భారత దేశంలో కాశీ నగరం, రామేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత మరో నగరానికి లేదు. మరీ ముఖ్యంగా కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ( Kashi Travel Guide ) ఒకటి. ఈ నగరం, భూమి ఉన్నంత వరకు ఉంటుంది అంటారు. అంతటి మహామాన్వితమైన ప్రదేశమే కాశీ. ఈ స్టోరిలో కాశీ నగరంలో ఏం చూడాలి, కాశీ చరిత్ర ఏంటి ఆధ్మాత్మిక ప్రాధాన్య ఏంటి ? కాశీ వారణాసికి పేర్ల ప్రాధాన్యత..ఇలా కంప్లీట్ సమాచారం మీ కోసం.
ముఖ్యాంశాలు
కాశీ కథ | Kashi Travel Guide
కాశీ ( Kashi ) , రామేశ్వరానికి మధ్య ఆధ్మాత్మిక సంబంధం కూడా ఉంది. కాశీ నగర యాత్ర చేసిన ప్రతీ ప్రయాణికుడు రామేశ్వరం కూడా వెళ్లాలని భావిస్తాడు. రామేశ్వరంలో స్వామికి కాశీలో నీటితో అభిషేకం చేయడాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
కాశీ రామేశ్వరాలు | Kashi Rameswaram
దక్షిణ భారత దేశంలో ఉన్న భక్తులు కాశీ ఎంత పవిత్రమైనది అని భావిస్తోరో…ఉత్తరాన ఉన్న భక్తులు రామేశ్వరాన్ని( Rameswaram ) అంత పవిత్రంగా భావిస్తారు. కైలాసనాథుడు మహాశివుడు కాశీపై ఉన్న మమకారంతో ఈ నగరంలో విశ్వనాథుడిగా కొలువై ఉన్నాడు.
శివ స్వరూపుడు అయిన శ్రీరాముడు సేతు సంగమం జరిగిన పవిత్ర స్థలంలో రామలింగేశ్వరుడిని ప్రతిష్టిస్తాడు. పక్కనే ఆంజేనేయుడు కైలాసం నుంచి తీసుకువచ్చిన విశ్వేశ్వరుడిని కూడా స్థాపించి పూజలు చేస్తాడు.
ఈ రెండు చోట్ల కూడా తొలి పూజ విశ్వేశ్వర లింగ మూర్తికి చేయగా, తరువాత రామలింగేశ్వర ( Rama Lingeswara ) స్వామికి పూజలు చేస్తారు. కాశీ రామేశ్వరాలు అనేవి దక్షిణ, ఉత్తరాల ఆధ్మాత్మిక సంగమంతో పాటు, సాంఘికంగా ఒక్కటి చేసే పుణ్య క్షేత్రాలు.
కాశీ – వారణాశి ఒక్కటేనా ? | Kashi and Varanasi Name History
మహాశివుడి జటాజూటం నుంచి జారే గంగా భవాని కాశీవైపు ప్రవాహిస్తుంది. ఇక్కడే వరణ, ఇసి( (Varanasi Story ) అనే రెండు నదులు కూడా గంగలో చేరుకుంటాయి. అందుకే కాశీ నగరాన్ని వారణాసి ( Varanasi ) అని కూడా అంటారు. కాశీ అనేది పౌరాణికంగా, ప్రాచీన కాలం నుంచి పిలచే పేరు కాగా వారణాసి అనేది ఆధునికంగా పిలిచే పేరు. ఆధ్మాత్మికంగా అందరూ కాశీ అనే పేరుతో పిలవడానికి ఇష్టపడతారు భక్తులు. ఎందుకంటే కాశీదీ వేల సంవత్సరాల చరిత్ర.
కాశీ చరిత్ర | History Of Kashi
ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం కాశీ. కాలగమనంలో ఎన్నో మహానగరాలు నేట మట్టం అయ్యాయి. కాలగర్బంలో కలిపోయాయి. కానీ కాశీ మాత్రం నేటికి నిత్యనూతనంగా, ఆధ్మాత్మిక వైభవంతో విరాజిల్లుతోంది. కాశీ వీధుల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల సంచారం ఉంటుంది.
అడుగడుగునా ఒక ఆలయం. ప్రతీ ఆలయానిది ఒక ప్రత్యేక వైభవం. ఇదే కాశీ గొప్పతనం.
కాశీలో ప్రముఖ ఆలయాలు | Famous Temples In Kashi
కాశీలో అన్నపూర్ణేశ్వరి ఆలయం ( Kashi Annapurnai Temple ), కాశీ విశ్వేశ్వరాలయం, కాశీ విశాలాక్షి దర్శనం ఇలా కాశీ అనేది ఒక ఆధ్మాత్మిక సమస్తం. కాశీ విశాలాక్షి ఆలయం అనేది ఆష్టాదశ శక్తి పీఠాలలో ( Asta Dasha Shati Peethas ) ఒకటి. ఈ ఆలయానికి ముందుగా సాక్షి గణపతి దర్శనం ఇస్తారు. అంతేనా సూర్య నారాయణుడు, కాళ భైరవుడు, ఆంజనేయుడు కూడా భక్తుల కోసం అక్కడ కొలువై ఉన్నారు.
కాశీలో దుర్గాలయం, తులసి మానవ మందిరం, జ్ఞాన్ వాపి ( Gnan Vapi Temple ), ఆది కేశవ, బింధు మాధవ దేవాలయాలను మీరు తప్పకుండా చూడాల్సిందే.
