Kerala : కుక్కలను దేవుడిగా పూజించే అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Kerala :పెంపుడు జంతువులలో కుక్క అత్యంత నమ్మకమైనది. మరి కుక్కను దేవుడిగా పూజించే ఒక ఆలయం ఉంది. కేరళలోని శ్రీ మతతుతప్పన్ ఆలయంలో కుక్కలను దేవుళ్లుగా భావిస్తారు. ఆ ఆలయం విషయాలు, చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. దేశ రాజధానిలో వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, కుక్కలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేరళలోని పర్షిని మడప్పురాలో ఉన్న శ్రీ మతుతప్పన్ ఆలయంలో కుక్కలను దేవుళ్లుగా పూజిస్తారు. ఇక్కడ కుక్కలను పూజారులుగా భావిస్తారు. ఈ ఆలయం కేరళలోని కన్నూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నాయుట్టు ఆచారం
ఆలయంలో కుక్కలకు ఆహారం పెట్టే ఆచారాన్ని కేరళలో నాయుట్టు అని అంటారు. ఇక్కడ కుక్కే దైవం కాబట్టి, భక్తులు ఎండిన చేపలు, ఉడికించిన నల్ల శనగలు, టీని ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే కుక్కలకు ఆ ప్రసాదాన్ని సమర్పించి, భక్తులకు పంచుతారు. ఆలయ సిబ్బంది ఇక్కడున్న సుందరి అనే కుక్కను, దాని పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

ఆశ్చర్యకరమైన విషయం
ఈ ఆలయం గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ కుక్క కాటుకు గురైన ఘటనలు లేదా దాడుల గురించి ఒక్క రికార్డు కూడా లేదు. ఇది అక్కడి ప్రజలకు ఆ ఆలయంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
రెండు రకాల తేయ్యం
కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో తేయ్యం అనే ఒక ప్రాచీన జానపద నృత్యం ప్రసిద్ధి చెందింది. ఇది దేవుళ్లను సంతోషపెట్టడానికి చేసే నృత్యం. ఇక్కడ తేయ్యం అంటే దైవం అని అర్థం. దీనిని వన్నన్ తెగ సభ్యులు ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో మతుతప్పన్ వేషం వేసుకున్న ఒక వ్యక్తి కల్లు తాగుతాడు. దీని ఉద్దేశ్యం ఆ వ్యక్తి తన వ్యక్తిగత భావోద్వేగాలను మరచిపోయి, ఒక దేవుడిలా ప్రవర్తించడం. ఈ తేయ్యంలో ప్రతి భక్తుడు పాల్గొనవచ్చు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఆలయ నిర్మాణం
ఆలయం మూడు అంతస్తుల నిర్మాణం. ఇది కేరళ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి నిదర్శనం. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అనుమతిస్తారు. అయితే, కొన్ని ఆచారాల సమయంలో నిషేధం. ఆలయం ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా చేయించుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి
రోడ్డు మార్గం:
కన్నూర్, తలిపరంబ, ఇంకా సమీప పట్టణాల నుండి బస్సుల ద్వారా, టాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
రైలు మార్గం:
సమీప రైల్వే స్టేషన్లు కన్నూర్, పయ్యనూరు. రెండు స్టేషన్ల నుంచి స్థానిక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. కన్నూర్ స్టేషన్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి సుమారు 45 నిమిషాలు పడుతుంది.
విమాన మార్గం:
కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి 40 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుంచి టాక్సీ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు.
మీరు కేరళకు వస్తున్నట్లయితే ఈ ఆలయం పక్కనే ఉన్న తలిపరంబలోని రాజరాజేశ్వర ఆలయం, పర్షినిక్కడవ్, పయ్యనూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించేలా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.