత్రి భోజనం పూర్తి చేసి అక్కడే బస చేస్తారు.

ఏడో రోజు (Day 7): టిఫిన్ తర్వాత హోటల్ నుండి చెక్-అవుట్ చేసి బర్డ్ ప్యారడైజ్‌ను సందర్శిస్తారు. భోజనం తర్వాత షాపింగ్ చేసి, సాయంత్రం సింగపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు విమాన ప్రయాణం మొదలవుతుంది. హైదరాబాద్‌కు చేరుకోగానే టూర్ ముగుస్తుంది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ప్యాకేజీ ధరలు
కంఫర్ట్ లో సింగిల్ షేరింగ్‌కు రూ.1,49,230
డబుల్ షేరింగ్‌కు రూ.1,21,980
ట్రిపుల్ షేరింగ్‌కు రూ.1,21,860

5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు:
బెడ్‌తో అయితే రూ.1,09,560
బెడ్ లేకుండా అయితే రూ.92,990

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?
విమాన టికెట్లు (హైదరాబాద్ – కౌలాలంపూర్ / సింగపూర్ – హైదరాబాద్)

హోటల్ వసతి
5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 లంచ్‌లు, 6 డిన్నర్‌లు
టూర్ పూర్తయ్యే వరకు గైడ్ అందుబాటులో ఉంటారు.
మలేషియా సింగపూర్ వీసా ఛార్జీలు
ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తారు.

ఈ టూర్‌కు వెళ్లడానికి మీకు 6 నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు, బుకింగ్ కోసం IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

విదేశీ ప్రయాణం అనేది చాలామంది కల. అలాంటి కలలను నిజం చేయడానికి IRCTC తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ చాలా బాగుంది. ముఖ్యంగా, తక్కువ ఖర్చుతో రెండు దేశాలను చూసే అవకాశం రావడం, అందులోనూ భోజనం, వసతి, వీసా, ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అవ్వడం అద్భుతం.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!