కాశీ విశ్వనాథుడు | Kashi Vishwanath Temple
కాశీ అనేది కాశీ విశ్వేశ్వరుడికి చిరనివాసం. ఆయన ఇక్కడ వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. కాశీకి వచ్చిన ప్రతీ భక్తుడు ఆ విశ్వనాథుడిని దర్శించుకుంటాడు. ఇక్కడికి భారత దేశం నుంచే కాదు ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే ఈ అద్భుతమైన ఆలయం 1670 లో ధ్వసం అయింది. స్వామి విగ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేసి విఫలం అయ్యారు.
కానీ స్వామివారే స్వయంగా ఇండోర్ మహా రాణి అహిల్యాభాయ్ ( Indore Rani Ahilya bai ) కలలోకి వచ్చిన స్వామి తను ఉన్నది ఎక్కడో తెలిపారట. దీంతో ఆవిడ స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారట. దీంతో మహారాణి అహిల్యా భాయ్ స్వామి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. ఈ ఆలయాన్ని 1776 లో పూర్వ వైభవం తీసుకొచ్చారు.
కాశీలో ఆలయాల సంఖ్య | Total Temples In Kashi
కాశీలో ఉన్నన్ని ఆలయాలు ప్రపంచంలోలో మరెక్కడా లేవేమో. ఎందుకంటే కాశీ మూల విరాట్టు విశ్వనాథుడి ఆలయంతో పాటు ఇక్కడ మరో 2000 ఆలయాలు ఉన్నాయి అంటారు. ఈ ఆలయాల్లో కొన్ని అతి పురాతనమైనవి. దీంతో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని ఆలయాలను నిర్మించారు.
వ్యాపార కుటుంబం అయిన బిర్లాలు కాశీలో ఒక విశ్వనాథుడి ( Birla Temple In Kashi ) ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అనేది మదన్ మోహన్ మాలవ్య కాశి హిందూ విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఉంది. ఈ విశ్వవిద్యాలయం సంస్కృత ( Sanskrit )భాషను సేవలు చేస్తూ విద్యా పోషణ చేస్తోంది.
కాశీలో గంగా స్నానం | Holy Dip in Ganga River At Kashi
కాశీకి వస్తే గంగా నదీ స్నానం తప్పకుండా చేస్తారు భక్తులు. గంగా నది చుట్టూ భక్తులు స్నానాలు చేసేందుకు మొత్తం 64 ఘాట్‌లు ( Ghats In Kashi ) ఉన్నాయి. ఇందులో దశాశ్వమేధ అనే ఘాట్, మల్లికర్ణిక ఘాట్, పంచగంగా ఘాట్, అసీ ఘాట్ చాలా ముఖ్యమైనవి. చాలా మంది ఈ ఐదు ఘాట్లలో స్నానం చేసి తరువాత కాశీ నగర ప్రదక్షిణ చేస్తుంటారు.
చివరి రోజులు ఇక్కడే | Harishchandra Ghat
చాలా మంది కాశీలో తమ చివరి రోజులు గడిపేందుకు వస్తారు. ఇక్కడే మరణించాలని వేచి చూస్తుంటారు. అంతే కాదు ఎక్కడెక్కడో మరణించిన వారి భౌతిక కాయాలను కాశీకి తీసుకొచ్చి దహనం చేస్తుంటారు. దీంతో పాటు ఎక్కడో దహనం చేసి శరీర అస్తికలను ఇక్కడికి వచ్చి గంగా నదిలో కలిపేస్తుంటారు. అందుకే ఇక్కడి హరిశ్చంద్ర ఘాట్ చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఇక్కడ సత్య హరిశ్చంద్రుడు ( Raja Harishchandra ) ఇచ్చిన మాట తప్పరాదని ఇక్కడ ఈ కాటికి కాపరిగా పని చేశారని పురాణాలు చెబుతాయి.
కాశీ పురాణ కథ | The Legend Of Kashi
కాశీ నగరం అనేది వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని మేథావులకు ఒక గమ్యస్థానం, పుణ్యక్షేత్రంగా ఉంది. ఇక్కడికి గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుచాజాచార్యులు, చైనా ప్రపంచ యాత్రికుడు హ్యూయాన్ సాంగ్, చైతన్య మహా ప్రభు, తులసి దాస్ వంటి ఎంతో మంది సందర్శించారు.
పొరుగు దేశం వారు వచ్చి దండయాత్రలు చేసినా కాశీ నగరం తన తేజస్సును, ఉషస్సును, వైభవాన్ని కోల్పోలేదు. తన ఆధ్మాత్మిక కీర్తిని కాపాడుకోవడం కాశీ నగరానికి బాగా తెలుసు. ఆ కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఇది. దీన్ని ఆయనే కాపాతుంటాడు. మహా కుంభ మేళ ( Maha Kumbha Mela 2025 ) సందర్భంగా రాసిన ఈ కథనం గురించి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. థ్యాంక్యూ
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని ఆధ్మాత్మి కథనాలు
- Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Places Near Badrinath : బద్రినాథ్కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
తిరుమల అప్డేట్స్
- TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి !
- TTD Updates : తిరుపతి స్థానికులు శ్రీవారిని ఈ రోజుల్లో దర్శించుకోవచ్చు…టీటీడి 6 మార్గదర్శకాలు
- Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…
- Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా