Passport : విదేశాల్లో పాస్‌పోర్ట్ పోయిందా? పరేషాన్ అవ్వొద్దు.. ఇలా చేస్తే కొత్త పాస్‌పోర్ట్ ఈజీగా వస్తుంది
Passport : ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మన జాతీయతను నిరూపించడమే కాక, విదేశాల్లో మనల్ని రక్షిస్తుంది. అలాంటి ముఖ్యమైన పాస్‌పోర్ట్‌ను విదేశీ ప్రయాణంలో పోగొట్టుకుంటే, అది ఏ భారతీయుడికైనా చాలా ఆందోళన కలిగించే విషయం. దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, భయంతో ఏం చేయాలో తోచదు. ఎందుకంటే పాస్‌పోర్ట్ లేకుండా విదేశాల్లో ప్రయాణించడం, తిరిగి ఇండియాకు రావడం చాలా కష్టం. అయితే మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించి, మీరు సులభంగా కొత్త పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు.

వెంటనే చేయాల్సిన మొదటి రెండు పనులు
పాస్‌పోర్ట్ పోయిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని స్థానిక పోలీసులకు ఫిర్యాదు (Complaint to the local police) చేయడం. మీరు కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసినప్పుడు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ పోలీసు ఫిర్యాదు నివేదిక (Police Report) చాలా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడుతుంది. కాబట్టి, సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, తప్పకుండా ఫిర్యాదు నమోదు చేయాలి. పోలీసు రిపోర్టు తీసుకున్న తర్వాత, మీరు తదుపరి ప్రక్రియ కోసం వెంటనే ఇండియన్ ఎంబసీ (Embassy) లేదా కాన్సులేట్‌ను (Consulate) సంప్రదించాలి. అక్కడ ఉన్న అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, తరువాత ఏం చేయాలో వివరంగా తెలియజేస్తారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
కొత్త పాస్‌పోర్ట్ లేదా అత్యవసర సర్టిఫికెట్
మీకు ఏదైనా అత్యవసర కారణంగా వెంటనే భారతదేశానికి తిరిగి రావాల్సి వస్తే, ఎంబసీ మీకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (Emergency Certificate – EC) జారీ చేయగలదు. ఇది కేవలం భారతదేశానికి తిరిగి రావడానికి మాత్రమే ఉపయోగపడే వన్-వే ప్రయాణ పత్రం. దీనిని ఉపయోగించి మీరు అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేరు. ఒకవేళ మీరు వెంటనే ఇండియాకు రానవసరం లేకుండా, మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, మీరు మీ గుర్తింపు పత్రాలు, పోలీసు రిపోర్ట్, ఫోటోగ్రాఫ్‌లు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే, కొత్త పాస్‌పోర్ట్ ప్రక్రియ వేగవంతమవుతుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
