భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూ-కశ్మీర్‌లో జీ మోర్ అనే సొరంగ మార్గాన్ని ( Z-Morh Tunnel ) ప్రారంభించారు. జమ్మూ, కశ్మీర్‌లోని గాందర్భాల జిల్లాలో ఉన్న ఈ టన్నెల్ అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైనది.
ముఖ్యాంశాలు
ఇంజినీరింగ్ అద్భుతంగా భావించే ఈ టన్నెల్‌ను నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ( NHIDCL ) నిర్మించింది. శ్రీనగర్, సోన్‌మార్గ్‌ను ఈ టన్నెల్ ఏడాది పొడునా కనెక్ట్ చేస్తుంది. దీని వల్ల ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం ఏడాది పొడవునా నిరాటంకంగా కొనసాగనుంది. స్థానిక ప్రజల ఆర్థిక స్థితుగతుల్లో మార్పు తీసుకురానుంది సోన్‌మార్గ్ టన్నెల్.
జీ మోర్ టన్నెల్ | Z-Morh- Sonmarg Tunnel Significance
జీ మోర్ టన్నెల్‌కు ఆ పేరు పెట్టడానికి కారణం ఈ టన్నెల్ నిర్మించడానికి ముందు అక్కడ జీ ( Z ) ఆకారంలో రోడ్డు ఉండేది. 8500 ఎత్తులో ఉన్న ఈ రోడ్డుపై వెళ్ల వారికి మంచు హిమపాతాల ( Snow Avalanches ) నుంచి ముప్పు పొంచి ఉండేది. మరీ ముఖ్యంగా చలికాలం అయితే ఈ మార్గాన్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేసేవారు.
సోన్‌మార్గ్ ప్రాంతానికి శ్రీనగర్ ప్రాంతం నుంచి వెళ్లడం అనేది సాధ్యం అయ్యేది కాదు. దీంతో ఈ మార్గంలో ఒక సొరంగ మార్గాన్ని నిర్మించి ఏడాది మొత్తం రవాణా సౌకర్యం కల్పించాలి అనుకున్నారు. అందులో భాగంగా పలు టన్నెల్స్ నిర్మించాలని భావించారు. వీటి వల్ల 49 కిమీ దూరం 43 కు తగ్గించాలని, వాహన వేగాన్ని గంటకు 30 కిమీ నుంచి 70 కి పెంచాలని, ప్రయాణ సమయాన్న తగ్గించాలని భావించారు.
2012 నుంచి 2025 వరకు ప్రస్థానం ఇలా..

2012లో ప్రాజెక్టును తొలూత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ( BRO ) ప్రారంభించింది. తరువాత దీనిని ఎన్‌హెచ్ఐడీసీఎల్ హ్యాండోవర్ చేసుకుంది. ఈ సొరంగ మార్గాన్ని 2023 లోపు పూర్తి చేయాలని భావించారు. అయితే అనేక కారణాల వల్ల ఇది ఆలస్యంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సోన్‌మార్గ్ టన్నెల్ వల్ల స్థానికులు చలికాలం కూడా శ్రీనగర్ నుంచి సోన్‌మార్గ్ మధ్య రాకపోకలు కొనసాగించనున్నారు. అంతే కాదు ఇది లఢఖ్ ప్రాంతానికి వెళ్లేందుకు ఒక సురక్షితమైన మార్గం కూడా అవనుంది. ఈ టన్నెల్ వల్ల ప్రజారవాణా వ్యవస్థ మెరుగు అవడం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు డిఫెన్స్ లాజిస్టిక్ విషయంలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.
సురక్షితమైన టన్నెల్ | How Safe Z Morh Tunnel is ?
సోన్‌మార్గ్‌లోని జీ మోర్ టన్నెల్‌ను అధునాతన ఇంజినీరింగ్ సాంకేతికతను వినియోగించి , ఎక్కువ కాలం సురక్షిత ప్రయాణాన్ని అందించే విధంగా నిర్మించారు. ఈ సొరంగం గుండా చిన్న వాహనాలే కాదు భారీ వాహనాలు కూడా ఏడాది పొడవునా ప్రయాణించగలవు. ఏమైనా అనుకోని విపత్తులు జరిగినప్పుడు బయటపడటానికి ప్రత్యామ్నాయంగా ఇందులో ఎమర్జెన్సీ ఎగ్జిట్, వెంటిలేషన్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
బంగారు రోడ్డు సోన్‌మార్గ్ టన్నెల్ | Importance Of Sonmarg Tunnel
6.5 కిమీ పొడవైన ఈ బై డైరెక్షనల్ టన్నెల్ ( రెండు లైన్ల మార్గం ) రాక ముందు స్థానికంగా ఉన్న గగన్‌గిరి ప్రాంతం నుంచి సోన్‌మార్గ్ మార్గం చలికాలంలో మూసుకుపోయేది. సోన్‌మార్గ్ టన్నెల్ పూర్తి అవడం వల్ల ఏడాది మొత్తం రాకపోకలు కొనసాగనున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు లాభపడనున్నాయి.
జమ్మూకాశ్మీర్‌ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి ఇది మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈ టన్నెల్ వల్ల ఇక్కడ ప్రీమిమం స్కీయింగ్ రిసార్టులు ( Skiing in Jammu and Kashmir ) ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుంది అని.

గతంలో చలికాలం మొదలయ్యే నాటికి స్థానిక ప్రజలు తమ నివాసాలను, వ్యాపారాలను వదిలి శ్రీనగర్ లేదా సోన్‌మార్గ్ ఏదో ప్రాంతానికి షిఫ్ట్ అయ్యేవాళ్లు. చలికాలం అంతా ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వెసులుబాటు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయేవారు స్థానికులు. అయితే ఈ టన్నెల్ వల్ల ప్రజలు చలికాలం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా ఒకే ప్రాంతంలో ఉండగలరు అని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
కీ పాయింట్స్ | Key Factors Of Z Morh Sonmarg Tunnel
- శ్రీనగర్ సోన్‌మార్గ్ మధ్య ఏడాది పొడవునా ప్రయాణం కొనసాగించే విధంగా 12 కీమీ మేరా టన్నెల్స్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా 6 కీమీ పొడవైన జీ మోర్ టన్నెల్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
- స్థానికంగా నిర్మాణంలో ఉన్న జోజిలా ( Zojila ) అనే మరో టన్నెల్ 2028 లో పూర్తి కానుంది. దీని వల్ల ప్రయాణ దూరం మరింతగా తగ్గనుంది. ఈ రెండు టన్నెల్స్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మరింగ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది.
- జీ మోర్ టన్నెల్ గుండా గంటకు 1,000 వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చు.
- గరిష్టంగా 80 కిమీ వేగంగా ప్రయాణించవచ్చు.
- ఈ టన్నెల్ కింది భాగంలో 7.5 మీటర్ల ఎమర్జెన్సీ టన్నెల్ కూడా ఉంది.
- ఈ ఎమర్జెన్సీ టన్నెల్‌ను అత్యవసర సమయంలో వినియోగించడంతో పాటు వీలయితే భవిష్యత్తులో రైల్వే అవసరాలకు వినియోగించే అవకాశం కూడా ఉంది.
- ఈ టన్నెల్‌ను రూ.2700 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
ఎన్నో అవాంతరాలు | Key Challenges In Sonmarg Tunnel Construction
2013 నుంచి ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు, వైఫల్యాలు ఎదురయ్యాయి. దీంతో పాటు సముద్ర మట్టానికి 8650 ఎత్తులో ఇలాంటి భారీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. దీని కోసం వాతావరణంతో సమస్యలతో పోరాడటంతో పాటు యంత్రాలను, ఇతర పనిముట్లను అంత ఎత్తులోకి తీసుకెళ్లడం కూడా సవాలుగా మారాయి. అయితే ఎన్నో సవాళ్లను స్వీకరిస్తూ, వాటిని ఎదుర్కొని భారత ఇంజనీర్లు దీని నిర్మాణం పూర్తి చేయగా, భారత ప్రధాని ఈ టన్నెల్‌ను నేడు జాతికి అంకితం చేశారు.
Trending Video On : Prayanikudu Youtube Channel
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!